మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న ఢిల్లీ రాష్ట్రానికి 2020 కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు అమాంతం పెరిగాయి. శాసనసభలతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్ఛేరిలకు కలిపి రూ. 47,408 కోట్లు కేటాయింపుల్లో చూపారు. 2018-19లో ఈ రెండు రాష్ట్రాలకు కలిపి రూ. 7,955 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఈ మొత్తం రూ. 28,419 కోట్లకు పెరుగుతుందని సవరించిన అంచనాల్లో కేంద్రం పేర్కొంది.
2020-02-01ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్) పథకానికి 2020-21 బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం రూ. 75,000 కోట్లు కేటాయించింది. ప్రస్తుత సంవత్సరం బడ్జెట్లో అంతే మొత్తాన్ని కేటాయించిన ప్రభుత్వం, వ్యయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేసింది. వ్యయం మొత్తం రూ. 54,370 కోట్లు ఉండొచ్చని సవరించిన అంచనాల్లో పేర్కొంది. అయితే, వాస్తవంలో ఇంతకంటే తక్కువ ఉండొచ్చు. సుమారు 48 శాతం మంది రైతులకు ఒక్క కిస్తీ (రూ. 2000) కూడా చెల్లించలేదని వార్తలు వచ్చాయి.
2020-02-012020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యయం రూ. 30,42,230 కోట్లు ఉంటుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. అందులో రూ. 20,20,926 కోట్లు పన్నులు, పన్నేతర ఆదాయం రూపంలో వస్తుందని కేంద్రం ఆశిస్తోంది. మిగిలిన రూ. 10,21,304 కోట్లలో రూ. 7,96,337 కోట్ల మేరకు అప్పులు, ఇతర రుణ రూపాల్లో రాబట్టుకోవలసి ఉంది. రుణాల రికవరీ ద్వారా రూ. 14,967 కోట్లు వస్తాయని, ఇతర రశీదులు మరో రూ. 2,10,000 కోట్లు ఉంటాయిని కేంద్రం ఆశాభావం.
2020-02-012020-21 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రశీదుల రూపంలో రూ. 20,20,926 కోట్లు వస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అందులో పన్నుల ఆదాయం రూ. 16,35,909 కోట్లు. 2019-20 బడ్జెట్ సమయంలో ఇంతకంటే ఎక్కువగా (రూ. 16,95,582 కోట్లు) అంచనా వేసి.. సవరించిన అంచనాల్లో రూ. 15,04,587 కోట్లకు తగ్గించారు. పన్నేతర ఆదాయాన్ని మాత్రం మరింత పెంచి (రూ. 3,45,514 కోట్లు) చూపించారు. వచ్చే ఏడాది పన్నేతర ఆదాయం మరింత పెరుగుతుందని (రూ. 3,85,017 కోట్లు) అంచనా.
2020-02-01ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కార్పొరేట్ పన్నును తగ్గించిన ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి మద్యతరగతి వర్గాల పన్నుల్లో కొద్దిపాటి మార్పులు చేసింది. కొత్త పన్నులివి. * రూ. 5 లక్షల నుంచి రూ. 7.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను 10 శాతం. * రూ. 7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం. * రూ. 10 లక్షల నుంచి రూ. 12.5 లక్షల వరకు ఆదాయంపై 20 శాతం (గతంలో 30 శాతం). * రూ. 12.5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం (గతంలో 30 శాతం).
2020-02-01అతి పెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్.ఐ.సి)లో కొంత వాటాను అమ్మనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఎల్.ఐ.సి.ని స్టాక్ ఎక్సేంజీలలో నమోదు చేసి ఐపిఒ ద్వారా వాటాల అమ్మకాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. శనివారం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆమె ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద సంస్థల్లో ఒకటి ఎల్.ఐ.సి. జీవిత బీమా రంగంలో దిగ్గజ సంస్థ.
2020-02-01విద్యా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, వాణిజ్య రుణాలు (ఇసిబి) ఆకట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం కేంద్ర బడ్జెట్ 2020ను ఆమె పార్లమెంటులో ప్రవేశపెట్టారు. త్వరలో కొత్త విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆమె తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల్లో యువ ఇంజనీర్లకు ఏడాది పాటు ఇంటర్న్ షిప్ కల్పించే అంశం ఆ విధానంలో ఉంటుందని పేర్కొన్నారు.
2020-02-01*వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.60 లక్షల కోట్లు, *గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్ కు రూ. 1.23 లక్షల కోట్లు, *విద్యకు రూ. 99,300 కోట్లు, *ఆరోగ్య రంగానికి రూ. 69,000 కోట్లు, *స్వచ్ఛ భారత్ కు రూ. 12,300 కోట్లు, *నైపుణ్య శిక్షణకు రూ. 3000 కోట్లు, *ఎస్సీల సంక్షేమానికి రూ. 85,000 కోట్లు, *ఎస్టీలకు 53,700 కోట్లు, *మహిళలకోసం రూ. 28,600 కోట్లు, *సీనియర్ సిటిజన్లకు రూ. 9,500 కోట్లు, *పరిశ్రమలకు రూ. 27,000 కోట్లు, * ఇంథన, పునరుత్పాదక ఇంథన రంగాలకు రూ. 22 వేల కోట్లు.
2020-02-01భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ఇండ్ శాట్ (IND-SAT) పరీక్షను నిర్వహించనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. శనివారం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆమె ‘‘స్టడీ ఇన్ ఇండియా’’ పథకాన్ని ప్రతిపాదించారు. ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా దేశాల విద్యార్ధులకోసం ఈ పథకం ప్రతిపాదించారు. ఇండియాలో టాప్ 100 ఉన్నత విద్యా సంస్థల ద్వారా పూర్తి స్థాయి డిగ్రీ ఆన్ లైన్ విద్యా కార్యక్రమాలకు అనుమతి ఇస్తామని నిర్మల చెప్పారు.
2020-02-012018-19, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా తగ్గించింది. జాతీయ గణాంకాల సంస్థ శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం... 2018-19 జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతం కాదు. 6.1 శాతం మాత్రమే! 2017-18లో 7.2 శాతం వృద్ధి నమోదైనట్లు ఇంతకు ముందు చెప్పగా ఇప్పుడా అంచనాను 7.0కు తగ్గించారు. ఆయా సంవత్సరాల్లో స్థిర ధరల ప్రకారం జీడీపీ వరుసగా రూ. 139.81 లక్షల కోట్లు, రూ. 131.75 లక్షల కోట్లు.
2020-01-31 Read More