కొత్త సంవత్సరం ఆరంభానికి కొద్ది గంటల ముందు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు (ఆర్.పి.ఎఫ్) పేరు మారింది. ఇకపైన రైల్వే పోలీసు విభాగాన్ని ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసు (ఐ.ఆర్.పి.ఎస్)గా వ్యవహరించనున్నారు. ఆర్పీఎఫ్‌కు వ్యవస్థీకృత గ్రూప్ ఎ హోదా (OGAS) ఇచ్చిన తర్వాత పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
2019-12-31 Read More2019లో చివరి రోజు కూడా స్టాక్ మార్కెట్ తిరోగమించింది. 30-ప్యాక్ బి.ఎస్.ఇ. సెన్సెక్స్ 304.26 పాయింట్లు తగ్గి 41,253.74 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 87.40 పాయింట్లు (0.71 శాతం) తగ్గి 12,168.45 పాయింట్ల వద్ద ముగిసింది. మెటల్, రియాల్టీతో పాటు ఇతర రంగాల సూచీలు కూడా తిరోగమించాయి. మంగళవారం లాభపడిన కంపెనీల్లో కోల్ ఇండియా, ఎన్.టి.పి.సి, గెయిల్ ముందుండగా... జీ ఎంటర్టైన్మెంట్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో బాగా నష్టపోయాయి.
2019-12-31 Read Moreకేరళను అనుసరించి తమిళనాడు అసెంబ్లీలో కూడా పౌరసత్వ సవరణ చట్టానికి (సిఎఎకి) వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ద్రవిడ మున్నేట్ర కజం (డిఎంకె) అధినేత స్టాలిన్ అధికార ‘ఎఐఎడిఎంకె’ను కోరారు. మంగళవారం కేరళ అసెంబ్లీ సిఎఎ వ్యతిరేక తీర్మానం చేయడాన్ని స్టాలిన్ స్వాగతించారు. ‘‘రాజ్యాంగ మూల సూత్రాల పరిరక్షణకోసం ప్రతి రాష్ట్రమూ ఇలాంటి తీర్మానం చేయాలన్న బలమైన కోరిక ప్రజల్లో ఉంది’’ అని స్టాలిన్ చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ జనవరి 6న సమావేశం కాబోతోంది.
2019-12-31 Read Moreకాశ్మీర్ లోయలో ఆగస్టు 5వ తేదీ నుంచి అమల్లో ఉన్న తీవ్రమైన ఆంక్షలు ఇప్పుడిప్పుడే సడలుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఈ అర్ధరాత్రి నుంచి ఎస్.ఎం.ఎస్. సేవలను పునరుద్ధరించనున్నారు. ఆర్టికిల్ 370ను రద్దు చేసి, కాశ్మీర్ రాష్ట్ర హోదానే రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీసినప్పటి నుంచి ఇంటర్నెట్, ఎస్.ఎం.ఎస్. సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు కూడా హింసను ప్రేరేపించడానికి ఎస్.ఎం.ఎస్.ను వినియోగిస్తే ఊరుకోబోమని అధికారులు హెచ్చరించారు.
2019-12-31 Read Moreవచ్చే ఐదేళ్ళలో రూ. 102 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రకటించారు. ఆయా ప్రాజెక్టుల్లో 39 శాతం చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, 22 శాతం ప్రైవేటు రంగం చేపడతాయని పేర్కొన్నారు. ఐదేళ్ళలో రూ. 100 లక్షల కోట్లను మౌలిక రంగాలపై వెచ్చించనున్నట్టు స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మోడీ చెప్పిన నేపథ్యంలో ఈ ప్రణాళికను రూపొందించారు.
2019-12-31 Read Moreగుంపులో ముఖాలను గుర్తించే నిఘా పద్ధతిని ఢిల్లీ పోలీసులు ఈ నెల 22న ప్రధాని మోడీ ర్యాలీలో ఉపయోగించడం కలకలం రేపింది. ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎ.ఎఫ్.ఆర్.ఎస్) సాఫ్ట్ వేర్ ఇప్పటిదాకా పోలీసులు తప్పిపోయిన పిల్లలను కనిపెట్టడానికి వాడేవారు. ఎయిర్ పోర్టులు, కార్యాలయాల్లో వాడటమూ పెరుగుతోంది. ఓ రాజకీయ ర్యాలీలో ఉపయోగించడం మాత్రం తొలిసారి. సిఎఎ వ్యతిరేక ర్యాలీలు దేశమంతా జరుగుతున్న నేపథ్యంలో పోలీసుల చర్య ఆందోళన కలిగిస్తోంది.
2019-12-31 Read Moreభారత సైనిక దళానికి కొత్త అధిపతిగా జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యాల్లో ఒకటైన 13 లక్షల భారత ఆర్మీకి ఆయన సారథ్యం వహించనున్నారు. ఇప్పటిదాకా సైన్యాధిపతిగా పని చేసిన బిపిన్ రావత్ ప్రమోషన్ పొంది త్రివిధ దళాలకు తొలి అధిపతిగా నియమితులైన విషయం తెలసిందే. రావత్ అధిపతిగా ఉన్నప్పుడు నరవాణె వైస్ చీఫ్ గా బాధ్యత నిర్వర్తించారు.
2019-12-31టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కార్యాలయాలు, ఇళ్ళలో మంగళవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో రాయపాటికి సంబంధించిన కార్యాలయాల్లోనూ, ఆయన కంపెనీ ‘ట్రాన్స్ ట్రాయ్’కి సిఇఒగా ఉన్న శ్రీధర్ చెరుకూరి నివాసంలోనూ సోదాలు జరిగాయి. ‘ట్రాన్స్ ట్రాయ్’ నిర్మాణ సంస్థ బ్యాంకులకు రూ. 300 కోట్ల మేరకు బకాయి పడగా... బ్యాంకుల కన్సార్షియం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగింది.
2019-12-31జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో మంగళవారం మందుపాతర పేలి ఒక పౌరుడు గాయపడ్డాడు. బైగ్యల్దార సరిహద్దు ప్రాంతంలో మందుపాతరపై ఆ పౌరుడు కాలు వేసినప్పుడు పేలుడు సంభవించిందని పూంచ్ డిప్యూటీ కమిషనర్ రాహుల్ యాదవ్ చెప్పారు. వెంటనే ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
2019-12-31 Read Moreపౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పొరుగు దేశాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇండియా సరిహద్దులకు కిలో మీటర్ లోపల మొబైల్ సేవలను నిలిపివేయాలని బంగ్లాదేశ్ టెలికం రెగ్యులేటరీ అధారిటీ కంపెనీలను ఆదేశించింది. ఈ ప్రభావం కోటి మంది పౌరులపై ఉంటుందని చెబుతున్నారు. ఇండియా చేసిన ‘ముస్లిం వ్యతిరేక’ చట్టం వల్ల ఇండియా నుంచి ముస్లింలు తమ దేశంలోకి చొరబడతారేమోననే ఆందోళన బంగ్లాదేశ్ అధికారుల్లో వ్యక్తమవుతోంది.
2019-12-31