నరేంద్ర మోడీ ప్రభుత్వం శుక్రవారం రెండు మలయాళ ఛానళ్ళపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) మద్ధతుదారులు సృష్టించిన విధ్వంసాన్ని ఎక్కువగా చూపించారని ఈ చర్య తీసుకుంది. ఏసియా నెట్ న్యూస్, మీడియా వన్ న్యూస్ ఛానళ్ళపై విధించిన 48 గంటల నిషేధం శుక్రవారం రాత్రి 7.30కి అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 25న (అల్లర్ల మూడో రోజు) ప్రార్ధనా స్థలాలపై దాడులను ఆ ఛానళ్ళు హైలైట్ చేసిన తీరు ఓ కమ్యూనిటీ వైపు మొగ్గినట్టు ఉందని కేంద్ర సమాచార శాఖ ఉత్తర్వుల్లో ఆక్షేపించింది.
2020-03-06 Read Moreస్థానిక సంస్థల ఎన్నికలకోసం పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు నివేదించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా వెల్లడించారు. సాధారణ షెడ్యూలు ప్రకారం.. టెన్త్ పరీక్షలు ఈ నెల 23న ప్రారంభం కావలసి ఉంది. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కొంతమంది నేతలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే, ప్రభుత్వం టెన్త్ పరీక్షలను ఏప్రిల్ మాసానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపిందని రమేష్ కుమార్ వెల్లడించారు.
2020-03-06ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికలకోసం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పోస్టులకు గాను 6 బి.సి, ఎస్.సి, ఎస్.టి.లకు రిజర్వు అయ్యాయి. పశ్చిమ గోదావరి (బిసి), అనంతపురం (బిసి మహిళ), శ్రీకాకుళం (బిసి మహిళ), తూర్పు గోదావరి (ఎస్.సి), గుంటూరు (ఎస్.సి. మహిళ), విశాఖపట్నం (ఎస్.టి. మహిళ) రిజర్వు అయ్యాయి. జనరల్ సీట్లలో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు మహిళలకు కేటాయించారు. మొత్తంగా 7 జడ్పీ పీఠాలు మహిళలకు దక్కాయి. కడప, చిత్తూరు, కర్నూలు, విజయనగరంలలో ఏ రిజర్వేషనూ లేదు. వాటిలో మూడు రాయలసీమవే కావడం గమనార్హం.
2020-03-06ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇవిఎంలను ప్రక్కన పెట్టి.. బ్యాలెట్ పద్ధతిని ఉపయోగిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. రాజకీయ పార్టీల్లో ఒక్కరు కూడా ఇవిఎంలు కావాలని కోరలేదని శుక్రవారం అఖిలపక్ష సమావేశం తర్వాత రమేష్ కుమార్ చెప్పారు. శనివారం (మార్చి 7న) నోటిఫికేషన్ వెలువడుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల విధుల కోసం ప్రభుత్వ సిబ్బంది చాలక ప్రైవేటు వ్యక్తులను వినియోగించే అవసరం ప్రస్తుతం కనిపించడంలేదని ఆయన పేర్కొన్నారు.
2020-03-06ఢిల్లీలో హింసకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. శుక్రవారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ... ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ నిరసనలోనూ ఇదే నినాదం ప్రతిధ్వనించింది. నిన్న ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను లోక్ సభ స్పీకర్ సస్పెండ్ చేసినందుకు.. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. వరుసగా ఐదో రోజు కూడా ఢిల్లీ అల్లర్లపై చర్చకోసం ప్రతిపక్షాలు ఉభయ సభల్లో పట్టుపట్టాయి.
2020-03-06స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. శుక్రవారం (మార్చి 6న) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి సూచనలు స్వీకరిస్తామని రమేష్ కుమార్ గురువారం విజయవాడలో విలేకరులతో చెప్పారు. రాష్ట్రంలో 1.2 లక్షల బ్యాలెట్ బాక్సులు ఉన్నాయని, వాటికి తోడు తెలంగాణ నుంచి 40 వేలు, ఒడిషా నుంచి 5 వేలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారమే రాష్ట్ర అధికారులతో సమావేశం, ఆ తర్వాత జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు.
2020-03-05ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకూ ‘కరోనా’ బ్రేకు వేసింది. ఇండియా-ఇయు సదస్సు కోసం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ వెళ్ళవలసిన మోడీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. బ్రస్సెల్స్ లోని ఇ.యు. యంత్రాంగంలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో... ఇరు దేశాల ఆరోగ్య శాఖలు పర్యటన వద్దని సూచించాయి. మోడీ పర్యటన రద్దు కావడంతో ఇండియా-ఇయు సదస్సు వాయిదా పడింది. యూరోపియన్ యూనియన్ కమిషన్, కౌన్సిల్, పార్లమెంటు కూడా బ్రస్సెల్స్ కేంద్రంగా పని చేస్తున్నాయి.
2020-03-05 Read Moreఏసుక్రీస్తు పుట్టిన స్థలంగా భావించే బెత్లెహమ్ నేటివిటీ చర్చిని ‘కరోనా’ భయంతో మూసివేశారు. బెత్లెహెంలోని ఓ హోటల్ కు వచ్చిన గ్రీకు టూరిస్టులలో ఇద్దరికి ‘కరోనా’ సోకినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో.. స్థానిక చర్చిలు, మసీదులు, ఇతర సంస్థలను తదుపరి సమాచారం ఇచ్చేవరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో చర్చ్ ఆఫ్ నేటివిటీని నిరవధికంగా మూసివేస్తున్నట్టు ఆ సంస్థ అధికార ప్రతినిధి గురువారం వెల్లడించారు. సాధారణ పరిస్థితుల్లో.. ఈస్టర్ కోసం (వచ్చే నెల) వేలాది మంది ఈ చర్చికి తరలి వస్తారు.
2020-03-05 Read Moreగత నెలలో ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న మతోన్మాద ఘర్షణల్లో మృతుల సంఖ్య 53కు చేరింది. దాడులకు గురైనవారిలో ఆరుగురు గురువారం మరణించినట్టు గురు తేజ్ బహుదూర్ ఆసుపత్రి ప్రకటంచింది. వీరితో కలిపి ఆ ఆసుపత్రిలో రిపోర్టయిన మృతుల సంఖ్య 44కు చేరింది. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో ఐదుగురు, ఎల్.ఎన్.జె.పి. ఆసుపత్రిలో ముగ్గురు, ప్రవేష్ చంద్ర ఆసుపత్రిలో ఒకరు చొప్పున మృతుల పేర్లు నమోదయ్యాయి. అల్లర్లకు సంబంధించి ఇప్పటిదాకా 654 కేసులు నమోదు కాగా 1829 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు.
2020-03-05 Read Moreతమ ఉద్యోగి ఒకరికి ‘కరోనా వైరస్’ సోకినట్టు నిన్న వెల్లడించిన ‘పేటిఎం’ సంస్థ గురుగ్రామ్ లోని కార్యాలయం మొత్తాన్ని 15 రోజులపాటు మూసివేస్తున్నట్టు గురువారం (మార్చి 5న) ప్రకటించింది. ఇతర ఉద్యోగులకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. నోయిడా కార్యాలయం మాత్రం వచ్చే సోమవారం నుంచి పని చేస్తుందని కంపెనీ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య సాయం అవసరమైతే కంపెనీకి తెలియజేయాలని ఉద్యోగులకు సూచించారు.
2020-03-05 Read More