దొంగ నోట్లను ముద్రించడానికి వీల్లేకుండా కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో రూ. 2000 నోట్లు విడుదల చేశామని కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం చెప్పింది. అయితే, ఇప్పుడు అదే రూ. 2000 నకిలీ నోట్లు మెరుగైన నాణ్యతతో భారీగా మార్కెట్ లోకి వస్తున్నాయి. తాజాగా ఖమ్మంలో రూ. 7 కోట్ల మేరకు దొంగ నోట్లు పట్టుబడ్డాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో చెలామణి చేస్తున్న ముఠాలోని ఐదుగురిని పట్టుకున్నట్టు ఖమ్మం నగర పోలీసు కమిషనర్ ఇక్బాల్ శనివారం వెల్లడించారు.
2019-11-02భారత దేశ ఆర్థిక వ్యవస్థ సూచీలు చాలా వరకు నేల వైపు చూస్తుంటే... నిరుద్యోగం రేటు మాత్రం ఆకాశాన్ని వీక్షిస్తోంది. అక్టోబరు మాసంలో నిరుద్యోగం రేటు 8.5 శాతానికి పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) తాజా డేటా శుక్రవారం విడుదలైంది. సెప్టెంబరులో 7.2% ఉన్న నిరుద్యోగం స్థాయి అక్టోబరులో మరింత పెరిగింది. 2016 ఆగస్టు తర్వాత ఇదే గరిష్ఠం.
2019-11-02‘యునెస్కో’ తన ‘సృజనాత్మక నగరాల నెట్వర్క్’ (యుసిసిఎన్)లో తాజాగా ముంబయి, హైదరాబాద్ లను చేర్చింది. సినిమా కళలో ముంబయి నగరాన్ని, ఆహార రంగంలో హైదరాబాద్ నగరాన్ని గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా 66 నగరాలు తాజా యుసిసిఎన్ జాబితాలో చేరాయి. 2004లో ప్రారంభమైన నాటినుంచి 246 నగరాలు నెట్వర్క్ లో భాగమయ్యాయి. ఇండియా నుంచి 2015లో జైపూర్ (జానపద కళలు), వారణాసి (సంగీతం), 2017లో చెన్నై (సంగీతం) గుర్తింపు పొందాయి.
2019-10-31 Read Moreప్రధానమంత్రి ఆవాస యోజన (పట్టణ) పథకం కింద దేశవ్యాప్తంగా 2,31,532 ఇళ్ళ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో ఆంధ్రప్రదశ్ రాష్ట్రానికే 1,24,624 ఇళ్ళు మంజూరయ్యాయి. తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 52,446 ఇళ్లు మంజూరయ్యాయి. తాజా మంజూరుతో.. ఈ రెండు రాష్ట్రాల్లో పట్టణ ప్రాంత గృహ అవసరాలు 100 శాతం తీరతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏపీలో 13.78 లక్షల ఇళ్లు, యూపీలో 15 లక్షల ఇళ్లు పట్టణ ప్రాంతాల్లో అవసరం కాగా అనేక విడతలుగా ఆ మొత్తాన్ని మంజూరు చేశారు.
2019-11-022024 నాటికి 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ‘కోల్ ఇండియా’ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. కోల్ ఇండియా సంస్థ 45వ వ్యవస్థాపక దినోత్సవాన మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం కోల్ ఇండియా వార్షిక ఉత్పత్తి లక్ష్యం 66 కోట్ల టన్నులని, దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం బొగ్గులో అది 82 శాతంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. కోల్ ఇండియా 2020-21 నాటికి 75 కోట్ల టన్నులు, 2023-24 నాటికి 100 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తుందని మంత్రి వివరించారు.
2019-11-02 Read Moreవస్తు సేవల పన్ను (జి.ఎస్.టి) కింద అక్టోబర్ మాసంలో రూ. 95,380 కోట్లు వసూలయ్యాయి. గత ఏడాది అక్టోబరు (రూ. 1,00,710 కోట్లు)తో పోలిస్తే ఈ మొత్తం 5.3 శాతం తక్కువ. పండుగ మాసమైనా అక్టోబరులో వసూళ్లు తగ్గడం గమనార్హం. వరుసగా మూడో నెల...జీఎస్టీ లక్ష కోట్ల కంటే తక్కువ వసూలైంది. అక్టోబరులో సీజీఎస్టీ కింద రూ. 17,582 కోట్లు, ఎస్.జి.ఎస్.టి. కింద రూ. 23,674 కోట్లు, ఐ.జి.ఎస్.టి. కింద రూ. 46,517 కోట్లు (దిగుమతుల ద్వారా రూ. 21,446 కోట్లు), సెస్ రూపంలో రూ. 7,607 కోట్లు వసూలయ్యాయి.
2019-11-02 Read Moreఅమెరికాపై 3.6 బిలియన్ డాలర్ల మేరకు ఆంక్షలు విధించడానికి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) చైనాకు అనుమతి ఇచ్చింది. అమెరికా యాంటీ డంపింగ్ ఆంక్షలకు పరిహారంగా ఈ మొత్తాన్ని విధించడానికి డబ్ల్యుటిఒ ఆమోదం తెలిపింది. డబ్ల్యుటిఒ చరిత్రలో అనుమతించిన పరిహారాల్లో ఇది మూడో పెద్ద మొత్తం. రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సుంకాల యుద్దం ప్రారంభం కావడానికి ముందే చైనా ఈ కేసును దాఖలు చేసింది. దానిపై డబ్ల్యుటిఒ తీర్పు తాజాగా వెలువడింది.
2019-11-02 Read Moreవంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 76 మేరకు పెంచుతూ ఇండియన్ ఆయిల్ నిర్ణయం తీసుకుంది. తాజాగా పెంచిన ధరతో కలిపి శుక్రవారం (నవంబర్ 1) నుంచి 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 700 దాటుతోంది. సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 605 నుంచి రూ. 681.50కి, కోల్ కతలో రూ. 630 నుంచి రూ. 706కు, ముంబయిలో రూ. 574.50 నుంచి రూ. 651కి, చెన్నైలో రూ. 620 నుంచి రూ. 696కు పెరిగింది. ఆగస్టు నుంచి చూస్తే సిలిండర్ ధర రూ. 106 వరకు పెరిగింది. అదే సమయంలో విమాన ఇంథనం సగటున 3 శాతం తగ్గింది.
2019-11-01 Read Moreజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. రాష్ట్రంలోని 81 నియోజకవర్గాలకు 5 దశల్లో ఎన్నికలు నిర్వహించబోతోంది. నవంబర్ 30, డిసెంబర్ 7, 12, 16, 20 తేదీల్లో పోలింగ్ నిర్వహించనుంది. డిసెంబర్ 23వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రం కావడంతో 67 నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 2014లో బీజేపీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. హర్యానాలో మిశ్రమ ఫలితాల నేపథ్యంలో జార్ఖండ్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.
2019-11-01ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఆయన ముఖ్యమంత్రి అయినా కోర్టుకు హాజరు కావలసిందేనని హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ అక్రమంగా ఆస్తులు సంపాదించారని సీబీఐ కేసులు నమోదు చేసింది. ఎన్నికలకు ముందు కోర్టుకు హాజరైన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ తో ఏకీభవించిన కోర్టు, జగన్ విన్నపాన్ని కొట్టేసింది.
2019-11-01