బోట్సువానాలోని కరోవె గనిలో టెన్నిస్ బాల్ పరిమాణంలో ఉన్న వజ్రం ఒకటి దొరికింది. లుకారా డైమండ్ కార్పొరేషన్ వెలికి తీసిన ఈ వజ్రం (1,758 కేరట్లు) ప్రపంచంలో ఇప్పటివరకు లభ్యమైన అతి పెద్దవాటిలో రెండవది. అతి పెద్ద వజ్రం (3,106 కేరట్లు) 1905లో దక్షిణాఫ్రికాలో దొరికింది. నాలుగేళ్ళ క్రితం లుకారా కంపెనీ కరోవె గనిలో కనుగొన్న 1,1099 కేరట్ల వజ్రమే ఇప్పటిదాకా రెండో అతి పెద్దది. తాజాగా అదే గనిలో దానికంటే పెద్ద వజ్రం దొరికడం విశేషం. అయితే, ఈ వజ్రం మునుపటివాటికంటే తక్కువ నాణ్యతగలదని, ధర కూడా తక్కువే ఉంటుందని కంపెనీ తెలిపింది.
2019-04-25 Read Moreసాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ తొలిసారిగా ట్రిలియన్ డాలర్ల (రూ. 70,25,000 కోట్లు) విలువను నమోదు చేసుకుంది. 2018-19 చివరి త్రైమాసికంలో కంపెనీ లాభాలు 19 శాతం పెరిగాయని నిన్న ప్రకటించిన నేపథ్యంలో, గురువారం షేర్ విలువ 5 శాతం పెరిగి 130.59 డాలర్లకు చేరింది. దీంతో ట్రిలియన్ డాలర్ల మార్కును దాటిన మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ ఆ తర్వాత కొద్దిగా తగ్గింది. ట్రిలియన్ డాలర్ విలువను నమోదు చేసిన కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ మూడవది. యాపిల్, అమేజాన్ గతంలో అంత విలువకు పెరిగి తర్వాత కొద్దిగా తగ్గాయి.
2019-04-25 Read Moreశ్రీలంక బాంబు పేలుళ్ళలో ఎనిమిది మంది భారతీయులు మరణించినట్టు ఇప్పటివరకు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ఆది, సోమవారాల్లో ఐదుగురు భారతీయుల పేర్లను శ్రీలంక విదేశాంగ శాఖ నిర్ధారించగా, మరో ముగ్గురిని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారమే గుర్తించారు. ఎన్నికల అనంతరం విహారానికి వెళ్లిన జెడి(ఎస్) నేతల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కేరళకు చెందిన పి.ఎస్. రసీన కూడా మరణించినవారిలో ఉన్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం వెల్లడించారు. అయితే, శ్రీలంక ప్రభుత్వం ఈ విషయాన్ని నిర్ధారించలేదు.
2019-04-22 Read Moreశ్రీలంకలో ఆదివారం జరిగిన భీకర ఉగ్రవాద దాడుల్లో మరణించినవారి సంఖ్య 300కు చేరువైంది. గాయపడినవారి సంఖ్య సుమారు 500. సోమవారం కూడా ఓ బాంబు పేలింది. పేలుళ్ళకోసం ఉగ్రవాదులు సిద్ధం చేసిన 87 డిటొనేటర్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈస్టర్ రోజున జరిగిన నరమేథంలో మరణించినవారిని సోమవారం గుర్తించారు. ఈ దాడుల వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉన్నట్టు శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది. దాడుల్లో ప్రమేయం ఉందనే అనుమానంతో 24 మందిని శ్రీలంక భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
2019-04-22క్రైస్తవుల పండుగ ఈస్టర్ రోజున (ఆదివారం) శ్రీలంక ఉగ్రవాద దాడులతో వణికిపోయింది. చర్చిలు, విదేశీయులు బస చేసే హోటళ్ళు ప్రధాన లక్ష్యాలుగా జరిగిన బాంబు పేలుళ్ళలో 207 మంది మరణించారు. అందులో 8 దేశాలకు చెందిన 30కి మందికి పైగా టూరిస్టులు ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఉన్న సమచారం ప్రకారం మొత్తం 8 చోట్ల బాంబు పేలుళ్ళు జరిగాయి. మరిన్నిచోట్ల బాంబు పేలుళ్ళు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఐఎస్ఐఎస్ ప్రభావిత ఉగ్రవాద సంస్థకు చెందిన ఆరుగురు ఆత్మహుతి బాంబర్లు ఈ దాడులకు పాల్పడినట్టు గుర్తించారు.
