‘‘కాపలాదారు దొంగ’’ నినాదాన్ని సుప్రీంకోర్టుకు ఆపాదించిన వివాదంలో రాహుల్ గాంధీ క్షమాపణకు న్యాయమూర్తులు పట్టుపట్టారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం మంగళవారం రాహుల్ గాంధీ ‘విచార’ వ్యక్తీకరణను తిరస్కరించింది. ‘స్పష్టంగా క్షమాపణ చెప్పాలి లేదంటే క్రిమినల్ విచారణను ఎదుర్కోవాలి’ అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్ ను తిరస్కరిస్తూ...కొత్త అఫిడవిట్ దాఖలు చేయడానికి వచ్చే సోమవారం వరకు గడువు ఇచ్చింది.
2019-04-30 Read Moreపుదుచ్ఛేరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ రోజువారీ వ్యవహారాల్లో ఆ కేంద్ర పాలిత ప్రాంతపు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. 2017 జనవరి, జూన్ మాసాల్లో కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై విధించిన ఆంక్షలు పుదుచ్ఛేరికి వర్తించవని... దేశ రాజధాని ప్రాంతానికి, పుదుచ్ఛేరికి తేడా ఉందని స్పష్టం చేసింది. పుదుచ్ఛేరి రాష్ట్రం కాకపోయినా ఇక్కడి అసెంబ్లీ కూడా ఒక రాష్ట్ర అసెంబ్లీ పాటి అధికారాలు కలిగి ఉందని ఉద్ఘాటించింది.
2019-04-30 Read Moreహిమాలయ దేశాల జానపదాల్లో వినిపించే ‘యెతి’ అడుగు జాడలను తొలిసారిగా తమ పర్వతారోహకుల బృందం కనిపెట్టినట్టు భారత ఆర్మీ ప్రకటించింది. హిమాలయాల్లోని మకాలు బేస్ క్యాంపునకు దగ్గరలో ఈ నెల 9వ తేదీన కనిపించిన ఈ అడుగుల కొలత 32x15 అంగుళాలు ఉన్నట్టు సోమవారం రాత్రి ట్విట్టర్లో వెల్లడించింది. నేపాలీ జానపదాల ప్రకారం ‘యెతి’ ఒక ఏప్ తరహా జీవి. ‘మంచు మనిషి’గా వ్యవహరిస్తుంటారు. అదే ప్రాంతంలో ‘యెతి’ని చూసినట్టు గతంలోనూ కొందరు చెప్పిన నేపథ్యంలో ఫొటోలు, వీడియో ఆధారాలు కూడా ఉన్నట్టు ఆర్మీ చెబుతోంది.
2019-04-29 Read Moreప్రపంచాన్ని కుదిపేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సైన్యాధిపతి అబుబకర్ అల్ బగ్ధాది ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఓ వీడియోలో కనిపించారు. ఐఎస్ఐఎస్ మీడియా విభాగం ‘అల్ ఫుర్ఖాన్’ సోమవారం ఈ వీడియోను విడుదల చేసింది. బఘౌజ్ కోసం పోరాటం ముగిసిందని ఈ వీడియోలో బగ్ధాది చెప్పారు. ఆ పట్టణం గత నెలలో ఐఎస్ఐఎస్ చేజారింది. గతంలో ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడుల్లో అబుబకర్ మరణించాడని, తీవ్రంగా గాయపడ్డాడని పలుమార్లు వార్తలు వచ్చాయి.
2019-04-29 Read Moreపశ్చిమ బెంగాల్ లోని 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బెంగాల్ లో జరిగిన ఓ ర్యాలీలో మోదీ మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో తాను విజయం సాధించగానే టీఎంసీ ఎమ్మెల్యేలు పార్టీ మారతారని మోదీ చెప్పారు. కొద్ది సీట్లతో ఢిల్లీని చేరుకోలేరని, అది చాలా దూరమని మమతా బెనర్జీని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. తన మేనల్లుడిని రాజకీయంగా ప్రతిష్ఠించడమే మమత అసలు లక్ష్యమని మోదీ పేర్కొన్నారు.
