బుధవారం ఉదయమే ఒక షాకింగ్ వార్తతో ఇంగ్లండ్ నిద్ర లేచింది. ఎసెక్స్ పట్టణంలో బుధవారం తెల్లవారుజామున ఒక ట్రక్కు కంటైనర్ లోపల 39 మృతదేహాలను కనుగొన్నారు. అందులో ఒక చిన్నారి కూడా ఉంది. ఈ షాకింగ్ సంఘటనను "సంపూర్ణ విషాదం"గా పోలీసు అధికారి పిప్పా మిల్స్ వ్యాఖ్యానించారు. మరణించినవారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. "బాధితుల గుర్తింపే మా ప్రథమ ప్రాధాన్యతాంశం" అని ఆమె చెప్పారు. ఈ కంటైనర్ బల్గేరియా నుంచి గత శనివారం ఇంగ్లండ్ లోకి ప్రవేశించినట్టు గుర్తించారు.
2019-10-23అవినీతి రహితంగా, అందరితో ఒకే విధంగా ఉంటూ భారత క్రికెట్ జట్టును నడిపించానని, అలాగే ఇప్పుడు బీసీసీఐని కూడా నడిపిస్తానని గంగూలీ స్పష్టం చేశారు. ఈ మాజీ కెప్టెన్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) 39వ అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బిసిసిఐకి ఏది ఉత్తమం అని తాను భావిస్తానో అదే చేస్తానని, విశ్వసనీయత విషయంలో రాజీపడబోనని, అవినీతిని ఏ మాత్రం ఉపేక్షించబోనని గంగూలీ ఉద్ఘాటించారు. నియంత్రణ అనే పదాన్ని తాను ఇష్టపడనని గంగూలీ చెప్పారు.
2019-10-23కెప్టెన్ విరాట్ కోహ్లీకి అన్ని విధాలుగా దన్నుగా నిలుస్తానని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) నూతన అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పారు. భారత క్రికెట్లో కోహ్లీ చాలా ముఖ్యమైన వ్యక్తి అని స్పష్టం చే శారు. బుధవారం బీసీసీఐ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో కొత్తగా నిర్మించిన హైదరాబాద్ వంటి స్టేడియంలు అద్భుతంగా ఉన్నాయంటూ...పాత స్టేడియంలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉందన్నారు.
2019-10-23సమ్మె విరమించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ ఇన్చార్జ్ పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయభాస్కర్ ఆర్టీసీ కార్మికులను కోరారు. సమ్మె 19వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూనే, సమ్మెను ప్రేరేపిస్తున్న యూనియన్ నేతల వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులతో గతంలో తామూ కలసి పని చేశామని, ప్రజలను ఇబ్బంది పెట్టాలన్నది వారి మనస్తత్వం కాదని వినయభాస్కర్ వ్యాఖ్యానించారు.
2019-10-23ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ఆశయాలను కాకుండా జూపల్లి రామేశ్వర్ రావు, చినజీయర్ స్వామి ఆశయాలను కొనసాగిస్తున్నారని టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్ధతుగా బుధవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మందులో సోడా కలిపాడని జగదీశ్వర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్, ప్రజలకు ఏమిచ్చాడని ప్రశ్నించారు. తెలుగుదేశం శాసనసభా పక్ష పార్టీని టీఆర్ఎస్ లో కలిపేసిన ఎర్రబెల్లికి ప్రభుత్వంలో ఆర్టీసీని కలపడం ఎందుకు సాధ్యపడదని ప్రశ్నించారు.
2019-10-23మంచి లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ కంటైనర్ కార్పొరేషన్ అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తప్పు పట్టారు. ప్రధానమంత్రి మోదీ స్నేహితులైన కొందరు అత్యాశాపూరిత ఆశ్రిత పెట్టుబడిదారులు కంటైనర్ కార్పొరేషన్ పట్ల ఆకలితో ఉన్నందునే ప్రభుత్వం అమ్మకానికి ప్లాన్ చేసిందని దుయ్యబట్టారు. మంగళవారం కార్పొరేషన్ యూనియన్ సభ్యులను కలసిన రాహుల్, వారి వినతిపత్రాన్ని షేర్ చేయాల్సిందిగా ట్విట్టర్లో కోరారు.
2019-10-22ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో బెయిల్ కోరుతూ మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతిపై సీబీఐ పెట్టిన కేసులో చిదంబరానికి మంగళవారం సుప్రీంకోర్టు నుంచి బెయిల్ మంజూరైంది. అయితే, ఆయన ఈడీ కేసులో అక్టోబర్ 17 నుంచి కస్టడీలో కొనసాగుతున్నారు. ఈ కేసులో కూడా బెయిలు వస్తేనే చిదంబరం విడుదలవుతారు. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆగస్టు 21న సిబిఐ ఆయనను అరెస్టు చేసింది.
2019-10-23కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం తీహార్ జైలుకు వెళ్ళి అక్కడున్న కర్నాటక నేత డి.కె. శివకుమార్ ను కలిశారు. ఆమెతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఉన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నాయకుడు డి.కె. శివకుమార్, సెప్టెంబర్ 3న అరెస్టయ్యారు. గత 50 రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను అరెస్టు చేసింది. సోనియా గాంధీ తీహార్ జైలుకు వెళ్లడం ఇది రెండోసారి. గత నెలలో ఆమె మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరంను ఇక్కడ కలిశారు.
2019-10-23రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, యనమల రామకృష్ణుడు చెబుతున్నవన్నీ అసత్యాలేనని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ప్రధానంగా ఆర్థిక పరిస్థితి, విద్యుత్ సరఫరాలపై చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. సుమారు రూ. 2.6 లక్షల కోట్ల అప్పులు, పెద్ద మొత్తంలో గ్యారంటీలతో దరిద్రాన్ని రూ. 20 వేల కోట్లు వడ్డీలకు చెల్లించాల్సిన దరిద్రాన్ని వారసత్వంగా ఇచ్చారని బుగ్గన ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు అధికంగా ఉండటాన్నే ఎస్.బి.ఐ. ఎత్తి చూపిందని చెప్పారు.
2019-10-23ఇండియన్ కెనడియన్లలో సిక్కుల ప్రభావం బాగా ఎక్కువ. ఆ దేశ పార్లమెంటు దిగువ సభ(హౌస్ ఆఫ్ కామన్స్)కు తాజాగా తాజాగా జరిగిన ఎన్నికల్లో 18 మంది సిక్కులు ఎన్నికయ్యారు. అదే సమయంలో ఇండియా లోక్ సభలో సిక్కుల సంఖ్య 13. అక్కడ అధికార లిబరల్ పార్టీ నుంచే 13 మంది ఎన్నిక కాగా, కన్సర్వేటివ్ పార్టీ నుంచి నలుగురు, న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి ఒకరు ఎన్నికయ్యారు. మొత్తం 338 సీట్లలో లిబరల్ పార్టీ ఈసారి మెజారిటీ కంటే తక్కువగా 157 సీట్లను మాత్రమే గెలిచింది. ప్రధాని జస్టిన్ ట్రూడూ మైనారిటీ ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తోంది.
2019-10-23