2019-04-212014 నుంచి వివిధ రాష్ట్రాల ఎన్నికలకు ప్రచారంకోసం బీజేపీ, కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున విమానాలు, హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. వాటి నిమిత్తం రెండు పార్టీలూ రూ. 496 కోట్లు చెల్లించాయి. అందులో బీజేపీ వాటా రూ. 327 కోట్లు. 2018లో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకోసం బీజేపీ రూ. 70 కోట్లు విమానాలపై వెచ్చించింది. ఒక్క మధ్య ప్రదేశ్ ప్రచారంకోసమే రూ. 40 కోట్లు చెల్లించింది. 2017లో జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 73 కోట్లతో బీజేపీ విమానాలను, హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంది. 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఎంత ఖర్చు చేశారన్నది ప్రక్రియ మొత్తం ముగిశాక సమర్పించే లెక్కల ద్వారా తెలుస్తుంది.
2019-04-22 Read Moreభారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తనను లైంగికంగా వేధించారని ఓ 35 సంవత్సరాల మహిళ చేసిన ఆరోపణ సంచలనం సృష్టిస్తోంది. ఆయన తన నడుము పట్టుకొని కౌగిలించుకున్నారని, తన శరీరమంతా తడిమారని ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో పని చేసిన ఆ మాజీ ఉద్యోగి ఆరోపించారు. ఆమె పేరిట ఓ అఫిడవిట్ ఈ నెల 19వ తేదీన 22 మంది సుప్రీం న్యాయమూర్తుల నివాసాలకు అందింది. రంజన్ గొగోయ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక 2018 అక్టోబర్ 10, 11 ఆయన నివాసంలో ఈ ఘటనలు జరిగినట్టుగా ఆ అఫిడవిట్ పేర్కొంది.
2019-04-20ఇండియాతో రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరిన ఆరు నెలల తర్వాత అనిల్ అంబానీకి ఫ్రాన్స్ ప్రభుత్వం 143.7 మిలియన్ యూరోల (సుమారు రూ. 1,125 కోట్ల) పన్ను రాయితీ ఇచ్చినట్టు వెల్లడైంది. ఫ్రాన్స్ పత్రిక ‘లీ మాండే’ వెలువరించిన తాజా కథనం సంచలనం సృష్టిస్తోంది. అనిల్ అంబానీకి చెందిన ఫ్రెంచ్ టెలికం కంపెనీ ‘రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్’ 151 మిలియన్ యూరోల (రూ. 1,182 కోట్ల) మేరకు పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉండగా..కేవలం 7.6 మిలియన్ యూరోల (రూ. 59.50 కోట్ల)కు తగ్గించారు.
2019-04-13 Read Moreఒక ఎన్నికల ట్రస్టుకు ఏకంగా రూ. 220 కోట్లు ($31.2 మిలియన్) ఇచ్చినట్టు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వెల్లడించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ‘‘ఇతర ఖర్చుల’’ కింద ఈ మొత్తాన్ని చూపించింది. ఇండియాలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఎన్నికల విరాళాల్లో ఇదొకటి. అయితే, ఈ ఎన్నికల నిధితో ఏయే పార్టీలు లబ్ది పొందాయన్న విషయం వెల్లడి కాలేదు. కార్పొరేట్లు, రాజకీయ పార్టీలకు మధ్యవర్తులుగా దేశంలో అనేక ఎన్నికల ట్రస్టులు పని చేస్తున్నాయి. వాటిలో అతి పెద్దది ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు. 2017-18లో ఈ ట్రస్టు పార్టీలకు ఇచ్చిన రూ. 169 కోట్లలో రూ. 144 కోట్లు ఒక్క బీజేపీకే అందాయి.
2019-04-13 Read Moreరాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ‘ద హిందూ’ పత్రిక వెల్లడించిన ‘రహస్య పత్రాలు’ సాక్ష్యాలుగా పరిగణించకూడదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తానే గతంలో మోదీ ప్రభుత్వానికి ఇచ్చిన ‘క్లీన్ చిట్’ను సమీక్షించడానికి అంగీకరించింది. రాఫేల్ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా నాలుగు నెలల క్రితం పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే, ఆ అఫిడవిట్ లో కేంద్రం కొన్ని అవాస్తవాలను చెప్పినట్టు తర్వాత వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే.. రక్షణ శాఖ పత్రాలను ఉటంకిస్తూ ‘హిందూ’ వరుస కథనాలను ఇచ్చింది.
2019-04-10 Read More