ఇండిగో విమానంలో... రిపబ్లిక్ టీవీ వ్యాఖ్యాత ఆర్ణబ్ గోస్వామి వృత్తి ప్రమాణాలను ప్రశ్నించినందుకు స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాను నాలుగు విమాన యాన సంస్థలు నిషేధించాయి. దీనిపై స్పందించిన కమ్రా.. ప్రధాని మోడీపై వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. ‘‘మోడీజీ నేను నడవొచ్చా.. లేక దాన్ని కూడా నిషేధించారా’’ అని బుధవారం ట్విట్టర్లో ప్రశ్నించారు. లక్నోనుంచి బయలుదేరే విమానంలో గోస్వామిని కలసి ‘‘నిజాయితీగా చర్చిద్దా’’మంటే వెళ్లిపొమ్మన్నారని కమ్రా వివరించారు.
2020-01-29న్యూజీలాండ్ జట్టుతో 5 మ్యాచుల టి20 సిరీస్ తొలి మూడు పోటీల్లోనూ ఇండియా విజయం సాధించింది. బుధవారం జరిగిన మూడో పోటీలో రెండు జట్లూ సమానంగా (179) పరుగులు చేయడంతో ‘సూపర్ ఓవర్’ ఆడారు. తొలుత అదనపు ఓవర్ ఆడిన న్యూజీలాండ్ 17 పరుగులు చేయగా..భారత బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, రాహుల్ 20 పరుగులు సాధించారు. చివరి 2 బంతులకు రెండు సిక్సర్లు కొట్టి రోహిత్ శర్మ గెలుపును అందించారు. న్యూజీలాండ్ గడ్డపై ఇండియా టి20 సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.
2020-01-29కమెడియన్ కునాల్ కమ్రాను తమ విమానాలు ఎక్కనివ్వబోమని ఇండిగో, ఎయిర్ ఇండియా తర్వాత స్పైస్ జెట్, గో ఎయిర్ కూడా ప్రకటించాయి. ఇండిగో విమానంలో రిపబ్లిక్ టీవీ ప్రధాన వ్యాఖ్యాత ఆర్ణబ్ గోస్వామిని ఎగతాళి చేసినందుకు..కమ్రాను ఆరు నెలలపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. తర్వాత ఎయిర్ ఇండియా, తాజాగా బుధవారం స్పైస్ జెట్, గో ఎయిర్ నిషేధించాయి. తదుపరి ప్రకటన చేసేవరకు కమ్రాపై సస్పెన్షన్ ఉంటుందని ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ తెలిపాయి.
2020-01-29న్యూజీలాండ్ జట్టుతో మూడో టి20లో ఇండియా తొలుత బ్యాటింగ్ చేసి 179 పరుగులు సాధించింది. న్యూజీలాండ్ లోని హామిల్టన్ సెడాన్ పార్కులో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ 40 బంతుల్లో 65 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజీలాండ్ గడ్డపై తొలి టి20 సిరీస్ విజయాన్ని నమోదు చేసే దిశగా భారత ఆటగాళ్లు ధాటిగా ఆడారు. గతంలో రెండు సిరీస్ లలో న్యూజీలాండ్ విజయం సాధించింది. ఈసారి మూడు వరుస విజయాలతో సిరీస్ విజయాన్ని సాధించాలని ఇండియా పట్టుదలగా ఉంది.
2020-01-29చైనాలో ‘కరోనా వైరస్’ బారిన పడ్డ వ్యక్తుల సంఖ్య 5,974కు చేరింది. గతంలో సార్స్ బారిన పడిన చైనీయుల సంఖ్య కంటే ఇది అధికం. కరోనా బాధితుల సంఖ్య ఇంకా... గంట గంటకూ పెరుగుతోంది. ఇప్పటికి 132 మంది మృత్యువాత పడ్డారు. 2002, 03లలో చైనా భూభాగంపైన సార్స్ కేసులు 5,327 నమోదయ్యాయి. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా 770 మంది మరణించగా, అందులో చైనీయుల సంఖ్య 349. ‘సార్స్’తో పోలిస్తే ‘కరోనా’ మృతుల సంఖ్య ఇప్పటికి తక్కువగానే ఉన్నా... వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంది.
2020-01-29అనురాగ్ ఠాకూర్...క్రికెట్ లోనూ, రాజకీయాల్లోనూ వివాదాస్పదుడే! బి.సి.సి.ఐ. అధ్యక్ష పదవినుంచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తొలగిస్తే...ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరితంగా వ్యవహరించినందుకు ఎన్నికల సంఘం నిషేధించింది. ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి అనురాగ్ ఠాకూర్, పర్వేష్ సాహిబ్ సింగ్ లను తప్పించాలని ఈసీ బుధవారం ఆదేశించింది. ఠాకూర్ సిఎఎ వ్యతిరేకులను ఉద్ధేశించి ‘‘కాల్చిచంపాలి’’ అని నినాదాలు ఇప్పించిన సంగతి తెలిసిందే.
2020-01-29భారత బ్యాడ్మింటన్ దిగ్గజాల్లో ఒకరైన సైనా నెహ్వాల్ బుధవారం బి.జె.పి.లో చేరారు. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆమెకు కాషాయ కండువా కప్పారు. సైనా సోదరి చంద్రాన్హు నెహ్వాల్ కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంకోసం చాలా కష్టపడుతున్నారని, క్రీడలకోసమూ ఖేలో ఇండియా వంటి పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా సైనా పేర్కొన్నారు.
2020-01-29కరోనావైరస్ కమ్ముకున్న ‘వుహాన్’ నగరంలో రెండు సరికొత్త ఆసుపత్రులను చైనా యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తోంది. హుషెన్షాన్ ఆసుపత్రి ఫిబ్రవరి 3న 1000 పడకలతో ప్రారంభం కానుంది. దీని నిర్మాణం ప్రారంభమై మంగళవారానికి ఐదు రోజులు. మరో ఐదు రోజుల్లో 25,000 చదరపు మీటర్ల నిర్మాణం పూర్తవుతుంది. అక్కడే లీషెన్‌షాన్ ఆసుపత్రి మరింత వేగంగా నిర్మితమవుతోంది. రెండు రోజుల క్రితమే నిర్మాణం ప్రారంభమైంది. ఆసుపత్రి 30,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1,300 పడకలతో ఫిబ్రవరి 5న ప్రారంభం కానుంది.
2020-01-28కరీబియన్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదైంది. సముద్రంలో ఇంతటి భారీ భూకంపం రావడంతో క్యూబా, జమైకా, కేమన్ ఐలాండ్స్ తీర ప్రాంతాలపై ప్రమాదకరమైన సునామీ అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. మెక్సికో, హోండురాస్ దేశాలకు కూడా అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
2020-01-29 Read More‘వుహాన్ కరోనా వైరస్’కు తాము ఇప్పటికే వ్యాక్సిన్ అభివృద్ధి చేశామని హాంకాంగ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ యుయెన్ క్వాక్-యంగ్ ప్రకటించారు. అంటువ్యాధుల నిపుణుడైన యంగ్, కొత్త వ్యాక్సిన్ ను జంతువులపై ప్రయోగించడానికి చాలా సమయం అవసరమని చెప్పారు. రోగులకోసం ఎప్పటికి సిద్ధమవుతుందన్న విషయాన్ని ఆయన చెప్పలేదు. అయితే, హాంగ్ కాంగ్ నగరంలో నమోదైన తొలి కేసులో వైరస్ ను దూరం చేశామని ప్రకటించారు.
2020-01-28