అణ్వాయుధ సామర్థ్యంతో డి.ఆర్.డి.ఒ. రూపొందించిన కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని పి’ పరీక్ష విజయవంతమైంది. ఒడిషా తీరానికి దగ్గరగా ఉన్న డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం దీవి నుంచి సోమవారం ఉదయం 10.55 గంటలకు ఈ క్షిపణిని ప్రయోగించారు. తూర్పు తీరం పొడవునా ఉన్న టెలిమెట్రీ, రాడార్ స్టేషన్లు ఈ క్షిపణి గమనాన్ని పరిశీలించాయి. నిర్దేశించిన మార్గంలో ప్రయాణించి కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుందని అధికారులు తెలిపారు. అగ్ని తరగతి క్షిపణుల్లో ఆధునికమైన ‘అగ్ని పి’ 1000- 2000 కి.మీ. మధ్య లక్ష్యాలను ఛేదించగలదు.
2021-06-28 Read Moreకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం 8 కొత్త పథకాలను ప్రారంభించారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికంటూ రూ. లక్షా 10 వేల కోట్లతో కొత్త రుణ గ్యారంటీ పథకాన్ని, గతంలో ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా ఉన్న ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకానికి అదనంగా రూ. లక్షన్నర కోట్లను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకోసం రూ. 50 వేల కోట్ల మేరకు రుణ సదుపాయం కల్పిస్తారు. దీనిపై వడ్డీ 7.95 శాతం. ఇతర రంగాలకు ఇచ్చే మరో రూ. 60 వేల కోట్ల రుణాలపై 8.25 శాతం వడ్డీ ఉంటుంది.
2021-06-28 Read Moreసామాజిక మాధ్యమ దిగ్గజాల్లో ఒకటైన ట్విట్టర్, భారత ప్రభుత్వం మధ్య నడుస్తున్న వివాదాల పరంపరలో మరొకటి చేరింది. ట్విట్టర్ కెరీర్స్ పేజీలో ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యాలయాలను చూపించే మ్యాప్ మరో వివాదానికి మూలంగా ఉంది. అందులో కాశ్మీర్ ను విడిగా చూపించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ సంగతి అలా ఉంచితే, ఇండియా అధీనంలో ఉన్న భూభాగాన్ని కూడా దేశం పరిధిలో చూపలేదు. లడఖ్ చైనాలో భాగం అన్నట్టుగా ఉంది ఆ మ్యాప్. కొత్త ఐటి నిబంధనలను గట్టిగా వ్యతిరేకిస్తున్న ట్విట్టర్ పై మోదీ ప్రభుత్వం ఇప్పటికే గుర్రుగా ఉంది.
2021-06-28 Read Moreరాష్ట్రంలో 18-45 సంవత్సరాల వయసువారికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ (మే 1 నుంచి) వేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం కోవిడ్ పరిస్థితిపై తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సిఎం ఈ విషయాన్ని వెల్లడించారు. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వ్యాక్సిన్ వేయడానికి గతంలో నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం, యువత విషయంలో ఆ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టిన సంగతి తెలిసిందే.
2021-04-23న్యూఢిల్లీ నుంచి ఇటీవల హాంకాంగ్ వెళ్లిన విమానంలో 47 మందికి ‘కరోనా’ సోకినట్టు గుర్తించారు. ఆ విమాన ప్రయాణీకుల్లో వీరు నాలుగో వంతు. విమానం ఎక్కడానికి 72 గంటల లోపల పిసిఆర్ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చినట్టు వీరంతా రిపోర్టులు చూపించారని, అయితే హాంకాంగ్ లో విమానం దిగగానే జరిపిన పరీక్షలలో 25 మందికి, ఆ తర్వాత మరో 22 మందికి ‘కరోనా’ పాజిటివ్ తేలిందని చైనా మీడియా సంస్థ సిజిటిఎన్ తెలిపింది. ఇండియాలో కేసుల భారీ పెరుగుదలకు కొంతవరకు భారీ హిందూ క్రతువులు కారణమని పేర్కొంది.
