లోపభూయిష్టమైనవిగా భావిస్తున్న బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల రాకపోకలను అమెరికా కూడా నిలిపివేసింది. గత ఆదివారం ఇథియోపియా ఎయిర్ లైన్స్ విమానం బోయింగ్ 737 మ్యాక్స్ 8 కూలిపోయి 157 మంది చనిపోయిన నేపథ్యంలో ఇండియా, చైనా సహా అనేక దేశాలు ఆ విమానాల రాకపోకలను నిలిపివేశాయి. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంశంపై ఆదేశాలిచ్చిన కొద్దిసేపటికే ఫెడరల్ ఏవియేషన్ అధారిటీ ప్రకటన వెలువడింది. తమ ఆధారాలు, శాటిలైట్ సమాచారాన్ని క్రోడీకరించాక ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎఫ్ఎఎ తెలిపింది.
2019-03-14 Read Moreజైష్ ఎ మహ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజర్ ను ‘‘ప్రపంచ ఉగ్రవాది’’గా ప్రకటింపజేయాలన్న ఇండియా ప్రయత్నానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బుధవారం అమెరికా, ఫ్రాన్స్, యుకె ఈ అంశంపై చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. మసూద్ పై ఇలాంటి ప్రయత్నాన్ని చైనా వ్యతిరేకించడం గత పదేళ్లలో ఇది నాలుగోసారి. ఇటీవల పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన నేపథ్యంలో అజర్ వ్యవహారం మరోసారి ‘ఐరాస’ ఎజెండాలో చేరింది.
2019-03-14 Read Moreసామాజిక మాథ్యమ వెబ్ సైట్ ఫేస్ బుక్, ఆ యాజమాన్యానికే చెందిన ఇన్ట్సాగ్రామ్ మొరాయించాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్లమందికి ప్రస్తుతం ఆ వెబ్ సైట్లు ఓపెన్ కావడంలేదు. అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఎక్కువమంది ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడిస్తున్నారు. అయితే, ఇండియాతో పాటు పలు ఆసియా దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనూ పలువురికి వెబ్ సైట్ ఓపెన్ కావడంలేదని సమాచారం. #Facebookdown, #instagramdown అనే హ్యాష్ ట్యాగ్ లు ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి.
2019-03-13మాజీ ఎమ్యెల్యే వంగవీటి రాధాకృష్ణ బుధవారంనాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో వంగవీటి రాధ పసుపు కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు చంద్రబాబుకు, రాధకు కలిపి గజమాల వేసి అభినందించారు. ఇదే కార్యక్రమంలో చీరాల వైసీపీ నేత ఎడం బాలాజీ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ నుంచి బాలాజీ ఇటు మారారు.
2019-03-13మరణశిక్షపై మారటోరియం విధిస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వనున్నట్టు అమెరికాలోని కేలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ చెప్పారు. దీంతో ఇప్పటికే మరణశిక్ష పడి జైళ్ళలో ఉన్న 737 మంది ఖైదీలకు ఊరట లభించనుంది. మారటోరియం ఎత్తివేసేవరకు వారికి ఉరి వేయరు. జనవరిలోనే గవర్నర్ అయిన గవిన్, తాను నైతికంగా మరణశిక్షకు వ్యతిరేకినని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో గవిన్ ఇలాంటి చర్యకు హామీ కూడా ఇచ్చారు. కేలిఫోర్నియా జనాభాలోనే కాదు.. మరణశిక్ష పడిన ఖైదీల సంఖ్యలోనూ మొదటి స్థానంలో ఉంది.
2019-03-13 Read More2019 లోక్ సభ ఎన్నికల కోసం దశలవారీగా అభ్యర్ధులను ప్రకటిస్తున్న కాంగ్రెస్ పార్టీ బుధవారం రెండో జాబితాను విడుదల చేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 21 లోక్ సభ సీట్లకు ఈ జాబితాలో అభ్యర్ధులను ప్రకటించారు. ముంబై నార్త్ సెంట్రల్ నుంచి ప్రియాదత్, ముంబై సౌత్ నుంచి మిలింద్ దేవరా, ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నుంచి రాజ్ బబ్బర్ పోటీ చేయనున్నారు.
2019-03-13 Read Moreకర్నాటక సంకీర్ణంలో భాగస్వాములైన కాంగ్రెస్, జెడి (ఎస్) 2019 లోక్ సభ ఎన్నికలకోసం సీట్లు పంచుకున్నాయి. కాంగ్రెస్ 20, జెడి (ఎస్) 8 లోక్ సభ సీట్లలో పోటీ చేయడానికి ఒప్పందం కుదిరింది. బుధవారం కొచ్చిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో జెడి (ఎస్) ప్రధాన కార్యదర్శి డానిష్ ఆలీ సమావేశమయ్యాక ఒప్పందం ఖరారైంది. కాంగ్రెస్ సిటింగ్ సీటైన తుంకూరుతో పాటు హసన్, మాండ్యా, బెంగళూరు ఉత్తరం, ఉడుపి, చికమగళూర్, విజయపుర, ఉత్తర కన్నడ స్థానాల్లో జెడి (ఎస్)కు దక్కాయి. మిగిలిన చోట్ల కాంగ్రెస్ పోటీ చేయనుంది.
2019-03-13 Read Moreబ్రెజిల్ లోని ఓ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఇద్దరు యువకులు జరిపిన కాల్పులలో 9 మంది చనిపోయారు. మరో 17 మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో ఐదుగురు విద్యార్ధులు, ఓ పాఠశాల ఉద్యోగి, మరో పౌరుడు, కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులు ఉన్నారు. పాఠశాల పిల్లలపై కాల్పులు జరిపిన తర్వాత దుండగులు తమను తాము కాల్చుకున్నట్టు సావోపోలో పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు ఇద్దరు యువకులు ముఖాలకు మాస్కులు ధరించి తుపాకులతో పాఠశాల ఆవరణలో ప్రవేశించారు. ఆ పాఠశాలలో 1000 మంది విద్యార్ధులు ఉన్నారు.
2019-03-13 Read Moreతెలుగుదేశం పార్టీ ఎంపీ తోట నరసింహం, ఆయన సతీమణి వాణి బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తోట లోక్ సభలో టీడీపీ పక్ష నేతగా పని చేశారు. పారిశ్రామికవేత్త పొట్లూరు వరప్రసాద్, సినీ నటుడు రాజా రవీంద్ర, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద రెడ్డి కూడా బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొన్నారు.
2019-03-13 Read Moreఆస్ట్రేలియాతో ఐదో (చివరిది) వన్డేలో టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగి ఇప్పటికి 38 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంకా 72 బంతుల్లో 110 పరుగులు సాధించాల్సి ఉంది. ఆస్ట్రేలియా ఓవరాల్ రన్ రేటు 5.44 ఉండగా ఇండియా రన్ రేటు ఇప్పటివరకు 4.28గా నమోదైంది. భారీ స్కోరు ఛేజింగ్ కు అంత అనుకూలం కాని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఇండియా జట్టు ఎదురీదుతున్నట్టే లెక్క. రోహిత్ శర్మ ఒక్కడే అర్ద సెంచరీ దాటాడు.
2019-03-13