ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మహ్మద్ మోర్సీ (67) సోమవారం కోర్టు విచారణలో ఉండగానే కుప్పకూలిపోయి కొద్దిసేపటి తర్వాత మరణించారు. గూఢచర్యం ఆరోపణలపై మోర్సీ, మరో 23 మందిపైన క్రిమినల్ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ పరిణామం జరిగింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా మోర్సీ అక్కడ మరణించారు. ముస్లిం బ్రదర్ హుడ్’లో ముఖ్యుడైన మోర్సీ 2012లో అధ్యక్ష పదవి చేపట్టగా.. తర్వాత సంవత్సరమే భారీ నిరసనల మధ్య సైన్యం ఆయనను కూలదోసింది.
2019-06-17 Read Moreచైనాలోని సిచువాన్ ప్రావిన్సులో గల చాంగ్ నింగ్ కౌంటీకి సమీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 6.0గా నమోదైనట్టు చైనా వార్తా సంస్థలు పేర్కొనగా 5.9 తీవ్రత ఉన్నట్టు అమెరికా సంస్థ యు.ఎస్.జి.ఎస్. తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 22.55 గంటలకు భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించింది. కాగా సోమవారమే ఇండోనేషియాలోని వివిధ ప్రాంతాల్లో 5.3, 5.5, 5.0 తీవ్రతతో పలు భూకంపాలు సంభవించాయి.
2019-06-17తీవ్రమైన నేరారోపణలతో కేసులు ఎదుర్కొంటున్న ప్రగ్యా సింగ్ ఠాకూర్ లోక్ సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ వివాదానికి కారణమయ్యారు. తన ఆధ్యాత్మిక గురువు పేరును తన పేరుకు జోడించి ప్రమాణం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రమాణ పత్రంలో తన పూర్తి పేరు అలాగే పేర్కొన్నానని ఆమె వాదించారు. దీంతో ప్రొటెం స్పీకర్ ఆమె పూర్తి పేరు ఏముందని లోక్ సభ సెక్రటరీ జనరల్ ను అడిగి ఎన్నికల సర్టిఫికెట్లో ఉన్నంతవరకే చెప్పాలని స్పష్టం చేశారు.
2019-06-17 Read Moreఆప్రికా దేశం నైజీరియాలో సోమవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 30 మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. బోర్నో రాష్ట్ర రాజధానికి 25 కిలోమీటర్ల దూరంలోని కొండుగ గ్రామం వద్ద ఒక హాలు బయట ముగ్గురు ఆత్మహుతి దళ సభ్యులు బాంబులను పేల్చారు. ఫుట్ బాల్ అభిమానులు టీవీలో మ్యాచ్ తిలకిస్తుండగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.
2019-06-17 Read Moreబి.జె.పి. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జె.పి. నడ్డాను ఎంపిక చేస్తూ ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సోమవారం నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో.. నడ్డాను పార్టీ పదవికి ఎంపిక చేసినట్టు మరో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. అమిత్ షా కేంద్ర ప్రభుత్వంలో చేరాక నడ్డా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతానికి నడ్డాను ‘వర్కింగ్ ప్రెసిడెంట్’గా నియమించారు.
2019-06-17 Read Moreజమ్మూ కాశ్మీర్ లోని పుల్వామారకు సమీపంలోని అరిహాల్ గ్రామం వద్ద ఒక ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. సోమవారం సాయంత్రం 44వ రాష్ట్రీయ రైఫిల్స్ సాయుధ వాహనంపై ఓ ఆత్మహుతి దళ సభ్యుడు దాడి చేసినట్టు ప్రాథమిక సమాచారం. కాస్పర్ వాహనంపై దాడి జరిగిన వెంటనే బుల్లెట్లు, రాళ్ల వర్షం కురిసింది. ప్రస్తుతం ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఘటనను ఆర్మీ ‘‘విఫల ప్రయత్నం’’గా అభివర్ణించింది.
2019-06-17 Read Moreరుణ మాఫీ అర్హత పత్రాలు కలిగిన రైతులకు 4, 5 విడతల సొమ్ము చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. సోమవారం చంద్రబాబు నివాసం వద్ద ప్రజావేదికలో నిర్వహించిన టీడీఎల్పీ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. రుణ మాఫీ అంశాన్ని కేవలం ఒక పార్టీ హామీగా పేర్కొంటూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆక్షేపించారు.
2019-06-17తెలంగాణలో భారీ ఎత్తిపోతల పథకం ‘కాళేశ్వరం’ ప్రారంభోత్సవానికి రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. సోమవారం ఏపీ పర్యటనకు వచ్చిన కేసీఆర్ కు తాడేపల్లిలోని తన నివాసంలో జగన్మోహన్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరు కావాలని కేసీఆర్ ఆహ్వానించారు. కేసీఆర్ ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గ దేవాలయాన్ని వెళ్లి పూజలు చేశారు.
2019-06-17హిందూత్వ పార్టీలు కూడా చేయనంతగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు యాగాలు నిర్వహించారని విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానంద కొనియాడారు. కేసీఆర్ ఆయత చండీయాగం, రాజశ్యామల యాగం చేయడాన్ని ప్రశంసించారు. కేసీఆర్ మహాభారతాన్ని రెండుసార్లు చదివారంటూ... మహాభారతం చదివి ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి దేశంలో కేసీఆర్ అని స్వరూపానంద వ్యాఖ్యానించారు. సోమవారం విజయవాడలో శారదాపీఠం ఉత్తరాధికారి పట్టాభిషేక కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
2019-06-17జగన్మోహన్ రెడ్డిని ఏపీ సిఎంను చేయడంకోసం విశాఖ శారదా పీఠం ఐదేళ్లు ప్రాణం పెట్టి పని చేసిందని, అందరు దేవతల ఆశీస్సులు ఆయనకు దక్కేలా కృషి చేసిందని పీఠాధిపతి స్వరూపానందేంద్ర చెప్పారు. కిరణ్ కుమార్ శర్మకు విజయవాడలో ‘స్వాత్మానందేంద్ర సరస్వతి’గా పట్టాభిషేకం చేసిన కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ హాజరయ్యారు. వారిద్దరినీ రెండు రాష్ట్రాలకు రాజులుగా అభివర్ణించారు స్వరూపానంద. జగన్ అంటే తనకు ప్రాణమని స్వరూపానంద ఈ సందర్భంగా చెప్పారు.
2019-06-17