కేంద్ర ప్రభుత్వ అప్పు ఈ ఏడాది కోటి కోట్లు దాటనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనా ప్రకారం... రూ. 100,18,421 కోట్ల అప్పు ఉంటుందని, దానిపై రూ. 6,63,297 కోట్లు వడ్డీకి పోతుందని కేంద్రం సోమవారం లోక్ సభకు తెలిపింది. అందులో రూ. 78,97,497 కోట్లు అంతర్గత అప్పు, విదేశీ అప్పు రూ. 2,92,867 కోట్లు కాగా... ఇతర రూపాల్లో మరో రూ. 18,28,057 కోట్లు అవుతుందని కేంద్రం వివరించింది. అంతర్గత అప్పుపై వడ్డీ రూ. 5,92,645 కోట్లకు పెరుగుతోంది.
2020-02-102019-20లో ఫిబ్రవరి 5 వరకు తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలను కేంద్రం సోమవారం లోక్ సభలో వెల్లడించింది. స్థానిక సంస్థలకు వచ్చే గ్రాంట్లు మినహా మిగిలిన గ్రాంట్లు, పన్నుల్లో వాటా తగ్గాయి. కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు రూ. 13,009 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ఏడాది 12 నెలలకు రూ. 18,560.88 కోట్లను కేంద్రం పంపిణీ చేసింది. స్థానిక సంస్థలకు గత ఏడాది కంటే ఎక్కువగా రూ. 1,953 కోట్లు రాగా... కేంద్ర పథకాలకింద వచ్చే గ్రాంట్లు రూ. 5,737 కోట్లకు తగ్గిపోయాయి.
2020-02-10సీనియర్ ఐపిఎస్ అధికారి ఎ.బి. వెంకటేశ్వరరావు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, అందువల్ల ‘లుకవుట్’ నోటీసు జారీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మొన్న సస్పెన్షన్ కు గురైన ఎ.బి.పై సోమవారం చెవిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలో ఎ.బి. వెంకటేశ్వరరావు సాటి ఐ.పి.ఎస్.లను వేధించారని, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్, భూదందాలకు పాల్పడ్డారని చెవిరెడ్డి ఆరోపించారు.
2020-02-10నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఒక్క ఏడాది కూడా పంచాయతీరాజ్ సంస్థలకు 100 శాతం నిధులు ఇవ్వలేదు. ఇందుకు.. రాష్ట్రాలు యు.సి.లు సమర్పించకపోవడం, ఎన్నికలు నిర్వహించకపోవడం వంటి కారణాలు చెబుతున్నారు. అయితే, 2013-14లో కేటాయించిన మొత్తానికి 106.63 శాతం నిధులు విడుదల కావడం గమనార్హం. ఆ తర్వాత 2014-15లో కేటాయింపుల్లో 89.85%, 2015-16లో 99.47%, 2016-17లో 98.07%, 2017-18లో 90.98%, 2018-19లో మరీ తక్కువగా 84.09% నిధులు విడుదలయ్యాయి.
2020-02-10కావేరీ డెల్టాను ‘రక్షిత వ్యవసాయ జోన్’గా ప్రకటించామని, ఆ ప్రాంతంలో చమురు- సహజ వాయువు అన్వేషణ ప్రాజెక్టులను అనుమతించబోమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక చట్టం తేవడానికి న్యాయ నిపుణులతో చర్చిస్తామని సిఎం చెప్పారు. కావేరీ బేసిన్లో చమురు, సహజ వాయువు అన్వేషణకు కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టులను ఇచ్చింది. అసలే సాగునీటి సంక్షోభం ఎదుర్కొంటున్న తమిళనాట ఈ కాంట్రాక్టులపై నిరసన వ్యక్తమైంది.
2020-02-09‘జూడీ’ కథానాయకి రెనీ జెల్ వెగర్, జోకర్ కథానాయకుడు జాక్విన్ ఫీనిక్స్ ఆస్కార్ 2020 ఉత్తమ నటీ నటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా ‘పారసైట్’ ఎంపికైంది. 92వ అకాడమీ అవార్డులను కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ‘పారసైట్’ ఉత్తమ దర్శకత్వంతో పాటు మొత్తం నాలుగు అవార్డులను కైవశం చేసుకుంది. దక్షిణ కొరియా దర్శకుడు బాంగ్ జూన్ హో ‘పారసైట్’కోసం ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో కూడా అవార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా కూడా ‘పారసైట్’ నిలిచింది.
2020-02-10ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. కోటా ఇవ్వాలని రాష్ట్రాలను బలవంతం చేయలేమని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్ ప్రజా పనుల విభాగం అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు ప్రమోషన్ల విషయంలో ‘ఎస్.సి, ఎస్.టి. కోటా’పై సుప్రీం ఇలా స్పందించింది. కోటా ఇవ్వాలంటూ 2012లో ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
2020-02-08రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదన్న సుప్రీంకోర్టు తీర్పుపై అత్యవసర చర్చ కోరుతూ సిపిఎం రాజ్యసభలో నోటీసు ఇచ్చింది. సాధారణ కార్యకలాపాలను సస్పెండ్ చేసి ఈ అంశంపై చర్చించాలని కోరుతూ సిపిఎం సభ్యుడు కె.కె. రాగేష్ నోటీసును సమర్పించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని, ప్రమోషన్లు కల్పించాల్సిందిగా రాష్ట్రాలను బలవంతం చేయజాలమని శుక్రవారం సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ కు సంబంధించిన ఓ కేసులో తీర్పు చెప్పింది.
2020-02-10తెలంగాణలో ఇక జాయింట్ కలెక్టర్లు ఉండరు. వారి హోదాను ‘అదనపు కలెక్టర్’గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 49 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం జారీ చేసిన జీవోలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ మార్పును పేర్కొంది. కొన్ని జిల్లాల్లో స్థానిక సంస్థలకోసం ప్రత్యేకంగా అదనపు కలెక్టర్లను నియమించారు.
2020-02-10ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత పర్సంటేజీలను ప్రకటించింది ఎన్నికల సంఘం. శనివారం పోలింగ్ జరిగితే ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత వివరాలను వెల్లడించారు. మొత్తంగా 62.59 శాతం పోలింగ్ జరిగినట్లు తెలిపారు. ఈ ఆలస్యాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అయితే, పోలింగ్ ముగిశాఖ ఓ రోజుకు పర్సంటేజీని ప్రకటించడం అసాధారణమేమీ కాదని ఢిల్లీ సీఈవో రణబీర్ సింగ్ వ్యాఖ్యానించారు.
2020-02-10