మూడు నెలల క్రితం చంద్రుడిపై కూలిన విక్రమ్ ల్యాండర్ శిథిలాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) గుర్తించింది. విక్రమ్ కూలిన ప్రదేశాన్ని, చెల్లాచెదరుగా పడిన శిథిలాలను గుర్తిస్తూ ఒక ఫొటోను విడుదల చేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సెప్టెంబరులో ప్రయోగించిన చంద్రయాన్2లో భాగంగా ‘విక్రమ్’ చంద్రుడిపై దిగవలసి ఉండగా, చివరి నిమిషాల్లో కూలిపోయింది. నాసా సెప్టెంబరు మాసంలో విడుదల చేసిన చిత్రాన్ని పరీక్షించి భారత కంప్యూటర్ ఇంజనీర్ షణ్ముగ సుబ్రమణియన్ ఒక శిథిలాన్ని గుర్తించారు. అదే ఇప్పుడు కీలకమైంది.
2019-12-03ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 23వరకు జరుగుతాయి. ద్వితీయ భాష పేపర్-1 తో మొదలై జాగ్రఫీ పేపర్-2తో పరీక్షలు ముగుస్తాయి. ఒకేషనల్ విద్యార్ధులకు కూడా ఇవే రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. నైతిక విలువలు, మానవీయ విలువలు వంటి అదనపు సబ్జెక్టులకు జనవరి 28, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు జరుగుతాయి.
2019-12-02అనేకానేక మలుపుల తర్వాత మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా తొలిసారి థాకరేల కుటుంబం నుంచి ఉద్ధవ్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి), కాంగ్రెస్ మద్ధతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఒప్పందం ప్రకారం ఎన్.సి.పి. నుంచి డిప్యూటీ సిఎం, కాంగ్రెస్ నుంచి స్పీకర్ ఉంటారు. ప్రస్తుతానికి ఉద్ధవ్ థాకరేతోపాటు జయంత్ పాటిల్, చగన్ భుజబల్ (ఎన్.సి.పి), బాలాసాహెబ్ థొరాట్, నితిన్ రౌత్ (కాంగ్రెస్), ఏకనాథ్ షిండే, సుభాష్ దేశాయ్ (శివసేన) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
2019-11-28అధికారం దక్కించుకోవడానికి బీజేపీ ఏమైనా చేస్తుందని మరోసారి రుజువైంది. మహారాష్ట్రలో అనూహ్యంగా శనివారం ఉదయాన్నే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందుకు వీలుగా రాష్ట్రపతి పరిపాలను ఎత్తివేస్తూ వేకువ జామున 5.47 గంటలకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుపై నిన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ చర్చలు జరపగా... రాత్రికి రాత్రి బీజేపీకి గవర్నర్ అవకాశం ఇవ్వడం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఆయన డిప్యూటీగా ప్రమాణం చేయడం ఆశ్చర్యకరం.
2019-11-23శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సిఎం అవుతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే మరాఠా రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. శనివారం ఉదయాన్నే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాత్రికి రాత్రే రాజకీయం మారిపోగా... గవర్నర్ నేరుగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.
2019-11-23శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్పారు. శుక్రవారం ముంబయిలోని నెహ్రూ సైన్స్ సెంటరులో కాంగ్రెస్ సహా మూడు పార్టీల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఆయనీ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేన, ఎన్సీపీ పంచుకుంటాయన్న ఊహాగానాలకు పవార్ తెర దించారు. ఐదేళ్లూ థాకరేనే ముఖ్యమంత్రి అని చెప్పారు. అయితే, కనీస ఉమ్మడి కార్యక్రమంలోని కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం రాలేదని తెలిసింది.
2019-11-22కేరళలోని 5 ప్రధాన నగరాల్లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి అబుదాబి ఇన్వెస్ట్ మెంట్ అధారిటీ (ఎదిఐఎ) ఆసక్తి చూపిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. కొచ్చి మెట్రో బ్లిస్ సిటీలో రూ. 1500 కోట్లు, మారిటైమ్ క్లస్టర్ లో రూ. 3500 కోట్లు, కన్నూరు ఏరోట్రోపోలిస్ లో రూ. 1000 కోట్లు, లాజిస్టిక్స్ పార్కులో రూ. 400 కోట్లు మేరకు పెట్టుబడి ప్రతిపాదనలపై జనవరినాటికి నిర్ణయం తీసుకోనున్నట్టు ఐడిఐఎ తెలిపిందని విజయన్ శుక్రవారం పేర్కొన్నారు.
2019-11-22తమ ఎంపీలు ఒక్కరు కూడా పార్టీ మారబోరని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉద్ఘాటించారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు మాథ్యమం విషయంలో ముఖ్యమంత్రి జగన్ వైఖరికి భిన్నంగా పార్లమెంటులోనూ, వెలుపలా రఘురామకృష్ణంరాజు మాట్లాడటం కలకలం రేపిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే తనకు పరిచయం ఉందని వివరణ ఇచ్చారు.
2019-11-22తెలంగాణ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోం శాఖ బుధవారం వెల్లడించింది. 1993లొ జర్మనీ వెళ్లిన రమేష్.. తర్వాత ఆ దేశ పౌరసత్వం పొందారు. 2009లో ఇండియా వచ్చి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులు రమేష్ ద్వంద పౌరసత్వంపై న్యాయపోరాటం చేశారు. రమేష్ పౌరసత్వం రద్దుపై కేంద్ర హోం శాఖ 2017లో నిర్ణయం తీసుకోగా, ఆయన సమీక్ష కోరారు. దశాబ్ద కాలపు ఈ వివాదానికి కేంద్రం బుధవారం ముగింపు పలికింది.
2019-11-20కేంద్ర సమాచార శాఖ (హైదరాబాద్) అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఎస్. వెంకటేశ్వర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి వెంకటేశ్వర్, రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫర్ ఇండియా (ఆర్ఎన్ఐ) అదనపు ప్రెస్ రిజిస్ట్రార్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన రీజినల్ ఔట్ రీచ్ బ్యూరోకూ ఆయనే అధిపతి. 30 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటేశ్వర్ కొద్ది నెలల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ కమిషనర్‌గా పని చేశారు.
2019-11-15