ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోమవారం కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరకలేదు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతోపాటు మరో 15 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ఉండటంతో ఈరోజు అమిత్ షా కలవలేకపోయారని చెబుతున్నారు. అయితే, జగన్ సోమవారం రాత్రి ఢిల్లీలో ఉండేందుకు ముందే సిద్ధపడి వెళ్ళారు. మంగళవారం అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన జగన్, ప్రధానమంత్రి మోదీని కలవగలిగారు. కానీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరకలేదు.
2019-10-21హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సోమవారం జరిగిన ఉప ఎన్నికలో సాయంత్రం 5 గంటల సమయానికి 85 శాతం ఓట్లు పోలైనట్టు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ బూత్ క్యూలో ఉన్న అందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్న రీత్యా... పోలింగ్ శాతం పెరగవచ్చు. ఈ నెల 24వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
2019-10-21మహారాష్ట్ర, హర్యానాల్లో అధికార బీజేపీ కూటమి ప్రభుత్వాలకే ప్రజలు పట్టం కట్టినట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఓట్ల తేడా అసాధారణంగా 31 నుంచి 38 శాతం వరకు ఉంటుందని రిపబ్లిక్ టీవీ చెబుతోంది. ఆ టీవీ ప్రకారం... మహారాష్ట్రలో బీజేపీ-శివసేన ద్వయం 57 శాతం ఓట్లతో 216 నుంచి 230 వరకు సీట్లు పొందవచ్చు. కాంగ్రెస్-ఎన్.సి.పి. ద్వయం కేవలం 26 శాతం ఓట్లతో 50 నుంచి 60 సీట్లు గెలవవచ్చు. హర్యానాలో బీజేపీ 56 శాతం ఓట్లతో 52 నుంచి 63 సీట్లను, కాంగ్రెస్ కేవలం 18 శాతం ఓట్లతో 15 నుంచి 19 సీట్లు గెలవవచ్చు.
2019-10-21 Read Moreబొలీవియా ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు ఎవో మొరేల్స్ ఆధిక్యత చాటారు. 83 శాతం బ్యాలెట్లను లెక్కించేసరికి మొరేల్స్ 45 శాతం ఓట్లతో తన ప్రత్యర్ధి కార్లోస్ మీసా (38 శాతం) కంటే ముందున్నారు. అయితే, రెండో రౌండ్ పోటీ తప్పకపోవచ్చని భావిస్తున్నారు. బొలీవియాలో... మొదటి రౌండ్ లో 50 శాతం ఓట్లు లేదా 40 శాతం ఓట్లతో ప్రత్యర్ధిపై 10 పాయింట్ల లీడ్ ఉంటే సరేసరి. లేదంటే ప్రధాన ప్రత్యర్ధులిద్దరూ డిసెంబర్ 15న రెండో రౌండ్ లో తలపడాల్సి ఉంటుంది. దక్షిణ అమెరికాలో ఎక్కువ కాలం పని చేసిన అధ్యక్షుడు మొరేల్స్.
2019-10-21 Read Moreసిరియాను వదిలి వెళ్లిపోతూ అమెరికా దళాలు తమ సొంత వైమానిక స్థావరంపైనే బాంబులు వేశాయి. ఉత్తర సిరియాలో టెల్ టామెర్ పట్టణానికి సమీపంలోని వైమానిక స్థావరం, ల్యాండింగ్ స్ట్రిప్ లను... మరో స్థావరంలోని పరికరాలను అమెరికా సైనికులు ధ్వంసం చేశారు. టర్కీ సరిహద్దులో హసాకా ప్రావిన్స్ లో ఉన్న ఈ ఎయిర్ స్ట్రిప్... పెద్ద మిలిటరీ రవాణా విమానాలు దిగడానికి కూడా అనువుగా ఉంటుంది. ఇంతకు ముందు హడావిడిగా వదిలి వెళ్లిన స్థావరాలు ప్రత్యర్ధులకు ఉపయోగపడటం అమెరికాకు తలనొప్పిగా మారింది.
