సామూహిక హత్యాచారం నిందితుల కాల్చివేతపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిషన్ సభ్యుల్లో ఇద్దరు మాజీ న్యాయమూర్తులు కాగా ఒకరు సీబీఐ మాజీ డైరెక్టర్. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.ఎస్. సిర్పూర్కర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్లో బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా సొండూర్ బాల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డి.ఆర్. కార్తికేయన్ ఉన్నారు. ఈ కమిషన్ హైదరాబాద్ నుంచే పని చేయవలసి ఉంది. ఆరు నెలల్లోగా విచారణ నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది.
2019-12-12మత ప్రాతిపదికన పౌరసత్వ చట్టానికి సవరణలు చేసినందుకు అస్సాంలో నిరసన తెలుపుతున్న ప్రజలను చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు. రాష్ట్ర రాజధాని గౌహతిలో గురువారం జరిగిన కాల్పుల్లో కొంతమంది గాయపడినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి నిర్ధారించారు. నిరసనకారులు రాళ్లు విసిరారని, వాళ్లను చెదరగొట్టడానికి చేసిన ఇతర ప్రయత్నాలు విఫలం కావడంతో కాల్పులు జరిపామని ఆయన చెప్పారు. నిన్న విధించిన కర్ఫ్యూను సైతం ధిక్కరించి ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
2019-12-12రాఖీ పండుగ పోయి నాలుగు నెలలైంది. మరో 8 నెలలకు గాని 2020 రాఖీ రాదు. అయితే, రాజకీయ నాయకులకు ఒరిజినల్ పండుగలతో పనేముంది? ఏ సందర్భంలో ఏ పండుగైనా చేసుకోవచ్చు! ఈ తీరుగానే గురువారం అసెంబ్లీలో ‘రాజకీయ రాఖీ’ పండుగ నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు. రేపిస్టులకు మరణశిక్ష విధించేలా ‘దిశ చట్టం’ చేసినందుకు సిఎం జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తూ... వారు రాఖీలు కట్టారు. హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే రోజా రాఖీలు కట్టినవారిలో ఉన్నారు.
2019-12-12ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు గురువారం మరణించారు. నాటక రచయితగా ప్రస్థానాన్ని ప్రారంభించి మంచి సినీ నటుడిగా ఖ్యాతిని గడించారు. సుమారు 250 సినిమాల్లో నటించారు. ‘ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య’ ఆయన మొదటి సినిమా. ‘సంసారం ఒక చదరంగం’ వంటి సినిమాల్లో నట విశ్వరూపాన్ని చూపించారు. గొల్లపూడి 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. అనారోగ్యంతో చెన్నైలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మరణించారు.
2019-12-12మాజీ సిఎం చంద్రబాబుకు ఇంగ్లీషు అర్ధం కాకపోవడం అనే సమస్య ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. మీడియాపై కేసులు పెట్టాలంటూ జారీ చేసిన జీవో 2430పై గురువారం అసెంబ్లీలో చంద్రబాబు చేసిన విమర్శలను జగన్ తప్పు పట్టారు. జీవోని చంద్రబాబు చదివారా? అని ప్రశ్నిస్తూ... చదివినా కొంచెం ఇంగ్లీషు అర్దం కాని సమస్య ఉంది కాబట్టి అలా మాట్లాడారేమోనని జగన్ వ్యాఖ్యానించారు. దీనికి చంద్రబాబు ‘‘మాకు ఇంగ్లీషు అర్దం కాదు. ఆయన ఇంగ్లీషులో పుట్టాడు’’ అని ప్రతివ్యాఖ్య చేశారు.
2019-12-12అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రోజుకో అంశాన్ని హైలైట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ... గురువారం మీడియాపై ప్రభుత్వ ఆంక్షలను ఎంచుకుంది. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే వార్తలు రాసేవారిపై కేసులు పెట్టే అధికారాన్ని వివిధ శాఖల అధికారులకు కట్టబెడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430ను, అసెంబ్లీ సమావేశాల ప్రసారాల విషయంలో మూడు ఛానళ్లపై విధించిన ఆంక్షలను నిరసిస్తూ నల్ల రిబ్బన్లతో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వరకు ర్యాలీ చేపట్టారు.
2019-12-12పౌరసత్వ (సవరణ) బిల్లు 2019 రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. బుధవారం సుదీర్ఘ చర్చ తర్వాత 125-99 తేడాతో ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ ల నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం కల్పించడమే ప్రధానాంశంగా పాత చట్టానికి బీజేపీ ప్రభుత్వం సవరణలను ప్రతిపాదించింది. ముస్లిం శరణార్దులను మాత్రమే మినహాయించడం, ఇతర మతాలవారికి పౌరసత్వం ఇవ్వనుండటం వివాదాస్పదమైంది.
2019-12-11వెటర్నరీ డాక్టర్ సామూహిక హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు కాల్చి చంపిన ఘటనపై న్యాయ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి వి.ఎస్. సిర్పూర్కర్ నేతృత్వంలోని కమిషన్ విచారణ చేపడుతుందని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే ప్రకటించారు. నిందితుల కాల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై వాదనలు విన్న ధర్మాసనం ‘‘ఆ ప్రదేశానికి నిందితులను ఆ సమయంలోనే ఎందుకు తీసుకెళ్లారు? నిందితులు పేల్చిన తూటాలు ఎక్కడ?...’’ వంటి అనేక ప్రశ్నలను సంధించింది.
2019-12-12అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీ పరిశీలన జరపాలన్న అధికార పార్టీ విన్నపానికి స్పీకర్ తమ్మినేని సీతారాం సానుకూలంగా స్పందించారు. తొలిగా అసెంబ్లీ ఆవరణలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, మార్షల్స్ మధ్య జరిగిన పరిణామాలపై ఎథిక్స్ కమిటీ పరిశీలనకు సిఫారసు చేశారు. ఆవరణలో చీఫ్ మార్షల్స్ చంద్రబాబు చేయి పట్టుకు తోశారని తెలుగుదేశం సభ్యులు ఆరోపించగా, ‘‘ఉన్మాది సిఎం అయితే ఇలాగే ఉంటుంది’’ అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్ ను అధికార పార్టీ అసెంబ్లీలో ప్రదర్శించింది.
2019-12-12మత ప్రాతిపదికన పౌరసత్వ చట్టానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సవరణలపై ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా అస్సాం రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. పెద్ద మొత్తంలో పారా మిలిటరీ బలగాలను అస్సాంకు తరలించింది. అస్సాం పంపడంకోసం కొన్ని దళాలను కాశ్మీర్ నుంచి ఉపసంహరించారు. రాజధాని గౌహతిలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.
2019-12-11