2021-04-20అపార్టుమెంట్లు, మొహల్లాలు, స్థానిక సమాజాలలో చిన్న కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా అందరూ కొవిడ్ నియమనిబంధనలను పాటించేలా సహాయపడాలని యువతకు విన్నవించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ‘‘మనం ఆ పని చేస్తే, ప్రభుత్వాలు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయనక్కర్లేదు. కర్ఫ్యూ, లాక్ డౌన్ విధించనవరం లేదు’’ అని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశంలో కరోనా మహమ్మారి రెండో ఉప్పెన మరణ మృదంగం మోగిస్తున్న నేపథ్యంలో మోదీ మంగళవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
2021-04-20ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరోసారి విశ్వరూపాన్ని చూపుతోంది. గత ఏడాది రోజుకు 10 వేల కేసులకు పైగా నమోదైన సందర్భాలున్నాయి. తాజాగా వెల్లడించిన సమాచారంలో పరిగణించిన 24 గంటల్లో 8,987 కేసులు నమోదయ్యాయి. కరోనా రెండో వెల్లువలో ఇదే అత్యధికం. ఒక్క రోజులో 35 మంది మరణించారు. దీంతో కలిపి మృతుల సంఖ్య 7,472కి చేరింది. తాజా సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 1347 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళంలో 1344 కేసులు, గుంటూరులో 1202, చిత్తూరులో 1063, తూర్పుగోదావరిలో 851 కేసులు నమోదయ్యాయి.
2021-04-20‘చాద్’ అధ్యక్షుడు ఇద్రిస్ డెబి రెబల్స్ తో పోరాటంలో మరణించినట్టు ఆ దేశపు మిలిటరీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్రంట్ లైన్ లోని సైనికులను కలుసుకునేందుకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగినట్టు పేర్కొంది. అంతకు మించి వివరాలను వెల్లడించలేదు. డెబి మరణవార్తతో పాటే ఆయన కుమారుడిని దేశానికి తాత్కాలిక నాయకునిగా నియమిస్తూ ప్రకటన వెలువడింది. ప్రభుత్వం, పార్లమెంటు రద్దయ్యాయి. మరణించిన డెబి (68) పశ్చిమ దేశాల మద్ధతుతో దేశాన్ని 30 సంవత్సరాల పాటు ఉక్కుపాదంతో పాలించారు.
2021-04-20ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్లో 13వ మ్యాచ్ మంగళవారం ప్రారంభమైంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ చేయనున్నట్టు తెలిపారు. ఇంతకు ముందు ఈ రెండు జట్లు 28 సందర్భాల్లో తలపడగా ముంబై 16 సార్లు విజయం సాధించింది. మిగిలిన 12 సార్లు ఢిల్లీ జట్టు గెలిచింది. చివరి 5 మ్యాచ్ లలో వరుసగా ముంబై ఇండియన్స్ విజయం సాధించడం విశేషం.
2021-04-20‘అప్పొ’ ఫోన్ తాజా 5జి మోడల్ (ఎ74) ఇండియాలో విడుదలైంది. 6.48 అంగుళాల తెర, 90హెడ్జ్ డిస్ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 480 ఎస్ఒసి/6జిబి, 48ఎంపి మెయిన్ కెమేరా, 8ఎంపి సెల్ఫీ కెమేరా, 128 జిబి స్టోరేజీ, 5000ఎంఎహెచ్ బ్యాటరీ ఫీచర్లతో విడుదలైన ఈ ఫోన్ ధర ఇండియాలో రూ. 17,900. ఆండ్రాయిడ్ 11పై నడిచే ఈ ఫోన్ ఏప్రిల్ 26 మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ‘అమేజాన్ ఇండియా’లో లభిస్తుంది. మెయిన్ కెమేరా కూటమిలో 48 ఎంపి (ఎఫ్/1.7) ప్రాథమిక సెన్సర్, ఒక 2ఎంపి (ఎఫ్/2.4) డెప్త్ లెన్స్, మరో 2ఎంపి (ఎఫ్/2.4) మ్యాక్రో సెన్సర్ ఉంటాయి.
2021-04-20