శాసన మండలిని పునరుద్ధరించడానికి తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడారో అసెంబ్లీ వేదికగా వీడియో ప్రదర్శించారు ప్రస్తుత సిఎం జగన్. దీనికి బదులుగా చంద్రబాబు సోమవారం రాత్రి మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి... అరడజను అంశాల్లో జగన్ మాట మార్చారంటూ ‘అప్పుడు, ఇప్పుడు’ క్లిప్పింగ్స్ ప్రదర్శించారు. రాజధాని, ప్రత్యేక హోదా, 45 సంవత్సరాలకే పెన్షన్, సన్నబియ్యం వంటి అంశాలు వాటిలో ఉన్నాయి.
2020-01-27‘‘ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను బెదిరించి ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన నువ్వు సచ్చీలుడివా?’’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఒక్కొక్క ఎమ్మెల్సీకి రూ. 5 కోట్ల నుంచి 20 కోట్ల దాకా ఆఫర్ చేశారని, పోతుల సునీతకు వైసీపీ కండువా కప్పారని విమర్శించారు. బీటీ నాయుడు ఇంటిపై దాడి చేశారని, మరో ఎమ్మెల్సీ కోల్డ్ స్టోరేజీని సీజ్ చేశారని చంద్రబాబు ఆక్షేపించారు.
2020-01-27శాసన మండలి రద్దు కాలేదని, రద్దు ప్రతిపాదన మాత్రమే ప్రభుత్వం చేసిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. మండలి రద్దు అధికారం ప్రభుత్వానికి, అసెంబ్లీకి లేదని.. పార్లమెంటు ఆమోదంతో రాష్ట్రపతి మాత్రమే చేయగలరని పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుందని, అప్పటిదాకా ఈ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను అడ్డుకుంటామని యనమల స్పష్టం చేశారు. ‘‘మీ ఆటలు మండలిలో సాగవు’’ అని సిఎంను ఉద్ధేశించి చెప్పారు.
2020-01-27ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి లను మించిన నేత ప్రస్తుత సిఎం జగన్మోహన్ రెడ్డి అని అధికార పార్టీ సభ్యుడు పార్ధసారథి అసెంబ్లీలో ప్రశంసించారు. గతంలో రాష్ట్రానికి కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవ రెడ్డి వంటి మహామహులు ముఖ్యమంత్రులైనా వారెవరూ ప్రజల మనసుల్లో నిలువలేదని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే ప్రజల మనసుల్లో ఉన్నారంటూ.. ఇప్పుడు జగన్ వారిని మించిపోయారని ‘శాసన మండలి రద్దు’పై చర్చ సందర్భంగా చెప్పారు.
2020-01-27ఏపీ శాసన మండలి రద్దు కోరుతూ సిఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర రాజధాని తరలింపు (వికేంద్రీకరణ) బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడంపై మండిపడిన సీఎం, మండలిని రద్దు చేయాలని నిర్ణయించారు. గురువారం ఈ అంశంపై చర్చించిన తర్వాత...సోమవారం నిర్ణయం తీసుకుందామని సిఎం సూచించారు. ఆ మేరకు అసెంబ్లీ సమావేశాలను పొడిగించారు. సోమవారం ఉదయం మంత్రివర్గ ఆమోదంతో ఈ తీర్మానం అసెంబ్లీకి చేరింది.
2020-01-27ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఆదివారం రాత్రి రాకెట్ దాడి జరిగింది. తొలుత ఐదు రాకెట్లు ఎంబసీకి సమీపంలో పడ్డాయని, కొద్దిసేపటికే మరో మూడు క్షిపణులు ’గ్రీన్ జోన్’పైకి వచ్చాయని భద్రతా దళాలు తెలిపాయి. విదేశీ రాయబార కార్యాలయాలు కొలువై ఉన్న ‘గ్రీన్ జోన్’పై ఈ మధ్య రాకెట్ దాడులు జరిగాయి. తమ దేశం నుంచి అమెరికా దళాలు వెళ్ళిపోవాలనే డిమాండుతో ఇరాకీలు శనివారమే బాగ్దాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
2020-01-26దేశ, రాష్ట్ర రాజధానుల్లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ.. అస్సాం పేలుళ్ళతో ఉలిక్కిపడింది. అదివారం ఉదయం సరిగ్గా గణతంత్ర వేడుకలు జరిగే సమయంలోనే... 8.15, 8.25 గంటల మధ్య నాలుగు పేలుళ్ళు జరిగాయి. డిబ్రూగఢ్ జిల్లాలో మూడుచోట్ల, చరైడియో జిల్లాలో ఒకచోట పేలుళ్ళు సంభవించాయి. దులియాజన్ టినియాలి ప్రాంతంలో ఇద్దరు యువకులు మోటారు సైకిల్ పై వచ్చి గ్రెనేడ్ విసిరి పరారైనట్టు సీసీటీవీలో రికార్డైందని ఓ పోలీసు అధికారి చెప్పారు.
2020-01-26రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 70 సంవత్సరాలైంది. 71వ గణతంత్ర దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. యుద్ధ సామర్ధ్యాన్ని ప్రదర్శించింది. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో ముఖ్య అతిధిగా హాజరైన ఈ ఏడాది ఉత్సవాల్లో... ఉపగ్రహాలను కూల్చివేయగల (ASAT) ‘మిషన్ శక్తి’ క్షిపణులను ఇండియా ప్రదర్శించింది. కొత్తగా కొనుగోలు చేసిన చినూక్, అపాచీ అటాక్ హెలికాప్టర్లు వాయుసేన విన్యాసాల్లో భాగం పంచుకున్నాయి.
2020-01-26శాసన మండలిని రద్దు చేస్తామన్నది ముఖ్యమంత్రి బెదిరింపు మాత్రమేనని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చెప్పారు. నిజంగా అలాంటి ఉద్దేశమే ఉంటే... మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలతో ముందుగా రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. పదవులు పోతాయనే భయం టీడీపీ ఎమ్మెల్సీలకు లేదని ఉద్ఘాటించారు.
2020-01-26ఒక్క సంవత్సరం ఆగితే శాసన మండలిలో తమకే మెజారిటీ వస్తుందని, టీడీపీ ఎమ్మెల్సీలను కొనవలసిన అవసరం లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. మండలిని రద్దు చేయడానికి సోమవారం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చన్న అనుమానాల మధ్య సజ్జల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టీడీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో 17 మంది తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా సజ్జల చెప్పుకొచ్చారు.
2020-01-26