‘‘పిచ్చి ట్రంప్...నా తండ్రి మరణంతో అంతా అయిపోయిందనుకోకు’’... అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ ఖాసిం సొలేమానీ కుమార్తె జైనాబ్ సొలేమానీ చేసిన హెచ్చరిక ఇది. సోమవారం టెహ్రాన్ నగరంలో తండ్రి అంతిమ యాత్రకు హాజరైన లక్షలాది ప్రజలను ఉద్ధేశించి ఆమె మాట్లాడారు. ఆ ప్రసంగాన్ని ఇరాన్ జాతీయ టెలివిజన్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
2020-01-06 Read Moreజవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంపై ముసుగు దుండగులు చేసిన దాడిపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ స్పందించారు. జర్మనీ నాజీ పాలన దిశగా సాగిన సంవత్సరాలకు అనేక ప్రతిధ్వనులు ఇప్పుడు వినిపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జరిగిన దాడిపై నిజాన్ని నిర్ధారించాలని ప్రధాని మోడీకి విన్నవించారు. ‘‘దేశ ప్రతిష్ఠ గురించి ఆలోచించే ప్రతి భారతీయుడూ ఆందోళన చెందవలసిన అంశమిది’’ అని అభిజిత్ ‘న్యూస్ 18’తో చెప్పారు.
2020-01-06 Read Moreజవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ మామిడాల జగదేశ్ కుమార్ ‘గూండాల నాయకుడు’లా ప్రవర్తించారని వర్శిటీ విద్యార్ధి సంఘం (జె.ఎన్.యు.ఎస్.యు) ఆరోపించింది. విద్యార్ధులు, అధ్యాపకులపై దాడికోసం కర్రలతో బయటి వ్యక్తులను అనుమతించారని ఆరోపించారు. ‘’వీసీ పిరికివాడు. చట్టవిరుద్ధమైన పద్ధతులను దొడ్డిదారిన ప్రవేశపెడతాడు. జె.ఎన్.యు.ను భూతంగా చూపించేందుకు ఓ వాతావరణాన్ని సృష్టిస్తాడు’’ జె.ఎన్.యు.ఎస్.యు. ధ్వజమెత్తింది.
2020-01-06 Read Moreఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తర్వాతనే కేంద్రం స్పందిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. సోమవారం తిరుపతిలో ఈ అంశంపై మరోసారి మాట్లాడారు. ఇప్పటిదాకా రాజధానిపై చర్చలన్నీ మంత్రుల నోటి మాటపైనే సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నాటి పరిస్థితుల్లో అమరావతి అభివృద్ధిపై మోడీ మాట ఇచ్చారని, తాను కూడా చొరవ తీసుకొని అమరావతిని ఇండియా మ్యాప్ లో పెట్టించానని చెప్పారు.
2020-01-06దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది. సోమవారం ఎన్నికల షెడ్యూలుతో పాటు ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది ఎన్నికల సంఘం. మొత్తం 1,46,92,136 మంది ఓటర్లకు గాను 80.55 లక్షల మంది (55 శాతం) పురుషులు. మహిళలు కేవలం 66.35 లక్షలు (45 శాతం).
2020-01-06ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 8వ తేదీన నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఢిల్లీలో విడుదల చేసింది. దాని ప్రకారం... జనవరి 14న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్లకు 21 వరకు గడువు ఉంటుంది. 22వ తేదీన స్క్రూటినీ తర్వాత 24 వరకు ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది. సోమవారం నుంచే ఎన్నికలబంధనావళి అమల్లోకి వచ్చింది.
2020-01-06సోమవారం స్టాక్ మార్కెట్లలోనూ రక్తపాతం జరిగింది. యుద్ధ భయంతో అమ్మకాలు పెరిగి... ఎస్ అండ్ పి బి.ఎస్.ఇ. సెన్సెక్స్ 826 పాయింట్లు (2 శాతం) పతనమైంది. బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4 శాతం), ఏషియన్ పెయింట్స్ (3 శాతం) తగ్గాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ 242 పాయింట్లు (1.9 శాతం) పతనమైంది. ఇరాక్ పైన ఆంక్షలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళన నెలకొంది.
2020-01-06 Read Moreఅమరావతి రైతులు తలపెట్టిన నిరసన దీక్షలు 20వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో సోమవారం రాజధానిలో ‘మహా పాదయాత్ర’ చేపట్టారు. మండల కేంద్రమైన తుళ్ళూరు నుంచి ప్రస్తుత సచివాలయం కొలువై ఉన్న ప్రాంతానికి దగ్గరి గ్రామం మందడం వరకు రైతులు, కూలీలు పాదయాత్ర నిర్వహించారు. రాజధానిని తరలించడానికి వీల్లేదని పాదయాత్రీకులు నినాదాలు చేశారు. జాతీయ జెండాలు, రైతు పతాకాలు చేతబూని ‘‘జై అమరావతి’’ అంటూ నినదించారు.
2020-01-06జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్ధులపై నిన్న రాత్రి జరిగిన దాడి తనకు ముంబై నగరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిని గుర్తు చేసిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. 2008 నవంబర్ 26న పాకిస్తాన్ నుంచి చొరబడిన ఉగ్రవాదులు ముంబైలో మారణహోమాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ముసుగులు ధరించి సమ్మెటలు, ఇనుప రాడ్లతో విద్యార్ధులు, అధ్యాపకులపై దాడి చేయడం ‘పిరికితనం’ అని థాకరే పేర్కొన్నారు.
2020-01-06 Read Moreరాజధాని తరలింపు ప్రయత్నాలకు నిరసనగా అమరావతి రైతులు రోడ్డెక్కి సోమవారానికి 20 రోజులు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటన, ఆ తర్వాత జిఎన్ రావు కమిటీ, తాజాగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు దాదాపు ఒకే మాట చెప్పడంతో.. రాజధానిని విశాఖకు తరలించడం ఇక లాంఛనప్రాయమే. అయితే, ప్రభుత్వమే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, తాము మాత్రం ఆందోళనను వీడేది లేదని రాజధాని రైతులు, కూలీలు చెబుతున్నారు.
2020-01-06