మెక్సికో సరిహద్దులో కోట్లాది డాలర్లు ఖర్చుపెట్టి భారీ కంచెను నిర్మించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టుదలను ఇరువైపులా ప్రజలు ధిక్కరిస్తున్నారు..వెక్కిరిస్తున్నారు. సరిహద్దు కంచెకు తగిలించిన గులాబి రంగు ఊయలలపై ఆడుకుంటున్న పిల్లల రూపంలో..ఓ ఆనంద హేళన వ్యక్తమవుతోంది. సరిహద్దు గోడ వ్యతిరేక ప్రచారకుడు, ఆర్కిటెక్ట్ రొనాల్డ్ రయేల్ ఈ ఊయలలను ఏర్పాటు చేశారు. అటు మెక్సికన్లు, ఇటు అమెరికన్లు ఊయలూగుతూ తమ బంధాన్ని చాటుతున్నారు.
2019-07-30 Read Moreఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సహనిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియాలో అరెస్టయినట్టుగా వార్తలు వచ్చాయి. వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్టు ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్ పిక్) షేర్ హోల్డింగ్ వివాదంలో రస్ అల్ ఖైమా ప్రభుత్వ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెల్ గ్రేడ్ పోలీసులు నిమ్మగడ్డను రెండు రోజుల క్రితం అరెస్టు చేసినట్టు సమాచారం. గతంలో జగన్ కేసులో ఆయనతోపాటు నిమ్మగడ్డను కూడా సీబీఐ అరెస్టు చేసి జైలుకి పంపింది.
2019-07-30 Read More‘కేఫ్ కాఫీడే’ వ్యవస్థాపకుడు, కర్నాటక మాజీ సిఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వి.జి. సిద్ధార్థ సోమవారం అదృశ్యమయ్యారు. మంగళూరులో నేత్రావతి నది వద్ద కారు దిగి కొద్ది సేపు ఫోన్లో మాట్లాడిన సిద్ధార్థ తర్వాత కనిపించకుండా పోయినట్టు డ్రైవర్ చెబుతున్నాడు. పోలీసులు గజ ఈతగాళ్ళ సాయంతో నదిని జల్లెడ పడుతున్నారు. సిద్ధార్థ అదృశ్యంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
2019-07-29ఓపెనింగ్ బ్యాట్స్ మన్ పృథ్వీషాపై బీసీసీఐ 8 నెలల నిషేధాన్ని విధించింది. పృథ్వీషా గత ఫిబ్రవరిలో ఇండోర్ లో సయ్యద్ ముస్తాక్ అలి ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా దగ్గు మందు తాగి ‘అనుకోకుండా’ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించాడని బీసీసీఐ పేర్కొంది. నిషేధం అప్పటినుంచే వర్తించేలా ‘షా’ను నవంబర్ 15 వరకు (మూడున్నర నెలలు) సస్పెండ్ చేసింది. విదర్భ అండర్ 23 క్రికెటర్ అక్షయ్ దుల్లర్వార్, రాజస్థాన్ అండర్ 19 క్రికెటర్ దివ్య గజరాజ్ లపై కూడా ఆంక్షలు విధించింది.
2019-07-30 Read Moreలోక్ సభ ఆమోదంతో రాజ్యసభకు వెళ్లిన ట్రిపుల్ తలాక్ బిల్లు అక్కడా పాసైంది. మంగళవారం ఈ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా జెడి(యు), ఎఐఎడిఎంకె వాకౌట్ చేయడంతో నంబర్ గేమ్ ప్రభుత్వానికి అనుకూలంగా మారింది. బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు పడగా, 84 మంది వ్యతిరేకించారు. టిఆర్ఎస్, టీడీపీ గైర్హాజరయ్యాయి. ఈ బిల్లును రాజ్యసభ పరిగణనలోకి తీసుకోవడం ఇది మూడోసారి. ఈ నెల 25వ తేదీన బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది.
2019-07-30 Read Moreగ్యాంగ్ రేప్ ఘటనలో బతికి బయటపడ్డ ఉన్నావ్ బాధితురాలు.. నిన్న జరిగిన హత్యాప్రయత్నంలో తీవ్రంగా గాయపడి మరణంతో పోరాడుతున్నారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వెంటిలేటర్ మద్ధతుతోనే శ్వాస తీసుకుంటున్నానరని లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్శిటీ వైద్యులు చెప్పారు. బాధితురాలు, ఆమె లాయర్, ఇద్దరు ఆంటీలు ఆదివారం రాయబరేలి వెళ్తుండగా వారి కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఆ ఘటనలో ఇద్దరు చనిపోగా ఆమె, లాయర్ తీవ్రంగా గాయపడ్డారు.
2019-07-29 Read Moreకర్నాటక అసెంబ్లీలో వారం రోజుల్లో రెండు విశ్వాస పరీక్షలు నిర్వహించిన అనంతరం స్పీకర్ కెఆర్ రమేష్ కుమార్ సోమవారం రాజీనామా చేశారు. తొలి విశ్వాస పరీక్షలో కాంగ్రెస్, జెడిఎస్ ప్రభుత్వం కూలిపోగా.. సోమవారం బీజేపీ నేత యెడియూరప్ప నెగ్గారు. ఇది జరిగిన గంటకే రమేష్ కుమార్.. తన రాజీనామాతో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డికి ఘన నివాళి అర్పిస్తున్నానని ప్రకటించారు. తానిప్పుడు బంధనాలనుంచి విముక్తిడినయ్యానని వ్యాఖ్యానించారు.
2019-07-29 Read Moreకర్నాటక అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో బీజేపీ నేత యెడియూరప్ప విజయం సాధించారు. కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు ఓటింగ్ జరపాలని పట్టుపట్టకపోవడంతో మూజువాణి ఓటుతోనే విశ్వాస పరీక్షను ముగించారు. కాంగ్రెస్, జెడిఎస్ రెబల్ ఎమ్మెల్యేలు 17 మందిపై అనర్హత వేటుతో.. అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 208కి తగ్గిపోయింది. బిజెపికి సాధారణ మెజారిటీకి కావలసిన బలం (105) ఉండగా.. కాంగ్రెస్, జెడిఎస్ కూటమికి 99 మంది ఉన్నారు.
2019-07-29ఉన్నావ్ రేప్ కేసులో జైలుకు వెళ్లిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, తాజాగా బాధితురాలి కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన కేసును ఎదుర్కొంటున్నాడు. ఆదివారం బాధితురాలు తన లాయర్, ఇద్దరు బంధువులతో కలసి రాయబరేలి వెళ్తుండగా ఓ ట్రక్కు వారి కారును ఢీకొట్టింది. బాధితురాలి ఇద్దరు ఆంటీలు చనిపోగా ఆమె, లాయర్ గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సెంగార్, అతని సోదరుడు మనోజ్ సింగ్ లపై హత్య, నేరపూరిత కుట్ర కేసులు నమోదయ్యాయి.
2019-07-29 Read Moreఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని రాయబరేలి వద్ద జరిగిన ఈ ఘటనలో బాధితురాలి బంధువు చనిపోగా, కారులోనే ఉన్న ఆమె లాయర్ మహేంద్ర సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనను రేప్ చేసినట్టు గతంలో ఈ మహిళ కేసు పెట్టారు. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే జైల్లో ఉన్నారు. వేరొక కేసులో రాయబరేలి జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాధితురాలి బంధువును కలిసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
2019-07-28 Read More