దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ జెరూసలేం యాత్రకు అవకాశం కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ భాషా చెప్పారు. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. అర్హత ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 100 మందితో కూడిన జెరూసలెం యాత్రికుల తొలి బృందానికి గురువారం జండా ఊపి ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు.
2019-12-05మార్కెట్ అంచనాలకు భిన్నంగా భారతీయ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచింది. రెపో రేటు 5.15 శాతం, రివర్స్ రెపో రేటు 4.9 శాతం వద్ద కొనసాగనున్నాయి. రెపో రేటు అంటే... వాణిజ్య బ్యాంకుల వద్ద నగదు తక్కువైనప్పుడు రిజర్వు బ్యాంకు ఇచ్చే నిధులపై వడ్డీ. గత సంవత్సర కాలంగా పలుమార్లు వడ్డీ రేట్లను తగ్గించినా... జీడీపీ వృద్ధి రేటు పడిపోతూనే ఉంది. దీంతో మరోసారి వడ్డీ రేట్లు తగ్గుతాయని అంతా అంచనా వేశారు. అయితే, ఇటీవల ద్రవ్యోల్భణం 4.62 శాతానికి పెరగడాన్ని రిజర్వు బ్యాంకు పరిగణించింది.
2019-12-052019-20 ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి తగ్గనుందని సాక్షాత్తు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) అంచనా వేసింది. ఈమేరకు గతంలో తానే వేసిన అంచనా (6.1 శాతం)ను తగ్గించింది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5 శాతానికి, రెండో త్రైమాసికంలో 4.5 శాతానికి వృద్ధి రేటు పడిపోయిన నేపథ్యంలో... గురువారం రిజర్వు బ్యాంకు తాజా అంచనాలను విడుదల చేసింది.
2019-12-05పెరల్ హార్బర్ లోని అమెరికా సైనిక కేంద్రంలో ఒక నావికుడు రక్షణ శాఖ సివిల్ ఉద్యోగులపై కాల్పులు జరిపి తానూ కాల్చుకున్నాడు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో కాల్పులు జరిపిన సైనికుడితోపాటు ముగ్గురు చనిపోయారు. మరొక బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాల్పుల తర్వాత హార్బర్ నౌకా కేంద్రాన్ని మూసివేశారు. పెరల్ హార్బర్ పై జపాన్ దాడి చేసి ఈ నెల 7వ తేదీకి 78 సంవత్సరాలు అవుతోంది. సరిగ్గా మూడు రోజుల ముందు ఈ ఘటన జరగడం కలకలం రేపింది.
2019-12-05అమెరికా నౌకాదళానికి చెందిన ఆరు యుద్ధ విమానాలు అదృశ్యం కావడం చరిత్రలోనే అరుదైన మిస్టరీగా మిగిలిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సరం 1945 డిసెంబర్ 5న చోటు చేసుకున్న ఈ ఉదంతంతో ‘బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ’ ఓ జానపద గాథగా మారింది. ఫ్లోరిడాలోని అమెరికా నేవీ ఎయిర్ స్టేషన్ నుంచి ఫ్లైట్-19 సహా ఐదు టోర్పెడో బాంబర్లు ఆ రోజు మధ్యాహ్నం 2.10కి బయలుదేరి వెళ్లి తిరిగి రాలేదు. వాటిని వెతకడానికి వెళ్లిన మెరైనర్ విమానమూ అదృశ్యమైంది. ఆరు విమానాలు, 27 మంది సైనికుల జాడ కూడా తెలియలేదు.
2019-12-05 Read Moreహాలీవుడ్ సూపర్ హీరో చిత్రాల పరంపరలోని ‘‘బ్లాక్ విడో’’ టీజర్ తాజాగా విడుదలైంది. హాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ ప్రధాన పాత్రలో నటించారు. మార్వెల్ కామిక్స్ కేరక్టర్ ఆధారంగా మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం 2020 మే1న విడుదల కానుంది. ఈ చిత్ర నిర్మాణ ప్రయత్నాలు 2004లోనే మొదలైనా ముందుకు సాగలేదు. తర్వాత ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా వంటి చిత్రాలు వచ్చాయి. 2019 మే, అక్టోబర్ మాసాల మధ్య నార్వే, బుడాపెస్ట్, మొరాకో, ఇంగ్లండ్ లోని పైన్ వుడ్ స్టూడియో, జార్జియాలలో చిత్రీకరణ సాగింది.
2019-12-02జేమ్స్ బాండ్ 007 చిత్రాల పరంపరలో 25వది వచ్చే ఏడాది ఏప్రిల్ 8న ధియేటర్లకు రానుంది. ‘మరణానికి సమయం లేదు (నో టైమ్ టు డై) పేరిట రూపొందిన తాజా చిత్రం ట్రైలర్ బుధవారం విదుదలైంది. ఈ చిత్రంలోనూ డేనియల్ క్రెగ్ 007గా నటించారు. గూఢచార సర్వీసును వదిలేసి జమైకాలో ఆహ్లాదంగా గడుపుతున్న బాండ్, పాత సిఐఎ మిత్రుడు సాయం కోరడంతో సరికొత్త ఆపరేషన్ లోకి దిగడమే ఈ చిత్ర కథాంశం. అధునాతన, ప్రమాదకర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా చేసుకున్న రహస్య శత్రువును హీరో ఎలా జయించాడో తెరపై చూడాలి.
2019-12-04పౌరసత్వ (సవరణ) బిల్లు 2019కి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే ప్రధాన ఉద్ధేశంతో కేంద్రం 1955 పౌరసత్వ చట్టానికి సవరణలు తలపెట్టింది. అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు ఈ బిల్లు వర్తించదు. ఆయా ప్రాంతాలకు రాజ్యాంగంలోని 6వ షెడ్యూలు భద్రత ఉంది. డిసెంబర్ 9న పౌరసత్వ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
2019-12-04భారీ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని తెలంగాణ మంత్రి కె. తారకరామారావు విమర్శించారు. బుల్లెట్ ట్రైన్, ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను ప్రస్తావించిన కేటీఆర్... దక్షిణ భారతంలో నగరాలు లేవా? అని నిలదీశారు. బుధవారం హైదరాబాద్ నగరంలోని శిల్పకళా వేదికలో జరిగిన టి.ఎస్.పాస్ ఐదో వార్షికోత్సవంలో కేటీఆర్ ప్రసంగించారు. పని చేస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రోత్సాహం లేదని ఆయన విమర్శించారు. దక్షిణాదికి రావలసిన ప్రాజెక్టులను పెండింగ్ లో పెడుతున్నారని ఆక్షేపించారు.
2019-12-04 Read Moreకేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం బుధవారం తీహార్ జైలునుంచి బెయిలుపై విడుదలయ్యారు. చిదంబరంపైన సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ‘‘నేను కేసుపై మాట్లాడలేను. కోర్టు ఆదేశాలను పాటిస్తాను. కానీ, నిజం ఏమిటంటే... 106 రోజుల నిర్భంధం తర్వాత కూడా నాపై ఒక్క నేరారోపణా లేదు’’ అని చిదంబరం తీహార్ జైలు వద్ద మీడియాతో వ్యాఖ్యానించారు. జైలునుంచి విడుదలైన చిదంబరానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా నివాసానికి వెళ్ళారు.
2019-12-04 Read More