వేసవిలో ‘కరోనా వైరస్’ వ్యాపించదన్న ధీమా ఇండియాలో ఎక్కువగా ఉంది. అయితే.. ప్రస్తుతం వేసవి తాపాన్ని చూస్తున్న సింగపూర్ లో ‘కరోనా’ కేసులు 187కు చేరాయి. అంతకంటే కొద్దిగా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఆస్ట్రేలియాలో 140, బ్రెజిల్ లో 77 కేసులు నమోదయ్యాయి. అక్కడేం చలిలేదు. కానీ.. ఆస్ట్రేలియా హోంమంత్రి, బ్రెజిల్ అధ్యక్షుడి మీడియా కార్యదర్శి వైరస్ బారిన పడ్డారు. సూర్యకిరణాలు, వేడి వైరస్ వ్యాప్తిని, జీవిత కాలాన్ని పరిమితం చేస్తాయని.. వాటికంటే పరిశుభ్రతే ఎక్కువగా నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇండియా పాటించవలసింది ఇదే.
2020-03-13 Read Moreఅమెరికాలోని కెంటుకీ, మేరీలాండ్, ఓహియో, మిచిగాన్, న్యూమెక్సికో రాష్ట్రాల్లో అన్ని పాఠశాలలనూ మూసివేశారు. వాషింగ్టన్ ఈ వరుసలోనే ఉంది. మూసివేతకు సిద్ధం కావాలని గవర్నర్ జే ఇన్స్లీ సూచించారు. ‘కరోనా’భయం వ్యాపించిన నేపథ్యంలో.. మార్చి 16 నుంచి 5 రాష్ట్రాల్లో కె-12 పాఠశాలలన్నీ మూతపడనున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో నగర పాలక సంస్థలు పాఠశాలలను మూసివేశాయి. శాన్ ఫ్రాన్సిస్కో, డెన్వర్, అట్లాంటా, ఆస్టిన్, డల్లాస్, హూస్టన్, సియాటిల్ నగరాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
2020-03-13రాష్ట్రంలో అరాచకంపై పోలీసులు, పాలనాధికార యంత్రాంగంతో పాటు గవర్నరు కూడా చేతులెత్తేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు. ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి కోర్టులే దిక్కని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అక్రమాలు, ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలపై గవర్నరుకు రెండు- మూడు సార్లు ఫిర్యాదు చేశామని, ఆయన నుంచి ఏ స్పందనా లేదని యనమల శుక్రవారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. లా అండర్ ఆర్డర్ సిఎం చేతుల్లో ఉందని, పోలీసు వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఫాసిస్టులా పాలిస్తున్నారని దుయ్యబట్టారు.
2020-03-13ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్ డట్టన్ ‘కరోనా వైరస్’ బారిన పడ్డారు. ఈరోజు (మార్చి 13) ఉదయం జ్వరం, గొంతు నొప్పితో నిద్ర లేచిన మంత్రి పరీక్ష చేయించుకోగా వైరస్ నిర్ధారణ అయింది. ఆయన వెంటనే ఆసుపత్రిలో చేరారు. ఇరాన్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు ‘కరోనా’ సోకిన నేపథ్యంలో.. నిన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోయిర్ ట్రూడోకు కూడా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో ప్రధాని ట్రూడో కూడా 14 రోజుల పాటు విడిగా ఉండటానికి నిర్ణయించుకున్నారు. ఈ రోజుల్లో తాను ఇంటివద్ద నుంచే పని చేస్తానని చెప్పారు.
2020-03-13గ్రామ పంచాయతీలలో పన్నులను 100 శాతం వసూలు చేయకపోతే కార్యదర్శి, సర్పంచ్ ఉద్యోగాలు ఊడతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హెచ్చరించారు. అసెంబ్లీలో శుక్రవారం ఈ అంశంపై మాట్లాడిన కేసీఆర్.. పంచాయతీలు, మున్సిపాలిటీలలో పన్నులను పెంచబోతున్నామని స్పష్టం చేశారు. ఆస్తి పన్ను పెంచుతామని వెల్లడించారు. ప్రజలే ఎవరికి వారు వారి ఇంటి విస్తీర్ణాన్ని బట్టి పన్ను చెల్లించాలని, అధికారులు కొలవబోరని చెప్పారు. అయితే, విస్తీర్ణం విషయంలో అబద్ధం చెబితే పన్నుకు 25 రెట్లు జరిమానా, రెండేళ్ళు జైలు శిక్ష ఉంటాయని హెచ్చరించారు.
