కరోనా వైరస్ వ్యాప్తి మరింత వేగం పంజుకుంది. మంగళవారం ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా 75 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం కరోనా కేసుల సంఖ్య 8,57,957కు పెరిగింది. సోమవారం వరకు (అమెరికా కాలమానం ప్రకారం) నమోదైన కేసులు 7,82,400. అమెరికా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. కరోనా సోకినవారి సంఖ్య అమెరికాలో 1,88,547కు, ఇటలీలో 1,05,792కు, స్పెయిన్ లో 95,923కు పెరిగింది. జర్మనీ (71,808 కేసులు) త్వరలో చైనా (82,290)ను మించిపోనుంది. ఫ్రాన్స్ లో కూడా వైరస్ సోకినవారి సంఖ్య 50 వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 75 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.
2020-04-01ఢిల్లీ నిజాముద్దీన్ ‘మర్కజ్’లో ‘తబ్లిఘి జమాత్’ నిర్వహించిన మత సమ్మేళనం ‘కరోనా’ వ్యాప్తికి ఒకానొక కేంద్ర బిందువుగా మారడం.. ఇప్పుడు ముస్లిం వ్యతిరేక సంస్థలకు ఆయుధంలా అందివచ్చింది. మంగళవారం సామాజిక మాథ్యమాల్లో.. #coronajihad #biojihad #terrorists హ్యాష్ ట్యాగులతో ముస్లిం వ్యతిరేక ప్రచారం తారాస్థాయికి చేరింది. విదేశాల నుంచి నిజాముద్దీన్ ‘మర్కజ్’కు వచ్చినవారు ఉద్దేశపూర్వకంగానే ‘కరోనా’ను వ్యాపింపజేశారనే ప్రచారం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 8.55 లక్షల మందికి సోకిన ‘కరోనా’ ఇండియాలో వెయ్యిమందిని దాటేసరికి ‘మతం’ రంగు పులుముకుంది! ‘చైనా వైరస్’ రూపు మారింది!!
2020-04-01రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తోటి కరచాలనం చేసిన డాక్టరుకు కరోనా వైరస్ సోకింది. ఈ నెల 24న పుతిన్ కరోనా వైరస్ చికిత్సకు ప్రత్యేకించిన కొమ్ముణర్క ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి చీఫ్ డెనిస్ ప్రొట్సెంకో అధ్యక్షుడికి వివరాలు చెబుతూ సన్నిహితంగా మెలిగారు. కరచాలనం చేశారు. అయితే, అంతా బాగానే ఉందన, అధ్యక్షుడికి తరచూ ‘కరోనా’ పరీక్షలు జరుగుతున్నాయని క్రెమ్లిన్ (రష్యా అధ్యక్ష భవనం) మీడియా కార్యదర్శి డిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. అమెరికా, యూరప్, చైనాలతో పోలిస్తే రష్యాలో చాలా తక్కువ కేసులు (2,337) నమోదయ్యాయి.
2020-04-01 Read More‘కరోనా’ వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా గిలగిలలాడుతోంది. మంగళవారం రాత్రికి అమెరికాలో వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య 1,75,067కు పెరిగింది. ఈ సంఖ్య చైనా కంటే 113 శాతం అధికం. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 21.26 శాతం అమెరికావే! ‘కరోనా’ మరణాల్లోనూ చైనాను మించిపోయింది అమెరికా. చైనాలో ఇప్పటిదాకా 3,309 మంది ఈ వైరస్ వల్ల మరణించగా, అమెరికాలో 3,415 మంది మృత్యువాత పడ్డారు. న్యూయార్క్ నగరంలోనే 914 మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో గత ఆరు రోజుల్లోనే లక్షకు పైగా ప్రజలు ‘కరోనా’ బారిన పడ్డారు. తాజాగా రోజువారీ కేసులు 20 వేలు దాటాయి. మరణాల రేటు కూడా పెరిగి 2 శాతానికి సమీపించింది.
2020-03-31ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో ప్రార్ధనలకు హాజరైనవారితో పాటు వారి బంధువులకూ ‘కరోనా’ వైరస్ సోకినట్టు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. తెలంగాణలో మంగళవారం 15 కొత్త కేసులు నమోదు కాగా, వారంతా మర్కజ్ వెళ్లి వచ్చినవారు, వారి బంధువులేనని ప్రభుత్వ ప్రకటన చెబుతోంది. వీరితో కలిపి తెలంగాణలో ‘కరోనా’ వైరస్ యాక్టివ్ పాజిటివ్ కేసులు 77గా పేర్కొంది. మర్కజ్ వెళ్లి వచ్చిన వారందరూ గాంధీ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవడానికి రావాలని, వైరస్ లక్షణాలు కనిపించిన బంధువులను కూడా తీసుకురావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.
