కరోనా మహమ్మారి నుంచి రక్షణకోసం ప్రారంభమైన టీకా కార్యక్రమంలో తొలి రోజు దేశంలో 1.91 లక్షల మందికి తొలి డోస్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీకా కార్యక్రమాన్ని శనివారం ఉదయం ప్రారంభించారు. భారత శాస్త్రవేత్తలు శరవేగంగా టీకాను అందుబాటులోకి తెచ్చారని ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు. టీకాల సమర్ధత, భద్రతపై పుకార్లను నమ్మవద్దని ఆయన ప్రజలకు సూచించారు. టీకాను లాంఛనంగా ప్రారంభించిన వెంటనే ఆరోగ్య కార్యకర్తలకు తొలి డోస్ ఇచ్చారు.
2021-01-16నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన 9వ విడత చర్చలు కూడా విఫలమయ్యాయి. ‘‘120 శాతం విఫలం. నిత్యావసరాల చట్టాన్ని మొత్తంగా రద్దు చేయడానికి బదులు ప్రభుత్వం చేసిన సవరణలు తొలగించాలని సూచించాం. కానీ, వ్యవసాయ మంత్రి దీనిపై ఏమీ బదులివ్వలేదు’’ అని రైతు నేత దర్శన్ పాల్ చర్చల అనంతరం చెప్పారు. తర్వాత దఫా చర్చలు ఈ నెల 19న జరగనున్నాయి. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆ రోజే రైతులతో సంప్రదింపులు ప్రారంభించే అవకాశం ఉంది.
2021-01-15 Read Moreప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారికి బలైనవారి సంఖ్య శుక్రవారానికి 20 లక్షలు దాటింది. అందులో ఇండియా వాటా 7.6 శాతం. ఇండియా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో రెండో స్థానంలోనూ, మరణాల సంఖ్యలో మూడో స్థానంలోనూ నిలిచింది. ప్రపంచం మొత్తంమీద సుమారు 9.34 కోట్ల మందికి వైరస్ సోకితే అందులో నాలుగో వంతు అమెరికన్లే. కేసులలో ఇండియా వాటా 11.27 శాతంగా ఉంది. మృతులలో 39 శాతం అమెరికన్లే కావడం అక్కడ కరోనా సృష్టించిన మారణహోమానికి నిదర్శనం.
2021-01-15కరోనా మహమ్మారి దేశంపై విరుచుకుపడకుండా ఏ దేవుడూ ఆపలేదు. ఆ వర్గం, ఈ వర్ణం అనే తేడా లేకుండా అన్ని సమూహాలకూ వ్యాపించింది. వైరస్ దెబ్బకు అన్ని మతాల దేవాలయాలనూ మూసివేశారు. ఏ దైవదూతా విరుగుడును కనిపెట్టలేదు. వైరస్ సోకినవారిని రక్షించడానికీ, ఇప్పుడు టీకా రూపంలో విరుగుడును తేవడానికి కృషి చేసింది డాక్టర్లు, శాస్త్రవేత్తలు. ఆ కృషిలో ఇంకా అనేక మంది భాగస్వాములు. టీకా పంపిణీ సమయానికి మాత్రం దేవుళ్లు వచ్చేశారు! టీకాల డబ్బాకు హారతులిస్తున్న మహిళామణులను పై ఫొటోలో చూడండి. ఈ అజ్ఞానానికి మందుందా?
2021-01-15దేశంలో కోట్లాది మందిని కరోనా దారిద్య్రంలోకి నెట్టిందనే అధ్యయనాల మధ్య స్టాక్ మార్కెట్ అసాధారణంగా పెరగడం, సెన్సెక్స్ 50,000 పాయింట్లకు చేరువ కావడం ఆశ్చర్యకరమే. దానిపై రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ‘ఇటి నౌ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సరికొత్త హెచ్చరిక చేశారు. సెన్సెక్స్ పెరుగుదలను చూస్తే సమస్యలు సమసిపోయినట్టు ఎవరైనా భావిస్తారని, కానీ అవి ఇప్పుడే ప్రారంభమయ్యాయని రాజన్ వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక వ్యవస్థ కోవిడ్ పూర్వ స్థితికి రావడానికి 2022 చివరి వరకు సమయం పట్టవచ్చని ఆయన అంచనా వేశారు.
