సుమారు రూ. 70 వేల కోట్ల రూపాయల (9.3 బిలియన్ డాలర్ల) రఫేల్ యుద్ధ విమానాల అమ్మకపు ఒప్పందంలో అవినీతి జరిగిందనే అనుమానంతో ఫ్రాన్స్ నేషనల్ ఫైనాన్సియల్ ప్రాసిక్యూటర్ ఆఫీసు (పి.ఎన్.ఎఫ్) విచారణకు ఆదేశించింది. దర్యాప్తుకోసం ఒక జడ్జిని నియమించినట్టు ప్రకటించింది. 36 విమానాల కొనుగోలుకోసం 2016లో ఇండియా కుదుర్చుకున్న ఒప్పందంలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే ఆరోపణలు వచ్చాయి. ప్రపంచంలో ఎవరూ చెల్లించనంత ఎక్కువ ధరకు కొనుగోలు చేయడమే ఇందుకు కారణం.
2021-07-03ఆంగ్ల పదజాల పండితుడు, కాంగ్రెస్ నేత శశి థరూర్ ఇంకా కొత్త పదాలు నేర్చుకుంటున్నారు. తాను కొత్తగా ‘పోగొనోట్రోఫీ’ అనే పదాన్ని నేర్చుకున్నట్టు శశి థరూర్ ట్విట్టర్లో వెల్లడించారు. ఆ పదానికి అర్ధం ‘‘గడ్డాన్ని సాగు చేయడం’’ అని పేర్కొంటూ, ‘‘ప్రధానమంత్రి పోగొనోట్రోఫీ (గడ్డం పెంపు) మహమ్మారి వ్యాపకం అయినట్టుగా’’ అని చమత్కార బాణం వదిలారు. డాక్టర్ ప్రియా ఆనంద్ అనే నెటిజన్, తాను కొత్త పదాలకోసం ఎదురు చూస్తున్నానని శశిథరూర్ కు ట్వీట్ చేసినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు.
2021-07-02చైనాను బెదిరించడానికి, ప్రభావితం చేయడానికి ప్రయత్నించే బయటి శక్తులు ‘‘గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్’’ను ఢీకొట్టినట్టేనని ఆ దేశ అధ్యక్షుడు జి జిన్ పింగ్ హెచ్చరించారు. చైనా కమ్యూనిస్టు పార్టీని స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా గురువారం బీజింగ్ లో జరిగిన భారీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చైనాను పూర్తి స్థాయిలో ఏకీకరించడానికి కట్టుబడి ఉన్నామని జిన్ పింగ్ ఉద్ఘాటించారు. ‘తైవాన్ స్వాతంత్రం’ దిశగా జరిగే ఏ ప్రయత్నాన్నైనా ఓడించడానికి దృఢమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
2021-07-01కృష్ణా జలాలపై ప్రస్తుతం జరుగుతున్నదంతా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలసి సృష్టించిన కృత్రిమ వివాదమేనని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ మళ్ళీ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విభజన తేవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రా సోదరులు ఈ ఉచ్చులో పడవద్దని సూచించారు. కాంగ్రెస్ వైపు వస్తున్న శ్రేణులను షర్మిలవైపు మళ్ళించడానికే రాజశేఖరరెడ్డిని ధూషిస్తున్నారని ఆరోపించారు.
2021-07-01నీటి వాడకం విషయంలో ఇంకా పాత ఆటలు సాగవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హెచ్చరించారు. పాత పద్ధతిలో అరాచకాలు చేస్తామంటే చూస్తూ ఉండటానికి తెలంగాణ ఇప్పుడు అమాయకంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీశైలంలో జలవిద్యుత్ కోసం కె.ఆర్.ఎం.బి. ఆదేశాలకు విరుద్ధంగా నీటిని వాడడాన్ని ఏపీ కేబినెట్ ఖండించిన కొద్దిసేపటికే జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఒక రాష్ట్రమైంది... ఇక్కడ కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని మరచిపోయినట్టున్నారు’’ అని ఎద్దేవా చేశారు.
2021-06-30తెలంగాణతో జల వివాదాలపై బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అవసరమైతే ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకెళ్లేందుకు తాము సిద్ధమేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మంత్రివర్గ సమావేశం అనంతరం స్పష్టం చేశారు. కె.ఆర్.ఎం.బి. ఆదేశాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ నీటిని వాడుకుంటోందని అనిల్ విమర్శించారు. తెలంగాణ వ్యవహార శైలిపై ప్రధాని మోదీకి, కేంద్ర జలశక్తి మంత్రికి లేఖలు రాస్తున్నామని తెలిపారు.
2021-06-30మాజీ సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని జూలై 8న రైతు దినోత్సవం జరపాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. జూలై 1,3,4 తేదీల్లో జగనన్న కాలనీల్లో నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయాలని నిర్ణయించిన కేబినెట్, వైఎస్ఆర్ బీమా పథకానికి ఆమోద ముద్ర వేసింది. 100 సమీకృత అక్వా లేబొరేటరీలు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, 45 నూతన రైతు బజార్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
2021-06-30కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం, రూ. 6.29 లక్షల కోట్ల ప్యాకేజీలోని వివిధ పథకాలకు విడివిడిగా ఆమోదం తెలిపింది. రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కాం)లలో సంస్కరణల ఆధారిత పంపిణీ పథకాన్ని రూ. 3.03 లక్షల కోట్లతో ప్రతిపాదించగా, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) బుధవారం ఆమోదించింది. ఎల్.జి.ఎస్.సి.ఎ.ఎస్, ఇ.సి.ఎల్.జి.ఎస్. రుణ పథకాలు, భారత్ నెట్ వంటి ప్రతిపాదనలకూ ఆమోదం లభించింది.
2021-06-30చైనా ఇప్పుడు మలేరియా రహిత దేశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) బుధవారం ప్రకటించింది. 70 సంవత్సరాల పాటు పోరాడి చైనా మలేరియాను నిర్మూలించిందని డబ్ల్యుహెచ్ఒ పేర్కొంది. 1940లలో చైనాలో ఏటా 3 కోట్ల మంది మలేరియా బారిన పడేవారని, గత కొన్ని దశాబ్దాలుగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, గత నాలుగేళ్లలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వివరించింది. మలేరియా నుంచి దేశాన్ని విముక్తి చేసినందుకు చైనా ప్రజలకు అభినందనలు తెలిపింది. లక్ష్యిత, సుస్థిర చర్యలతో ఇది సాధ్యమైందని ప్రశంసించింది.
2021-06-30 Read Moreప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పైన ఆయన మాజీ పార్టీ (జెడి-యు) చీఫ్ ఆర్.సి.పి. సింగ్ మాటల తూటాలు సంధించారు. ప్రజాస్వామ్యం అంటే ఒక కంపెనీని నడపడం కాదని సింగ్ వ్యాఖ్యానించారు. బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల విజయాలు ప్రజలు అందించినవని, ఎవరో ఒక వ్యక్తి వల్ల ఒరిగినవి కావని సింగ్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ కు బీహార్ లో ఎలాంటి పునాది లేదని, అనేక మంది రాజకీయ నేతలకు ప్రధాన మంత్రిత్వంపై ఆశలు చూపారని విమర్శించారు.
2021-06-29