2019-04-29 Read More‘‘విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసులను బంట్రోతుల కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబుగారూ..! ఇంతకూ రాంగోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. వివాదాస్పద ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ సినిమా ప్రెస్ మీట్ కోసం విజయవాడ వచ్చిన వర్మను పోలీసులు నిరోధించి హైదరాబాద్ తిప్పి పంపడంపై జగన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
2019-04-29 Read More‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మను ఆదివారం విజయవాడ పోలీసులు నిర్భంధించి కొద్ది గంటల తర్వాత బలవంతంగా హైదరాబాద్ పంపించారు. మే 1వ తేదీన ఏపీలో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టేందుకు వర్మ విజయవాడ వచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నగరానికి వస్తున్న వర్మను, సినిమా నిర్మాతను రామవరప్పాడు రింగు వద్ద అడ్డుకున్న పోలీసులు తిరిగి ఎయిర్ పోర్టుకు తరలించారు. ప్రెస్ మీట్ నిర్వహణకు ‘నోవోటెల్’ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రజాస్వామ్యం లేదని వర్మ ట్వీట్ చేశారు.
2019-04-28ప్రపంచ దేశాలు సైన్యాలపై ఖర్చు చేస్తున్న వ్యయం ఎంతో తెలుసా? అక్షరాలా కోటీ ఇరవై ఏడు లక్షల యాబై నాలుగు వేల కోట్ల రూపాయలు (1.822 ట్రిలియన్ డాలర్లు). అందులో అమెరికా ఒక్క దేశపు వాటా 36 శాతం. ‘సిప్రి’ తాజా సమాచారం ప్రకారం.. 2018లో అమెరికా మిలిటరీ వ్యయం 649 బిలియన్ డాలర్లు (రూ. .45,43,000 కోట్లు). 250 బిలియన్ డాలర్ల వ్యయంతో చైనా రెండో స్థానంలో ఉండగా 67.6 బిలియన్ డాలర్లతో సౌదీ అరేబియా ఇండియాను మించిపోయింది. 66.5 బిలియన్ డాలర్లు మిలిటరీపై ఖర్చు చేసిన ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది.
2019-04-29 Read Moreఇటీవల అతి పెద్ద ఉగ్రవాద దాడిని ఎదుర్కొన్న శ్రీలంక కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ముస్లిం మహిళలు ధరించే బురఖా సహా ముఖాన్ని మూసి ఉంచే వస్త్రధారణపై ఆ దేశం సోమవారం నుంచి నిషేధాన్ని అమలు చేయబోతోంది. ఈ విషయాన్ని శ్రీలంక అధ్యక్షుడి మీడియా విభాగం ఆదివారం వెల్లడించింది. బురఖా నిషేధానికి సంబంధించిన ముసాయిదా చట్టంపై శ్రీలంక జస్టిస్ మినిస్ట్రీ, ఆల్ సిలోన్ జమియాతుల్ ఉలేమా మధ్య చర్చలు జరిగాయి. గత వారం జరిగిన ఉగ్రవాద దాడికి ఇస్లామిక్ స్టేట్ బాధ్యత ప్రకటించిన సంగతి తెలిసిందే.
2019-04-28 Read Moreలోక్ సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. తొమ్మిది రాష్ట్రాల్లోని 72 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. ఆయా సీట్లు ఎన్డీయేకి, ముఖ్యంగా బీజేపీకి కీలకం కానున్నాయి. ఎందుకంటే..2014 ఎన్నికల్లో ఈ 72 సీట్లలో 56 బీజేపీ, దాని మిత్రపక్షాల వశమయ్యాయి. అప్పటి అధికార పక్షం, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 2 సీట్లు. బీజేపీకి తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెట్టిన సీట్లలో ఈసారి ఏమవుతుందోనన్న ఆసక్తి సర్వత్రా ఉంది. మొదటి మూడు దశల్లో 302 లోక్ సభ సీట్లకు పోలింగ్ జరిగింది.
2019-04-28 Read More