2019-10-21 Read Moreబంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భారత పర్యటన ప్రశ్నార్ధకమైంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ 11 పాయింట్ల డిమాండును అంగీకరించకపోతే ఏ ఆటా ఆడబోమని ఆ దేశ టెస్టు, టి20 జట్టు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ సోమవారం ప్రకటించారు. బంగ్లాదేశ్, ఇండియా జట్ల మధ్య నవంబర్ 3 నుంచి టి20 సిరీస్ (3 మ్యాచులు), 2 మ్యాచుల వన్డే సిరీస్ జరగాల్సి ఉంది. బంగ్లాదేశ్ ఆటగాళ్ళ అసాధారణ ప్రకటనతో ఆ జట్టు ఇండియా టూరుపై సందేహాలు నెలకొన్నాయి.
2019-10-21సిరియానుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు నిర్ణయించిన నేపథ్యంలో ఆ దేశంలోని స్థావరాలనుంచి వెళ్లిపోతున్న సైన్యాన్ని కుర్దులు అసహ్యించుకుంటున్నారు. సిరియా సరిహద్దు పట్టణమైన ఖామిష్లిలో అమెరికా సైనికుల వాహనంపై కొందరు రాళ్లు, కుళ్లిపోయిన పండ్లు విసురుతున్న వీడియో ఒకటి కుర్దుల ఆగ్రహానికి అద్దం పట్టింది. కొంతమంది ప్రజలు వాహనానికి అడ్డుగా వచ్చి ‘నో నో’ అనడం, వాహనం ముందుకు కదలగానే రాళ్లు విసరడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కుర్దిష్ ఏజెన్సీ ‘హవర్ న్యూస్’ ఈ వీడియోను పోస్టు చేసింది.
2019-10-21అజయ్ దేవ్‌గన్ కొత్త చిత్రం ‘‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’’ మొదటి పోస్టర్ సోమవారం విడుదలైంది. ఒక యుద్ధ సన్నివేశంలో హీరో వెనుక జ్వలించే బాణాలు దూసుకొచ్చే దృశ్యమే ఈ పోస్టర్. ‘మనసు కూడా కత్తిలా పదునైనదే’ అంటూ అజయ్ దేవగన్ ఈ పోస్టర్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. ఛత్రపతి శివాజీ సైన్యాధిపతుల్లో ఒకరైన తనాజీ మలుసారే కథ ఇది. సింహాగడ్ యుద్ధంలో మరాఠాల కోసం మొఘలుల నుండి ‘కొంధన’ కోటను గెలిచే క్రమంలో తనాజీ మరణించాడు. ఈ సినిమా వచ్చే జనవరి 10న విడుదల కానుంది.
2019-10-21గోదావరిలో బోటు మునిగి 37 రోజులైనా బయటకు తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు. సోమవారం చేసిన ప్రయత్నంతో బోటు పై కప్పు మాత్రం ఊడి వచ్చింది. కొద్ది రోజుల క్రితం ముందువైపు రెయిలింగ్ బయటకు వచ్చింది. బోటు ముందు భాగం 40 అడుగుల లోతులో ఉంటే వెనుకభాగం 70 అడుగుల లోతులో ఇసుకలో కూరుకుపోయినట్టు కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ చెప్పారు. డైవర్లు ఇప్పటికి ఆరుసార్లు బోటు మునిగిన ప్రాంతాన్ని శోధించారు. సోమవారం బయటకు తీస్తామనే నమ్మకంతో ఉన్నారు.
2019-10-21అక్టోబరు 5 నుంచి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతం చెల్లించకుండా నిలిపివేసిన ప్రభుత్వం, సోమవారం కోర్టులో అందుకు ఊహించని కారణం చెప్పింది. ఆర్టీసీ వద్ద కేవలం రూ. 7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని, అందరికీ జీతాలు చెల్లించాలంటే రూ. 224 కోట్లు అవసరమని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు. పూర్తిగా పని చేసిన నెలకు వేతనం ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తున్నందున ప్రభుత్వం ఆర్థిక కారణాన్ని ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు.
2019-10-21