ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించింది ‘వైఎస్ఆర్ రైతు నిరాశ’ కార్యక్రమమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్య బాణం వదిలారు. ‘‘వాయిదా పద్ధతి సిఎంగారూ, మీరు ప్రవేశపెట్టింది ‘వైఎస్ఆర్ రైతు నిరాశ’ కార్యక్రమం. ఎన్నికల హామీలో రైతు భరోసా కింద రూ. 12,500 ఇస్తామని ప్రకటించి.. ఇప్పుడు రూ. 7,500కు ఇస్తూ రైతులకూ రివర్స్ టెండరేశారు. 64 లక్షల మంది రైతుల్లో సగం మందిని తగ్గించుకుంటూ పోయారు’’ అని లోకేష్ ట్విట్టర్లో అక్షేపించారు.
2019-10-15‘రైతుభరోసా’పై సిఎం జగన్ మాట మార్చారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 50 వేలు ఇస్తామని 2017 వైకాపా ప్లీనరీలో చెప్పారని, ప్రతి ఏటా మే నెలలోనే రూ. 12,500 ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో కలిపి ‘రైతు భరోసా’ను ప్రకటించారని, అది కూడా ఏటా మూడు విడతలుగా ఇస్తామంటున్నారని నరేంద్ర ఆక్షేపించారు. 4 నెలల కాలంలోనే మాట తప్పిన ఏకైక ప్రభుత్వం ఇదేనని దుయ్యబట్టారు.
2019-10-15అయోధ్య రామమందిరం-బాబరీ మసీదు భూ యాజమాన్య హక్కుల వివాదంపై సుప్రీంకోర్టులో రోజువారీ హియరింగ్ బుధవారంతో ముగియనుంది. ఈ విషయాన్ని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మంగళవారం స్వయంగా వెల్లడించారు. అక్టోబర్ 17 లోగా హియరింగ్ ముగించి... తన రిటైర్మెంట్ లోగా తీర్పు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి భావిస్తున్నట్టు ఇదివరకే వార్తలు వచ్చాయి. జస్టిస్ రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు జడ్జిల బెంచ్ గత రెండు నెలలుగా రోజువారీగా ఈ కేసును విచారిస్తోంది.
2019-10-15‘వైఎస్ఆర్ రైతు భరోసా’ తమ పార్టీ మేనిఫెస్టోలోని మొదటి వాగ్ధానమని, దాన్ని చెప్పిన సమయం కంటే 8 నెలలు ముందుగానే అమల్లోకి తెచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా కాకుటూరు వద్ద ఆయన మంగళవారం ‘వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్’ పథకాన్ని ప్రారంభించారు. కొంతమంది లబ్దిదారులకు చెక్కులను వేదికపైనే పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లను సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారని, జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని జగన్ చెప్పారు.
2019-10-15అభిజిత్ బెనర్జీ... అమర్త్యసేన్ తర్వాత ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన భారతీయుడుగా ఇప్పుడు అందరికీ సుపరిచితుడు. ఆయన ఒకప్పుడు తీహార్ జైలులో ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యమే కదా! 1983లో జె,ఎన్.యు.లో చదువుతుండగా... యూనివర్శిటీ విద్యార్ధి నాయకుడిని వీసీ బహిష్కరించారు. అందుకు నిరసనగా వీసీని విద్యార్ధులంతా ఘెరావ్ చేశారు. అంతే... అప్పటి ప్రభుత్వానికి కోపం వచ్చి వందల మందిని జైలుకు పంపింది. వారిలో అభిజిత్ ఉన్నారు. ఆయన 10 రోజులు తీహార్ జైలులో నరకాన్ని చూశారట!
2019-10-15 Read Moreతూర్పు గోదావరి జిల్లా మారేడుమల్లి-చింతూరు మధ్య ఓ టెంపో ట్రావెలర్ వాహనం లోయలో పడిన ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా ఘాట్ రోడ్డులో వాల్మీకి కొండ వద్ద వాహనం అదుపు తప్పినట్టు చెబుతున్నారు. ప్రమాద సమయంలో టెంపోలో 20 మంది పర్యాటకులు/భక్తులు ఉన్నట్టు సమాచారం. వారంతా కర్నాటకలోని చిత్రదుర్గం జిల్లా చెలకెరి గ్రామస్థులుగా పోలీసులు గుర్తించారు.
2019-10-15 Read More2019 ఆర్థిక శాస్త్ర నోబెల్ గ్రహీతల్లో ఓ ప్రత్యేకత ఉంది. భారతీయుడైన అభిజిత్ బెనర్జీ (58), ఆయన భార్య ఫ్రెంచ్ అమెరికన్ ఎస్తేర్ డఫ్లో (46) భార్యాభర్తలు. 2015లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఎంఐటిలోనే పి.హెచ్.డి. చేసిన ఎస్తేర్ డఫ్లోకు అభిజిత్ సహ మార్గదర్శకుడిగా కూడా వ్యవహరించారు. వీరిద్దరూ కలసి 2011లో ‘‘పూర్ ఎకనామిక్స్’’ అనే పుస్తకాన్ని రాశారు. ఇంతకు ముందే అర్థశాస్త్రంలో నోబెల్ సాధించిన భారతీయ ఆర్థికవేత్త అమర్త్యసేన్ తనకు ఆదర్శమని డఫ్లో చెబుతారు.
2019-10-14సైరా నరసింహరెడ్డి సినిమా విడుదలైన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సోమవారం చిరంజీవి భార్యా సమేతంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చారు. జగన్ భార్య భారతీరెడ్డి కూడా ఆ సమయంలో ఉన్నారు. వారిద్దరినీ ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూడవలసిందిగా చిరంజీవి కోరారు. ఈ సందర్భంగా సిఎం జగన్, చిరంజీవి పరస్పరం శాలువాలతో సత్కరించుకున్నారు.
2019-10-14అమర్త్యసేన్ తర్వాత మరో భారతీయుడికి ఆర్థిక శాస్త్ర నోబెల్ లభించింది. ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలనకోసం ప్రయోగాత్మక విధానాన్ని రూపొందించిన అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో, మైఖేల్ క్రెమెర్ 2019 ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. బెనర్జీ, డఫ్లో అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి)లో, క్రెమెర్ హార్వార్డ్ యూనివర్శిటీలో పని చేస్తున్నారు. వారి ప్రయోగాత్మక పద్ధతులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘‘ఆర్థిక అభివృద్ధి’’ నమూనాలుగా ఉన్నాయి.
2019-10-14 Read Moreతెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతరూపం దాల్చింది. రెండు రోజుల్లో ఇద్దరు డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడు కార్మికుల కుటుంబాలు కూడా రోడ్లపైకి వస్తున్నాయి. సమ్మె ప్రారంభమై సోమవారానికి 10 రోజులైంది. ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య నేపథ్యంలో సోమవారం అఖిలపక్షాలు తలపెట్టిన బంద్ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల కుటుంబాలు డిపోల ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి నిరసన తెలిపాయి. హైదరాబాద్ నగరంలోని బస్ భవన్ ముట్టడికి పలు సంఘాల నేతలు ప్రయత్నించారు.
2019-10-14 Read More