2020-03-13టోక్యో ఒలింపిక్స్ 2020ని ఏడాది పాటు వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఒలింపిక్స్ ప్రారంభానికి 134 రోజులు ఉన్న నేపథ్యంలో.. వాయిదాకు సూచించిన తొలి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. శుక్రవారం జపాన్ అధ్యక్షుడితో ఫోన్ సంభాషణలో ఈ సూచన చేయబోవడంలేదని ట్రంప్ చెప్పారు. చూసేందుకు జనాలు లేకుండా నిర్వహించేకంటే వాయిదా వేయడం మంచిదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే.. ఐఒసిగానీ, నిర్వాహక కమిటీ గానీ వాయిదా ప్రతిపాదనను పరిశీలించడంలేదని జపాన్ ఒలింపిక్స్ మంత్రి సీకో హషిమోటో చెప్పారు.
2020-03-12 Read More‘కరోనా వైరస్’ భయంతో ఫార్ములా వన్ ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ రద్దయింది. మెల్ బోర్న్ నగరంలో జరగాల్సిన ‘సీజన్ ఓపెనర్’ను రద్దు చేయాలని నిర్వాహకులు, ఫార్ములా వన్, ఎఫ్ఐఎ ప్రతినిధులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. మొదటి ప్రాక్టీస్ సెషన్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఈ నిర్ణయం వెలువడింది. మెక్ లారెన్ రేసింగ్ బృందం సభ్యుడికి ‘కరోనా’ సోకినట్టు నిన్న నిర్ధారణ అయింది. దీంతో ఆ టీమ్ పోటీ నుంచి వైదొలగింది. చూసేవారితో సహా అందరి ఆరోగ్యానికే తమ మొదటి ప్రాధాన్యత అని నిర్వాహకులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
2020-03-13ఉన్నావ్ రేప్ నిందితుడు, బిజెపి బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. బాధితురాలి తండ్రిని హత్య చేసిన కేసులో న్యాయస్థానం ఈ శిక్షను విధించింది. యూపీ ఎమ్మెల్యే 2017లో ఓ మహిళపై అత్యాచారం చేశాడు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేయలేదు. బిజెపి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా బాధితురాలి కుటుంబాన్నే నిర్మూలించడానికి ప్రయత్నించాడు. ఈ నేరాలు దేశం దృష్టిని ఆకర్షించాక.. 2019 ఆగస్టులో బిజెపి అతన్ని బహిష్కరించింది. శుక్రవారం తీర్పు వెలువరించిన జడ్జి ‘శక్తివంతుడిపై పోరాడినందుకు అభినందనలు’ తెలిపారు.
2020-03-13నిన్న 2,919 పాయింట్ల పతనం తర్వాత శుక్రవారం (మార్చి 13) మార్కెట్ ప్రారంభంలో భారీ ప్రకంపనలు నమోదయ్యాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 30 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఉదయం 10.10 గంటల సమయంలో 29,194.97 పాయింట్లకు దిగజారింది. 3434.58 పాయింట్లు (10.48 శాతం) దిగజారడంతో ట్రేడింగ్ నిలిపివేశారు. 10 శాతం పైగా పతనమైతే వాణిజ్యం నిలిపివేయాలన్న నిబంధన శుక్రవారం అక్కరకు వచ్చింది. 45 నిమిషాల విరామం తర్వాత ట్రేడింగ్ తిరిగి ప్రారంభం కాగా, సెన్సెక్స్ కోలుకుంది.
2020-03-13 Read Moreరాష్ట్రాల్లో శాసన మండళ్లపై జాతీయ విధానాన్ని రూపొందించే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకసారి మండలి ఏర్పాటయ్యాక తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రద్దు చేయకుండా జాతీయ విధానాన్ని కేంద్రం రూపొందిస్తుందా? అని టీడీపీ సభ్యుడు రవీంద్ర కుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ సమాధానమిచ్చింది. శాసన మండలి ఉన్న రాష్ట్రంలో రద్దుకోసం గానీ, లేని రాష్ట్రంలో ఏర్పాటుకు గానీ.. 2/3 మెజారిటీతో అసెంబ్లీ తీర్మానం (ఓటింగ్ ద్వారా) చేస్తే, పార్లమెంటు చట్టం ద్వారా అందుకు వీలు కల్పించవచ్చని న్యాయ శాఖ పేర్కొంది.
2020-03-13