భారత రాజకీయ దిగ్గజాల్లో ఒకరైన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్ను మూశారు. ప్రణబ్ ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో కొద్ది రోజులుగా కోమాలో ఉన్నారు. మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించిన డాక్టర్లు ఆగస్టు 10న అత్యవసర సర్జరీ నిర్వహించారు. అదే రోజు ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ప్రణబ్ వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఆగస్టు 19న ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరడంతో ఆరోగ్యం మరింత విషమించింది. ప్రణబ్ ఐదు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఇందిరాగాంధీ నుంచి మన్మోహన్ సింగ్ వరకు అనేక మంత్రివర్గాల్లో పని చేశారు. మోదీ ప్రభుత్వం ఆయనను ‘భారత రత్న’తో గౌరవించింది.
2020-08-31భారత ఆర్థిక వ్యవస్థలో చీకటి అధ్యాయమిది. 2020-21 తొలి త్రైమాసికం (ఏప్రిల్ - జూన్)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అసాధారణ స్తాయిలో 23.9 శాతం దిగజారింది. గత ఏడాది ఇదే కాలానికి జీడీపీ రూ. 35.35 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది 26.90 లక్షల కోట్లకు పడిపోయింది. భారత ప్రభుత్వ జాతీయ గణాంకాల కార్యాలయం సోమవారం అధికారిక సమాచారాన్ని విడుదల చేసింది. 1980 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమించడం ఇదే తొలిసారి. అసలే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ‘కరోనా’తో కకావికలమైనట్లు ఈ డేటా స్పష్టం చేస్తోంది.
2020-08-31కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పైన సత్వర విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, చివరికి ఒక్క రూపాయి జరిమానా విధించింది. ఆ రూపాయిని చెల్లించడానికి సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఆ రూపాయిని చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష, మూడేళ్ల పాటు లా ప్రాక్టీసుపై నిషేధం అమలవుతాయని తీర్పు చెప్పింది. ప్రశాంత్ భూషణ్ చేసిన రెండు ట్వీట్లు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేలా ఉన్నాయంటూ స్యూమోటో కేసుతో దోషిగా నిర్ధారించింది సుప్రీంకోర్టు. క్షమాపణ చెప్పడానికి భూషణ్ ససేమిరా అనడంతో, సోమవారం ‘రూపాయి’ తీర్పు ఇచ్చింది.
2020-08-31కొద్ది రోజుల క్రితం ‘కరోనా’ బారిన పడి తర్వాత కోలుకున్న అమిత్ షా మళ్ళీ అస్వస్థతకు గురై మంగళవారం ‘ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’లో చేరారు. 3-4 రోజులుగా ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన అలసట ఉన్నట్లు హోంమంత్రి అమిత్ షా చెప్పారని ఎయిమ్స్ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆయనకు ‘కరోనా’ నెగెటివ్ వచ్చిందని, కోవిడ్ అనంతర వైద్య సేవలకోసం ఆయన ఆసుపత్రిలో చేరారని తెలిపారు. షా ఆరోగ్యంగానే ఉన్నారని, ఆసుపత్రి నుంచి ఆయన విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు.
2020-08-18 Read Moreజడ్జిల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలతో దాఖలైన పిటిషన్ పైన హైకోర్టు స్పందించింది. ఈ అంశంపై ఆగస్టు 19 లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన హైకోర్టు... సర్వీసు ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. ఆధారాలు సమర్పించాలని పిటిషనర్ ను కూడా కోర్టు ఆదేశించింది. జడ్జిలపై నిఘాకు ఓ పోలీసు అధికారిని ప్రత్యేకంగా నియమించారని కూడా పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే, ఇదంతా ఓ పత్రికలో వచ్చిన కథనమేనని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. దీనికి న్యాయమూర్తులు ‘దర్యాప్తు జరిపితే నిజం తేలుతుంది కదా’ అని ప్రశ్నించారు.
2020-08-18దేశంలో ‘కరోనా’కు బలైనవారి సంఖ్య 50,000 దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 50,921. ఆదివారం ఒక్క రోజే 941 మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 20,037 మంది కరోనా కాటుకు బలి కాగా, తమిళనాడు 5,766 మరణాలతో రెండో స్థానంలో ఉంది. మృతుల సంఖ్య ఢిల్లీలో 4,196, కర్నాటకలో 3,947, గుజరాత్ లో 2,785, ఆంధ్రలో 2,650, యూపీలో 2,449, పశ్చిమ బంగాలో 2,428. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వ్యక్తులు 26,47,663 మంది. ఆదివారం ఒక్క రోజే 57,584 మంది ఈ జాబితాలో చేరారు. ఇవి అధికారికంగా గుర్తించిన సంఖ్యలు మాత్రమే.
