ఏపీ ప్రభుత్వం ‘మూడు రాజధానులు’ అంటున్నా.. ఆచరణలో ఒకే రాజధానిని విశాఖపట్నానికి తరలించేలా అసెంబ్లీలో కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ‘‘రాజ్ భవన్, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు.. పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో ఉండాలి’’ అని ఆ బిల్లులో స్పష్టం చేసింది. అంటే.. పరిపాలనా వ్యవస్థలు మొత్తం విశాఖపట్నంలోనే కేంద్రీకృతమై ఉంటాయి. అసెంబ్లీ కేంద్ర స్థానం అమరావతిలో ఉంటుంది. హైకోర్టు ప్రధాన కేంద్రం కర్నూలుకు మార్చేందుకు ప్రయత్నించాల్సి ఉంది.
2020-01-20గత ఆరేళ్లలో 2838 మంది పాకిస్తానీయులకు భారత పౌరసత్వం ఇచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం వెల్లడించారు. ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన 914 మందికి, బంగ్లాదేశీయులు 172 మందికి కూడా పౌరసత్వం ఇచ్చామన్నారు. ఆయా దేశాల నుంచి వచ్చి పౌరసత్వం పొందినవారిలో 566 మంది ముస్లింలు ఉన్నారని తెలిపారు. చెన్నైలో సిఎఎపై జరిగిన సభలో మాట్లాడుతూ 1964, 2008 మధ్య నాలుగు లక్షల మందికి పైగా శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం ఇచ్చారని చెప్పారు.
2020-01-19 Read Moreపౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేరళ ప్రభుత్వం నుంచి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నివేదిక కోరారు. తనకు సమాచారం ఇవ్వకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సిఎఎను ఉపసంహరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిననాటి నుంచే గవర్నర్ గుర్రుగా ఉన్నారు.
2020-01-19 Read Moreచైనాను ఇప్పుడు ‘కరోనా వైరస్’ భయపెడుతోంది. సార్స్ తరహాలో ఉన్న సరికొత్త వైరస్ చైనాలోని ఉహాన్, షెంజెన్ నగరాల్లో 62 మందికి సోకింది. తాజాగా షెంజెన్ నగరంలో భారతీయ స్కూలు టీచర్ ప్రీతి మహేశ్వరికి కొరోనావైరస్ సోకింది. ఈ వైరస్ సోకిన తొలి విదేశీ వ్యక్తి మహేశ్వరి. శుక్రవారం ఆమె అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఈ కొత్త వైరస్ సోకినట్టు డాక్టర్లు తాజాగా నిర్ధారించారు. కాగా, 19 మందికి ఆరోగ్యం కుదుటపడి ఆసుపత్రులనుంచి డిశ్చార్జి అయ్యారు.
2020-01-19ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదవ ఓవర్లో ఆరోన్ ఫించ్ కొట్టిన షాట్ బౌండరీ కాకుండా ఆపడానికి ప్రయత్నించి శిఖర్ ధావన్ గాయపడ్డాడు. బంతికోసం డైవ్ కొట్టినప్పుడు ఎడమ భుజం నేలకు ఢీకొనడంతో ఈ ఓపెనింగ్ బ్యాట్స్ మన్ ఫీల్డింగ్ మైదానం నుంచి తప్పుకొన్నాడు. రెండో వన్డేలో కూడా పాట్ కమ్మిన్స్ వేసిన బౌన్సర్ శిఖర్ ధావన్ ప్రక్కటెముకకు తగలడంతో ఫీల్డింగ్ కు దూరంగా ఉన్నాడు.
2020-01-19హిందు, ముస్లిం, క్రైస్తవ మతాల మధ్య సామరస్యానికి కేరళ ఓ ఉదాహరణ. తాజాగా చేరవల్లి జమాత్ మసీదు ఓ హిందూ వివాహానికి వేదికై మరోసారి ఈ అంశాన్ని చాటింది. వధూ వరులు ఆషా, శరత్ హిందూ సంప్రదాయ పద్ధతుల్లో ఆ మసీదులో వివాహం చేసుకున్నారు. ఆషా తల్లి మసీదు సాయం కోరడంతో స్పందించిన పెద్దలు వివాహం జరిపించారు. వధూవరులకు, కుటుంబాలకు, మసీదు ప్రముఖులకు, చేరవల్లి ప్రజలకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుభాకాంక్షలు తెలిపారు.
2020-01-19ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్లలో వాట్సాప్ కూడా ‘500 కోట్ల క్లబ్’లో చేరింది. గూగుల్ ‘ప్లే స్టోర్’ నుంచి మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ను డౌన్ లోడ్ చేసుకున్న ఫోన్ల సంఖ్య 500 కోట్లకు చేరింది. ఇదివరకే కొన్ని గూగుల్ అప్లికేషన్లతో పాటు ‘ఫేస్ బుక్’, ‘యూ ట్యూబ్’ వంటి అప్లికేషన్లు 500 కోట్ల వినియోగదారులను సాధించాయి. ప్రస్తుత ప్రపంచ జనాభా 750 కోట్లు. కొంతమంది రెండు లేదా మూడు ఫోన్లను వాడతారు. అలా చూసినా సుమారు సగం జనాభా ఈ ‘యాప్’లను వినియోగిస్తుండవచ్చు.
2020-01-19పావురాలకు శాంతి కపోతాలని పేరు.. కానీ, అవే ప్రాణాంతకం కావచ్చంటున్నారు డాక్టర్లు. ముంబైలో ఇద్దరు మహిళల ఊపిరితిత్తులు పనిచేయకపోవడానికి పావురం రెట్టలు ఒక ప్రధాన కారణంగా గుర్తించారు. వారికి ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీ చేయవలసి వచ్చింది. 2012లో కొత్త ఇంటికి మారాక తనకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయని హేమాలి షా అనే మహిళ డాక్టర్లకు చెప్పారు. అక్కడ ఏసీ మెషీన్ ఉన్నచోట పావురాలు రెట్టలు వేయడంతో సమస్య ప్రారంభమైనట్లు గుర్తించారు.
2020-01-19 Read Moreప్రపంచ కుబేరులు, ఆర్థిక వ్యవస్థల వార్షిక సమావేశాలు రేపు స్విట్జర్లాండ్ లోని ‘దావోస్’లో పారంభం కాబోతున్నాయి. ఇవి ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) 50వ వార్షిక సమావేశాలు. జనవరి 21-24 తేదీల్లో జరగనున్న సదస్సుకు ఈ ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ హాజరు కానున్నారు. ఇండియా నుంచి కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, 100 మంది సీఈవోలు హాజరవుతున్నారు.
2020-01-19 Read Moreపార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని ఒక రాష్ట్రం తిరస్కరించే అవకాశం లేదని కాంగ్రెస్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిఎఎ వ్యతిరేక వైఖరి తీసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్య ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రాలు అమలు చేయబోమని అనలేవని, ఒకవేళ అంటే అది రాజ్యాంగ విరుద్ధమని కూడా సిబల్ పేర్కొన్నారు. చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానించవచ్చని, ఉపసంహరణకోసం కేంద్రాన్ని డిమాండ్ చేయవచ్చని పేర్కొన్నారు.
2020-01-18 Read More