జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి)ని దేశవ్యాప్తంగా అమలు చేయడం అనవసరమని, సమర్ధనీయం కాదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. అది జరుగుతుందని కూడా తాను అనుకోవడంలేదని నితీష్ సోమవారం బీహార్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి కూడా అదే చెప్పారని నితీష్ పేర్కొనడం విశేషం. ఎన్.ఆర్.సి, సిఎఎ, ఎన్.పి.ఆర్.లపై నితీష్ కుమార్ స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్ష నేత తేజశ్వి యాదవ్ డిమాండ్ చేసినప్పుడు నితీస్ స్పందించారు.
2020-01-13బిజెపి కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎ.కె. నజీర్ పై ఓ మసీదులోనే దాడి జరిగినట్టు వార్తలు వచ్చాయి. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి మద్ధతుగా బిజెపి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఇడుక్కి జిల్లాలో నేదుంగందం ప్రాంతంలోని మసీదులో దాడి జరిగినట్టు ప్రాథమిక సమాచారం. సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్.డి.పి.ఐ), డెమోక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డి.వై.ఎఫ్.ఐ) కార్యకర్తలు ఈ దాడి చేశారని బిజెపి ఆరోపించింది.
2020-01-13తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కె. చంద్రశేఖరరావు సోమవారం హైదరాబాద్ ప్రగతి భవనంలో సమావేశమయ్యారు. నదీ జలాల సమర్ధ వినియోగం, రాష్ట్ర విభజన తర్వాత పరిష్కారం కాని సమస్యలు తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, పి. మిథున్ రెడ్డి ప్రగతి భవనానికి వెళ్లారు. కేసీఆర్ తో పాటు ఆయన తనయుడు, తెలంగాణ మంత్రి కె.టి.ఆర్ ఉన్నారు.
2020-01-13అమరావతి కోర్ కేపిటల్ పరిధిలోకి వచ్చే 29 గ్రామాలు ‘3 రాజధానుల’ నిర్ణయంపై మండిపడుతుంటే... మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (ఆర్కే) సోమవారం మద్ధతు ర్యాలీ తలపెట్టారు. అయితే, పెనుమాక నుంచి రాజధాని గ్రామాలవైపు కాకుండా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వైపు బయలుదేరారు. ఆర్కే బయలుదేరగానే పోలీసులు ఆపి వాహనం ఎక్కించారు. ర్యాలీకి అనుమతి లేని కారణంగా ఎమ్మెల్యే ఆర్కేను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
2020-01-13సోమవారం మార్కెట్లో ఓ గుడ్ న్యూస్. రూపాయి విలువ అమెరికన్ డాలరుతో పోలిస్తే కొద్దిగా పెరిగింది. డాలరు విలువ రూ. 70.79 వద్ద సోమవారం ఉదయం వాణిజ్యం ప్రారంభమైంది. అది గత వారాంతం కంటే 14 పైసలు తక్కువ. జనవరి 3న డాలరుకు రూ. 71.80 వద్ద ముగిసిన రూపాయి విలువ గత 10 రోజుల్లో క్రమంగా పెరిగింది.
2020-01-13ఈ నెల 5వ తేదీన జె.ఎన్.యు.పై దాడి చేసిన ముసుగు దుండగుల్లో ఓ మహిళ ఫొటో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆమెను ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్ధినిగా గుర్తించినట్టు తాజాగా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తెలిపింది. ఆమె పేరు మాత్రం వెల్లడించలేదు. అయితే ఎరుపు, తెలుపు గళ్ల చొక్కా ధరించిన ఆ యువతిని ఎబివిపి కార్యకర్త ‘‘కోమల్ శర్మ’’గా నెటిజన్లే గుర్తించారు. మీడియా, ఆమె సహచర విద్యార్ధులు నిర్ధారించారు. కోమల్ శర్మ ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్ధినే కావడం గమనార్హం.
2020-01-13జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్.ఆర్.సి)ను తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ప్రకటించిన ముఖ్యమంత్రులంతా జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్.పి.ఆర్) ప్రక్రియనే నిలిపివేయాలని సిపిఎం పొలిట్ బ్యూరో కోరింది. ఎన్.పి.ఆర్. ప్రాతిపదికనే ఎన్.ఆర్.సి.ని చేపట్టనున్నందున, ప్రారంభంలోనే అడ్డుకోవాలని సూచించింది. శని, ఆదివారాల్లో ఢిల్లీలో సమావేశమైన పొలిట్ బ్యూరో... సిఎఎకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు మద్ధతు ప్రకటించింది.
2020-01-12వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రతిపక్ష నేతలను బూతులు తిడితే అతని అనుచరులు ఏకంగా మహిళలపై కర్రలు, కట్టెలతో దాడికి ప్రయత్నించారు. రక్షించుకోవడానికి దేవాలయంలోకి వెళ్తే బయటకు రమ్మంటూ వీరంగం వేశారు. కాకినాడలో ఆదివారం కనిపించిన భీతావహ దృశ్యమిది. ద్వారంపూడి శనివారం ఓ బహిరంగ సభలో.. పవన్ కళ్యాణ్ లం.. పనులు చేస్తున్నాడంటూ బూతులు తిట్టారు. అందుకు నిరసనగా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించినవారిపై అమానుషంగా దాడి చేశారు.
2020-01-12తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గత సెప్టెంబరులో సమావేశమయ్యారు. మళ్లీ కొద్ది రోజుల్లోనే కలవాలనుకున్నారు. అయితే, అది జరగలేదు. సుమారు 110 రోజుల తర్వాత సోమవారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ఈ ఇద్దరి భేటీకి మరోసారి వేదిక కానుంది. కృష్ణా గోదావరి జలాలు, విభజన సమస్యల పరిష్కారంపై ఇద్దరూ చర్చించే అవకాశం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులూ విడిగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి.. రాజకీయ చర్చకు అస్కారముంది.
2020-01-13ఒమన్ దేశపు పాలకుడు సుల్తాన్ కబూస్ బిన్ సెయిద్ అల్ సెయిద్ మృతి నేపథ్యంలో భారత ప్రభుత్వం సంతాప దినాన్ని ప్రకటించింది. సుల్తాన్ ‘‘గౌరవ చిహ్నం’’గా సోమవారం దేశవ్యాప్తంగా సంతాప దినాన్ని పాటించనున్నట్టు తెలిపింది. అందులో భాగంగా జాతీయ పతకాలను సగం వరకే ఎగురవేస్తారు. సుల్తాన్ ఇండియాతో మంచి సంబంధాలను నిర్మించారని, ప్రవాసులకు సాయం చేశారని కేంద్రం పేర్కొంది. సుల్తాన్ ప్రాథమిక దశలో ఇండియాలో చదవారు.
2020-01-13