2020-08-17కరోనా ప్రభావంతో జపాన్ ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి తిరోగమించింది. ఈ ఏడాది ఏప్రిల్- జూన్ కాలానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్రితం త్రైమాసికంతో పోలిస్తే 7.8 శాతం తగ్గినట్లు జపాన్ కేబినెట్ ఆఫీసు ప్రకటించింది. వార్షిక రేటుకు అన్వయిస్తే ఈ పతనం 27.8 శాతంగా ఉంది. ఆధునిక జపాన్ ఆర్థిక వ్యవస్థలో పోల్చదగిన డేటా అందుబాటులోకి వచ్చాక (1980 తర్వాత) ఇదే అత్యధిక పతనం. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటి కంటే కరోనా దెబ్బకే జపాన్ ఎక్కువగా కుంచించుకుపోయింది. దేశీయ డిమాండ్ 4.8 శాతం పడిపోగా ఎగుమతులు 18.5 శాతం తగ్గాయి. దిగుమతుల తగ్గుదల మాత్రం 0.5 శాతానికి పరిమితమైంది. మార్చితో ముగిసిన ఏడాదికి జపాన్ జీడీపీ పెరుగుదల ‘జీరో’ (0.00) శ
2020-08-17అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ‘కరోనా’ బారిన పడ్డారు. బుధవారం మధురలో పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. గత వారం రామ మందిరానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో దాస్ ప్రధాని నరేంద్ర మోదీతో కలసి పాల్గొన్నారు. దాస్ జ్వరం, శ్వాస సమస్యతో బాధపడుతుండటంతో ‘కరోనా’ పరీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జ్వరం తగ్గుముఖం పట్టిందని, అయినా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మహంత్ ను గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రికి తరలించామని జిల్లా కలెక్టర్ సర్వగ్య రామ్ మిశ్రా చెప్పారు.
2020-08-13లెబనాన్ రాజధాని బీరుట్ పోర్టులో సంభవించిన పేలుడు హిరోషిమా, నాగసాకి అణు విధ్వంసాన్ని గుర్తు చేసింది. అణుబాంబు పేలినప్పుడు వ్యాపించే పుట్టగొడుగు ఆకారపు మేఘాలు బీరుట్ పోర్టును కమ్మేయడం ఇందుకు కారణం. అయితే, ఈ భయంకరమైన పేలుడుకు కారణం అమ్మోనియం నైట్రేట్ రసాయనం అని లెబనాన్ ప్రధానమంత్రి హస్సన్ దియాబ్ చెప్పారు. ఎరువుల్లోనూ, పేలుడు పదార్ధాల తయారీకి కూడా దీన్ని వినియోగిస్తారు. పోర్టులోని ఒక గోదాములో నిల్వ ఉంచిన రసాయనం భారీ విధ్వంసానికి కారణం కాగా, స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్ధాలు కూడా పోర్టులోని గోదాములో ఉంచినట్టు చెబుతున్నారు. పేలుడుకు మూల కారణం తెలియాల్సి ఉంది.
2020-08-05లెబనాన్ రాజధాని బీరుట్ లోని పోర్టులో మంగళవారం భయంకరమైన పేలుళ్లు సంభవించాయి. మొదట ఓ భారీ పేలుడు... తర్వాత కొద్దిసేపట్లోనే అతి భారీ పేలుడు సంభవించి పోర్టును దాదాపు ధ్వంసం చేశాయి. ఓ చిన్న సైజు అణు బాంబు పేలిందా? అన్నట్టుగా ఆ దృశ్యం కనిపించింది. పుట్టగొడుగు ఆకారంలో నారింజ రంగు మంట, పొగ ఆకాశంవైపు ఎగిశాయి. పోర్టు సమీప భవనాలు ధ్వంసం కాగా 15 కిలోమీటర్ల దూరంలోని భవనాల్లో కూడా అద్దాలు బద్దలయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ పేలుళ్ళలో 73 మంది చనిపోగా సుమారు 3700 మంది గాయపడ్డారు.
2020-08-05