సమంత అక్కినేని, సీనియర్ నటి లక్ష్మి నటించిన ‘‘ఓహ్ బేబీ’’ తెలుగు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ‘సురేష్ ప్రొడక్షన్స్’ సినిమా వ్యాపారంలోకి ప్రవేశించి 55 సంవత్సరాలు గడచిన సందర్భంగా మంగళవారం కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. బివి నందినీరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలైలో విడుదల కానుంది.
2019-05-21‘పిఎం నరేంద్ర మోదీ’ సినిమా ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. మోదీ ‘బయోపిక్’గా రూపొందిన ఈ సినిమాను లోక్ సభ ఎన్నికల ప్రారంభంలోనే విడుదల చేయాలనుకున్నారు. అయితే, ప్రతిపక్షాల విమర్శలతో ఈసీ వాయిదా వేయించింది. గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో శుక్రవారం సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. బుధవారం సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ విడుదలైంది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని బుధవారం అహ్మదాబాద్ లో మోదీ సినిమా ప్రత్యేక ప్రదర్శనను తిలకించారు.
2019-05-22‘హువావీ’పై అమెరికా నిషేధం చైనాలో ‘యాపిల్’ కష్టాలను పెంచుతోంది. ఇప్పటికే తగ్గుతున్న యాపిల్ ఫోన్ల మార్కెట్ మరింత పతనం అవుతుందనే ఆందోళన ఆ కంపెనీ వర్గాలలో వ్యక్తమవుతోంది. గత ఏడాది చైనా ఫోన్ మార్కెట్లో యాపిల్ వాటా 9.1 శాతం కాగా.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అది 7 శాతానికి పడిపోయింది. హువావీ కంపెనీ తక్కువ రేట్లకే మెరుగైన నాణ్యతతో ఫోన్లను అందించడం అందుకు కారణం అంటున్నారు. అమెరికా తాజా చర్యతో దేశభక్తి భావన తోడై చాలామంది ‘యాపిల్’కు బదులు ‘హువావీ’ ఫోన్లు కొంటున్నారట!
2019-05-22 Read More‘‘మా ప్రధాని పేరు ‘షింజో అబె’ కాదు. ఆయనను ‘అబె షింజో’ అని పిలవండి’’..ఇది జపాన్ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజానికి చేసిన విన్నపం. జి20 సదస్సు, డొనాల్డ్ ట్రంప్ పర్యటన వంటి ముఖ్యమైన ఈవెంట్లు వస్తున్న దశలో జపాన్ విదేశాంగ మంత్రి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చైనా అధ్యక్షుడిని జి జిన్ పింగ్ అని, దక్షిణ కొరియా అధ్యక్షులను మూన్ జే ఇన్ అని పిలిచినట్టే తమ ప్రధాని పేరుకు ముందు ఇంటిపేరు పెట్టి సంబోధించాలని ఆయన విన్నవించారు.
2019-05-22 Read More‘ఇస్రో’ సరికొత్త మైక్రోవేవ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం బుధవారం వేకువజామున శ్రీహరికోటలో జరిగింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 5.30 గంటలకు పి.ఎస్.ఎల్.వి - సి46 రాకెట్ నింగికి ఎగిరింది. పావు గంట తర్వాత ఆర్ఐ శాట్-2బి ఉపగ్రహాన్ని భూమికి 557 ఎత్తున నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రాత్రి, పగలు సమాచారాన్ని పంపే ఈ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు సాయం వంటి రంగాలకు తోడు భద్రతా దళాలకు బాగా ఉపయోగపడనుంది.
2019-05-22 Read Moreతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ఐదేళ్ళలో లక్ష కోట్ల రూపాయల అప్పు చేసినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర ఏర్పాటునాటికి ఉన్న రూ. 82 వేల కోట్లతో కలిపి ఇప్పటిదాకా మొత్తం అప్పు రూ. 1.82 లక్షల కోట్లు ఉన్నట్టు తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఆర్థిక వృద్ధిరేటు, సొంత పన్నుల ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందని రామకృష్ణారావు తెలిపారు.
2019-05-21 Read Moreచైనా టెక్నాలజీ దిగ్గజం ‘హువావే’కు చిప్ ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు అమెరికా కార్పొరేషన్లు ఇంటెల్, క్వాల్ కామ్, గ్జిలింక్స్, బ్రాడ్ కామ్ తమ తమ ఉద్యోగులకు స్పష్టం చేశాయి. చైనా కంపెనీని బ్లాక్ లిస్టులో చేరుస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఇప్పటికే గూగుల్ హార్డువేర్, సాఫ్టువేర్ ఉత్పత్తులను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా చిప్ తయారీదారులూ ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా స్పందించడంతో ‘హువావే’ సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి నెలకొంది.
2019-05-20 Read Moreఈ నెలె 23వ తేదీన కౌంటింగ్ ప్రారంభానికి ముందే అసెంబ్లీ నియోజకవర్గానికి 5 చొప్పున ‘వీవీప్యాట్’ల స్లిప్పులను లెక్కించాలని ప్రతిపక్ష పార్టీలు భారత ఎన్నికల సంఘాన్ని కోరాయి. ‘వీవీప్యాట్’ స్లిప్పుల సంఖ్యకు, సంబంధిత ఈవీఎంలలో నమోదైన ఓట్లకు తేడా ఉంటే... ఆ నియోజకవర్గంలోని మొత్తం ‘వీవీప్యాట్’ల స్లిప్పులను లెక్కించాలని ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సహా పలువురు నేతలు ఈసీ అధికారులను కలిశారు.
2019-05-21 Read Moreచైనా టెలికం దిగ్గజం ‘హువావీ’తో వ్యాపారాన్ని పరిమితం చేసుకుంది ఇంటర్నెట్ సంస్థ ‘గూగుల్’. ఓపెన్ సోర్సు లైసెన్సులో ఉన్నవి మినహా మిగిలిన హార్డువేర్, సాఫ్టువేర్ సేవలను ఆదివారం నిలిపివేసింది. చైనా కంపెనీపై అమెరికా ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ‘గూగుల్’ స్పందించింది. దీంతో.. ప్రస్తుతం హవావీ ఫోన్లు వాడుతున్నవారికి భవిష్యత్తు ఆండ్రాయిడ్ అప్ డేట్స్ అందవు. కొత్త హువావీ ఫోన్లకు గూగుల్ ప్లే స్టోర్, జి మెయిల్ వంటి పాపులర్ యాప్స్ అందుబాటులో ఉండవు. ఇది చైనాకు వెలుపల ‘హువావీ’కి నష్టం చేసే పరిణామం.
2019-05-19 Read Moreప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) ట్రస్టీల బోర్డులో సింగపూర్ సీనియర్ మంత్రి తర్మాన్ షణ్ముగరత్నం నియమితులయ్యారు. 2011 నుంచి ఎనిమిది సంవత్సరాలు సింగపూర్ డిప్యూటీ ప్రధానమంత్రిగా పని చేసిన షణ్ముగరత్నం ఈ నెల 1న సీనియర్ మంత్రిగా నియమితులయ్యారు. సామాజిక విధానాల సమన్వయం, ప్రధానమంత్రికి ఆర్థికాంశాల్లో సలహాలు షణ్ముగరత్నం బాధ్యతలు. సింగపూర్ మానెటరీ అథారిటీ, సెంట్రల్ బ్యాంకులకు ఛైర్మన్ గా, సింగపూర్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
2019-05-21 Read More