ఆంధ్రప్రదేశ్‌లో మద్యం బెల్టుషాపులను వారంలోగా పూర్తిగా నియంత్రించాలని, రేపటినుంచే పని ప్రారంభించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి. సాంబశివరావు ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ కార్యాయంలో జరిగిన సమావేశంలో ఎక్సైజ్ కమిషనర్ ముకేశ్ కుమార్ మీనాతోపాటు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. అధికారులు తప్పు చేసినా సహించేది లేదని సాంబశివరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయి రవాణా ఎక్కువగా ఉందన్న ఆయన, అసలు సాగునే నిరోధించాల్సి ఉందని పేర్కొన్నారు.
2019-06-04టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రత్యేకమైన జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకోసం సిట్టింగ్ జడ్జి ఒకరిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక సిజె జస్టిస్ ప్రవీణ్ కుమార్ ను కోరారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం పిలిచే టెండర్లను ముందుగానే ఈ జ్యుడిషియల్ కమిషన్ పరిశీలనకు పంపుతామని, కమిషన్ మార్పులు సూచిస్తే పాటిస్తామని జగన్ ఈ సందర్భంగా చెప్పారు. గత నెల 30న తన ప్రమాణస్వీకారం సందర్భంగానే జగన్.. జ్యుడిషియల్ కమిషన్ ఆలోచనను వెల్లడించారు.
2019-06-04తెలంగాణలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార టి.ఆర్.ఎస్. ఘన విజయాన్ని సాధించింది. ఎంపీటీసీ స్థానాల్లో 3,556, జడ్పీటీసీ స్థానాల్లో 446 టీఆర్ఎస్ వశమయ్యాయి. ఎంపీటీసీ స్థానాల్లో ఫర్వాలేదనిపించిన కాంగ్రెస్ జడ్పీటీసీలలో ఆ స్థాయి విజయాలను సాధించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి 1377 ఎంపీటీసీ స్థానాలు, 77 జడ్పీటీసీ స్థానాలు వచ్చాయి. ఇతరుల్లో బీజేపీకి 211 ఎంపీటీసీ, 8 జడ్పీటీసీ స్థానాలు లభించాయి. మిగిలిన పార్టీలు, ఇండిపెండెంట్లకు కలిపి 594 ఎంపీటీసీ, 5 జడ్పీటీసీ స్థానాలు వచ్చాయి.
2019-06-04అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోలిస్తే ఇండియాలో 5జి రేడియో తరంగాల ఖరీదు 30-40 శాతం ఎక్కువని సెల్యులర్ ఆపరేటర్ల సంఘం (సిఒఎఐ) పేర్కొంది. ఈ ఏడాది 5జి తరంగాల వేలం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. బేస్ ధరపై సిఒఎఐ స్పందించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన 5జి స్ప్రెక్ట్రమ్ పాలసీ వర్క్ షాపు సందర్భంగా సిఒఎఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ విలేకరులతో మాట్లాడారు. ధరలో రాయితీ ఇవ్వాలని ఆయన సూచించారు.
2019-06-04 Read Moreటీవీ9 యాజమాన్య వివాదంలో కేసులను ఎదుర్కొంటున్న మాజీ సీఈవో రవిప్రకాష్ మంగళవారం సైబరాబాద్ సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41ఎ కింద పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన ఇప్పటిదాకా స్పందించలేదు. ముందస్తు బెయిలుకోసం హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిలు విషయమై హైకోర్టుకే వెళ్ళాలని, విచారణకు హాజరు కావాలని సుప్రీం స్పష్టం చేయడంతో మంగళవారం తొలిసారిగా పోలీసుల ఎదుటకు వచ్చారు.
2019-06-04ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నంలోని శారదా పీఠానికి వెళ్లి స్వరూపానంద దర్శనం చేసుకున్నారు. అనంతరం రాజశ్యామలాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకోసం జగన్ ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్ళారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి భారీ కాన్వాయ్ తో జగన్ శారదాపీఠానికి వెళ్ళారు.
2019-06-04దేశంలోని అన్ని స్కూళ్ళలో హిందీ బోధన తప్పనిసరి చేయాలన్న జాతీయ విద్యా విధానం 2019 డ్రాఫ్టులో నిపుణుల కమిటీ సవరణ చేసింది. విద్యార్ధులు తప్పనిసరిగా ఎంచుకోవలసిన భాషలను నిర్ధిష్టంగా పేర్కొన్న క్లాజును తొలగించి తాజా డ్రాఫ్టును అప్ లోడ్ చేసింది. అయితే, ‘త్రిభాషా నియమం’ అమలు చేయాలన్న సిఫారసును మాత్రం యధాతథంగా ఉంచింది. కస్తూరి రంగన్ కమిటీ కేంద్రానికి డ్రాఫ్టును సమర్పించాక తమిళనాడు నేతలు తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర సహా పలు ప్రాంతాల నేతలు గొంతు కలిపారు. ఈ నేపథ్యంలో పాక్షిక సవరణ చేశారు.
2019-06-03ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్) రవాణా విమానం ఎఎన్-32 ఒకటి సోమవారం అరుణాచల్ ప్రదేశ్ గగనతలంపైన గల్లంతయింది. అందులో ఎనిమిదిమంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, ఐదుగురు ప్రయాణీకుల ఆచూకీ తెలియలేదు. అస్సాంలోని మెచూక నుంచి సోమవారం మధ్యాహ్నం 12.25 గంటలకు గాల్లోకి ఎగిరిన ఈ విమానం సిబ్బంది చివరిగా 1.00 గంటకు గ్రౌండ్ ఎజెన్సీలను సంప్రదించారు. ఆ తర్వాత ఎలాంటి సంకేతాలూ లేవు. ఈ విమానాన్ని వెతకడానికి ఎస్.యు-30 యుద్ధ విమానాలను, సి-130 రవాణా విమానాలను రంగంలోకి దించారు.
2019-06-03వైద్య ఆరోగ్య శాఖలో అట్టడుగు స్థాయిలో పని చేసే ఆశా వర్కర్ల వేతనాన్ని రూ. 3,000 నుంచి రూ. 10 వేలకు పెంచాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప యాత్రలోనూ, తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఇచ్చిన హామీమేరకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష జరిపిన సందర్భంగా అధికారులకు ఆదేశాలిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖను తానే పర్యవేక్షిస్తానని జగన్ ఈ సందర్భంగా అధికారులకు చెప్పారు.
2019-06-03‘‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’’ పేరును ‘‘వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ’’గా మార్చాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఆదేశించారు. జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి సిఎంగా ఉండగా ప్రారంభమైన ఈ పథకానికి అప్పట్లో ‘‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’’గా నామకరణం చేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అది ‘‘ఎన్టీఆర్ ఆరోగ్యసేవ’’గా మారింది. జగన్ అధికారంలోకి రాగానే తండ్రి పేరు పెడుతున్నారు. ఆరోగ్య శ్రీ, 108 సేవలను ప్రక్షాళన చేయాలని, వాహనాలను పూర్తి స్థాయిలో పని చేయించాలని జగన్ హుకుం జారీ చేశారు.
2019-06-03