2020-03-31చైనాలో తొలి ‘కరోనా’ కేసు అధికారికంగా నమోదై నేటికి మూడు నెలలు గడిచాయి. 91 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 179 దేశాలకు విస్తరించిన ఈ మహమ్మారి మంగళవారం సాయంత్రానికి 8,03,313 మందికి సోకింది. 39,014 మంది మరణించారు. అత్యధికంగా అమెరికాలో 1,64,719 మందికి వైరస్ సోకగా, అత్యధిక మరణాలు ఇటలీ (11,591), స్పెయిన్ (8,189), చైనా (3,187), అమెరికా (3,173), ఫ్రాన్స్ (3,024), ఇరాన్ (2,898) లలో సంభవించాయి. మరణాల సంఖ్యలో అమెరికా, ఫ్రాన్స్ ఈ రోజు చైనాను అధిగమిస్తున్నాయి. ఖండాలవారీగా చూస్తే యూరప్ తీవ్రంగా ప్రభావితమైంది.
2020-03-31ఢిల్లీ నిజాముద్దీన్ మసీదులో ప్రార్ధనలకు హాజరై వచ్చినవారితో తెలంగాణలో ‘కరోనా’ మరణాలు, ఏపీలో పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. తెలంగాణలో మరణించిన ఆరుగురూ, ఏపీలో మంగళవారం కొత్తగా నమోదైన 17 కేసుల్లో అత్యధికం ఢిల్లీ ప్రార్ధనలకు వెళ్ళినవారే. ఈ సమస్య ఇంతటితో ఆగలేదు. తెలంగాణ లోని 29 జిల్లాల నుంచి 1030 మంది, ఏపీలోని 12 జిల్లాల నుంచి 711 మంది నిజాముద్దీన్ తబ్లిఘి జమాత్ ప్రార్థనా సమావేశాలకు హాజరైనట్టు గుర్తించారు. ఈ నెల13 నుంచి 17 వరకు ఈ రెండు రాష్ట్రాలవారు ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు వారందరినీ ప్రత్యేక వార్డులకు తరలించడమో.. ‘హోం క్వారంటైన్’లో ఉంచి నిఘా పెట్టడమో జరుగుతోంది.
2020-03-31ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో ఈ నెలలో మత సమావేశాలకు హాజరైన 800 మంది ఇండోనేషియన్ మత బోధకులను బ్లాక్ లిస్టులో చేర్చాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. తబ్లిఘి జమాత్ సభ్యులైన వీరంతా టూరిస్టు వీసాలపై ఇండియాకు వచ్చి నిబంధనలను ఉల్లంఘించారన్నది అభియోగం. నిజాముద్దీన్ లోని అలామి మర్కజ్ బంగ్లేవాలి మసీదు కేంద్ర బిందువుగా ‘కరోనా’ వైరస్ వ్యాపించింది. అక్కడ జరిగిన మూడు రోజుల మత సమావేశాలకు ఈ ఇండోనేషియన్లు హాజరయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 8,000 మంది ఆ మసీదులో ప్రార్ధనా సమావేశాలకు హాజరయ్యారని అంచనా.
2020-03-31మ్యాన్మార్ తీవ్రవాద సంస్థ అరాకన్ ఆర్మీ ప్రముఖుడి ఇంటర్వ్యూ ప్రచురించినందుకు ‘వాయిస్ ఆఫ్ మ్యాన్మార్’ ఎడిటర్ ఇన్ చీఫ్ నే మ్యో లిన్ జీవిత ఖైదు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయనపై ‘ఉగ్రవాద’ అభియోగాలు మోపారు. మంగళవారం మాండలే కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఉగ్రవాద సంస్థలు భయాన్ని వ్యాపింపజేయడానికి సహకరించారన్నది ఒక ఆరోపణ. అరాకన్ ఆర్మీ (ఎఎ)ని మ్యాన్మార్ ప్రభుత్వం మార్చి 23న ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ తర్వాత సంస్థ ప్రముఖుడొకరి ఇంటర్వ్యూను మార్చి 27న ‘వాయిస్ ఆఫ్ మ్యాన్మార్’ ప్రచురించింది. లిన్ గతంలో బిబిసి బర్మీస్ న్యూస్ కోసం పని చేశారు.
2020-03-31నిజాముద్దీన్ బస్తీ.. ఇండియాలో ‘కరోనా’ కేసులకు అతిపెద్ద చిరునామాగా మారుతోంది. ఆ బస్తీకి చెందిన 163 మంది ‘కరోనా’ లక్షణాలతో సోమవారం లోక్ నాయక్ ఆసుపత్రిలో చేరారు. మరో 2000 మందికి అధికారులు ‘హోం క్వారంటైన్’ నిబంధనలు విధించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు, వివిధ దేశాలకు చెందిన 1,500 మంది ఇటీవల మర్కజ్ మసీదులో ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సుకు అండమాన్ నికోబార్ దీవులనుంచి వచ్చిన 9 మంది మతబోధకులకు తర్వాత ‘కరోనా పాజిటివ్’ తేలింది. ఒక మత బోధకుడు గత వారం శ్రీనగర్ లో చనిపోయారు. తాజాగా తెలంగాణకు చెందిన ఆరుగురు ‘కరోనా’తో మరణించారు.
2020-03-31