2020 టి 20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ల షెడ్యూలు మంగళవారం విడుదలైంది. ఈసారి రెండు టోర్నమెంటులనూ ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్నారు. ముందుగా మహిళల టి20 ప్రపంచ కప్ పోటీలు 2020 ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8వరకు జరుగుతాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ఫైనల్ మ్యాచ్ జరగనుండటం విశేషం. పురుషుల టి20 కప్ పోటీలు 2020 అక్టోబర్ 18న మొదలై నవంబర్ 15తో ముగుస్తాయి.
2019-01-29 Read Moreరాఫేల్ కుంభకోణం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇరుకున పెట్టే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం మరో ట్విస్టు ఇచ్చారు. మోడీ హయాంలోనే రక్షణ శాఖ మంత్రిగా పని చేసి... ప్రస్తుతం గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ తో రాహుల్ భేటీ అయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న పారికర్ ను పలకరించడానికే కలిశామని రాహుల్ చెబుతున్నా... రాఫేల్ కుంభకోణంలో ఆరోపణల నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత చోటు చేసుకుంది. రాఫేల్ కుంభకోణంలో మోడీ పాత్రకు సంబంధించిన రహస్య సమాచారం పారికర్ వద్ద ఉందని రాహుల్ అనేకసార్లు చెప్పారు.
2019-01-29 Read Moreరక్షణ, రైల్వే శాఖల మాజీ మంత్రి, సమతా పార్టీ నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ (88) మంగళవారం ఢిల్లీలో మరణించారు. కార్మిక సంఘం నేతగా, 1975 ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడిన నాయకుల్లో ఒకరిగా ఫెర్నాండెజ్ ప్రముఖులు. వాజ్ పేయి ప్రభుత్వంలో ఆయన రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. ఫెర్నాండెజ్ మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతాపం వెలిబుచ్చారు.
2019-01-29 Read More2019 ఎన్నికలే లక్ష్యంగా రైతులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు రాయితీలు ప్రకటించబోతున్నారు. సోమవారం జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ‘రైతు ప్యాకేజీ’ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీ మాఫీ చేయడం, పంటల బీమా ప్రీమియంలో రైతు వాటాను పూర్తిగా ఎత్తివేయడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో అమలు చేసిన ‘రైతుబంధు’ తరహా పథకాలను కూడా కేంద్రం పరిశీలించింది.
2019-01-27పీఠాధిపతి స్థానంనుంచి ముఖ్యమంత్రి అవతారమెత్తిన యోగి ఆదిత్యనాథ్ స్టైలే వేరు. ఈసారి ఆయన తన కేబినెట్ సమావేశాన్ని కుంభమేళా స్థలిలో నిర్వహించాలని నిర్ణయించి ఆసక్తిని రేపారు. ఈ నెల 29వ తేదీన ఉత్తరప్రదేశ్ కేబినెట్ సమావేశం అలహాబాద్ నగరంలోని కుంభమేళా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే నిర్వహించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సహచర మంత్రివర్గ సభ్యులతో కలసి నదిలో స్నానమాచరించనున్నట్టు సమాచారం. యూపీ కేబినెట్ సమావేశం ఇలా జరగనుండటం ఇదే తొలిసారి.
2019-01-27