2021-01-14 Read Moreఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలకు విదేశీ ప్రభుత్వాధినేత ఎవరూ హాజరు కావడం లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ప్రకటించారు. ముఖ్య అతిధి లేకుండా గణతంత్ర దినోత్సవం (26న) జరగడం 55 ఏళ్లలో ఇదే తొలిసారి కానుంది. తొలుత యుకె ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ను ఆహ్వానించినా, ఆ దేశంలో సరికొత్త రకం కరోనా వైరస్ విజృంభణ, ఢిల్లీలో రైతుల ఆందోళన నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది. తర్వాత భారత సంతతికి చెందిన సురినామ్ అధ్యక్షుడు హాజరవుతారని వార్తలొచ్చినా ఖాయం కాలేదు.
2021-01-14కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఉద్యమించిన రైతులతో చర్చించడానికంటూ సుప్రీంకోర్టు నలుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసిన ఒక్క రోజులోనే అందులో సభ్యుడైన భూపీందర్ సింగ్ మాన్ వైదొలిగారు. తాను కమిటీలో భాగం కాబోనని, పంజాబ్ రాష్ట్ర, దేశ రైతుల ప్రయోజనాలపై రాజీ పడబోనని మాన్ గురువారం ఒక బహిరంగ ప్రకటనలో పేర్కొన్నారు. ఆలిండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ (ఎఐకెసిసి)కి అధ్యక్షుడైన మాన్ (82) కేంద్ర చట్టాలకు అనుకూలుడే. సుప్రీంకోర్టు కమిటీలోని నలుగురు సభ్యులూ చట్టాల సమర్థకులేనని విమర్శలు వెల్లువెత్తాయి.
2021-01-14"కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’’ అనే డైలాగుతో ఒక నిమిషం నిడివిగల వకీల్ సాబ్ టీజర్ గురువారం విడుదలైంది. ఈ సందర్భం కోసం ఎదురు చూస్తున్న అభిమానుల సంక్రాంతి పండుగ ముచ్చట తీర్చేశాడు వకీల్ సాబ్. ప్రభావవంతమైన ప్రారంభం, మూడు ఫైట్ సీన్లతో టీజర్ పవన్ అభిమానులను అలరించే విధంగానే ఉంది. మంచి నేపథ్య సంగీతంతో విడుదలైన టీజర్ ప్రారంభంలో ఇయర్ ఫోన్లు ఉపయోగించాలనే సూచన చేశారు. సామాజిక మాధ్యమాల్లో విడుదలైన కొద్ది సమయంలోనే లక్షలాది వీక్షణలు, షేర్లతో హల్ చేసింది.
2021-01-14జాతిపిత మహాత్మాగాంధీ హంతకుడు నాథురాం గాడ్సేను దేశభక్తుడిగా మరోసారి కీర్తించారు బిజెపి ఎంపి ప్రగ్యా ఠాకూర్. 2008 మాలెగావ్ బాంబు పేలుళ్ళ కేసులో నిందితురాలైన ఈమె 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఓసారి గాడ్సేని దేశభక్తుడిగా అభివర్ణించారు. ఎన్నికల సమయం కావడం వల్ల వివాదాన్ని చల్లార్చడానికి రంగంలోకి దిగిన బిజెపి అధినాయకత్వం, ఆమె చేత క్షమాపణలు చెప్పించింది. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు అప్పట్లో ప్రకటించిన ప్రగ్య తిరిగి అలాంటి వ్యాఖ్యలే ఇప్పుడు చేశారు.
2021-01-13 Read Moreభారత నూతన పార్లమెంటు భవన నిర్మాణాన్ని ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇలాంటి ప్రాజెక్టును ‘మకర సంక్రాంతి’ తర్వాత మొదటి తెల్లవారుజామున ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుందని భావించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈమేరకు కేంద్ర ప్రజా పనుల శాఖ నిర్మాణ సంస్థ ‘టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్’ను కోరింది. దీంతో టాటా సంస్థ నిర్మాణానికి అవసరమైన మెషినరీని సిద్ధం చేసుకుంటోంది. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణం జరగనుంది.
2021-01-13 Read More