పారిశ్రామికోత్పత్తిలో కీలకమైన 8 ప్రధాన రంగాలు చతికిలపడ్డాయి. సెప్టెంబరులో ఆయా పరిశ్రమల ఉత్పత్తి పెరగకపోగా 5.2 శాతం తగ్గింది. 8 ప్రధాన పరిశ్రమల్లో 7 తిరోగమనంలోనే ఉన్నాయి. అందులో బొగ్గు ఉత్పత్తి పరిశ్రమ ఏకంగా 20.5 శాతం క్షీణించింది. ఈ తిరోగమనం... రెండో త్రైమాసికంలో మొత్తం జీడీపీ వృద్ధిపైనే ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. 8 ప్రధాన రంగాల్లో వృద్ధి రేటు ఆగస్టులో కేవలం 0.1 శాతంగా నమోదైంది.
2019-10-31ఇండియాలో ప్రభుత్వంపట్ల విమర్శనాత్మకంగా వ్యవహరిస్తున్న 1400 మంది జర్నలిస్టులు, యాక్టివిస్టుల వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయిన విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన రోజే మరో కీలకమైన అంశం వెలుగు చూసింది. 5 ఖండాల్లోని 20 దేశాల్లో ఉన్నత స్థాయి ప్రభుత్వ, మిలిటరీ అధికారుల ఫోన్ల సమాచారాన్ని తస్కరించడానికి... వారి వాట్సాప్ అకౌంట్లలోకి ‘హ్యాకింగ్ సాఫ్ట్ వేర్’ను చొప్పించినట్టు తేలింది. ఈ దేశాల్లో ఎక్కువ అమెరికా మిత్రులేనని చెబుతున్నారు.
2019-11-01 Read Moreవిశాఖలో 20 ఏళ్లలో రూ. 70 వేల కోట్ల పెట్టుబడితో అతి పెద్ద డేటా సెంటరును నిర్మిస్తామని గతంలో చెప్పిన గౌతమ్ అదానీ కంపెనీ ఇప్పుడా మొత్తాన్ని రూ. 3000 కోట్లకు తగ్గించింది. అదానీ సంస్థకు గత ప్రభుత్వం విశాఖలో మూడు చోట్ల కేటాయించిన 400 ఎకరాల భూమి చాలా ఎక్కువని భావించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వచ్చే రెండు-మూడేళ్లలో ఎంత పెట్టుబడి పెట్టగలరో.. ఎంతమందికి ఉపాధి కల్పిస్తారో స్పష్టంగా చెప్పాలని ప్రశ్నించింది. దీంతో అదానీ సంస్థ స్వల్పకాల ప్రణాళికకు 89 ఎకరాలు చాలని బదులిచ్చింది.
2019-10-31పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ విషయంలో ఆగస్టులో ఇచ్చిన స్టేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎత్తివేసింది. దీంతో కొత్త కాంట్రాక్టరు నిర్మాణ పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. గత ప్రభుత్వ హయాంలో తమతో చేసుకున్న ఒప్పందాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆగస్టులో రద్దు చేయడంతో నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఒప్పందం రద్దు నిర్ణయాన్ని కొట్టివేసిన హైకోర్టు, విద్యుత్ కేంద్రం పనులను థర్డ్ పార్టీకి అప్పగించే ప్రక్రియ చేపట్టవద్దని ఆగస్టు 22వ తేదీన ఆదేశించింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను ఇప్పుడు రద్దు చేసింది.
2019-10-31‘ఇస్లామిక్ స్టేట్’కు కొత్త సారథి వచ్చాడు. ఆ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబుబకర్ అల్ బాగ్దాది, అధికార ప్రతినిధి అబు అల్ హసన్ అల్ ముహజిర్ మరణించిన తర్వాత తొలిసారిగా గురువారం ఓ ఆడియో ప్రకటనను విడుదల చేసింది. ఈ ఆడియో ప్రకటన ప్రకారం బాగ్దాది వారసుడిగా అబు ఇబ్రహీం అల్ హషీమి అల్ ఖురేషి నియమితుడయ్యాడు. ఇతను కూడా బాగ్దాది వంశానికి సంబంధించినవాడే అని సమాచారం. ఇస్లామిక్ స్టేట్ కొత్త అధికార ప్రతినిధిగా అబు హంజా అల్ ఖురేషి నియమితుడయ్యాడు.
2019-11-01‘‘భవన నిర్మాణ కార్మికులు ఎవరు ఆత్మహత్య చేసుకుంటున్నారు? వాళ్ళకు తెలియదా.. ఇది అన్ సీజన్ అని? ఈ అన్ సీజన్లో ఎవరైనా చేసుకుంటారా (ఆత్మహత్య)?’’ అని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మరో మంత్రి బొత్స సత్యనారాయణతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఏదో ఒక కారణంతో ఆత్మహత్య చేసుకున్నవారిని ఇసుక కొరతతో ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు.
2019-10-30ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని సీపీఎం సీనియర్ నేత ఎంఎ గఫూర్ మండిపడ్డారు. ఎన్ని కష్టాలున్నా ఎవరైనా బతకాలనుకుంటారన్న గఫూర్, 28 సంవత్సరాల యువకుడు ఏ కారణంతో ఆత్మహత్య చేసుకుంటాడని ప్రశ్నించారు. ‘‘మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. ప్రభుత్వానికి అప్రదిష్ట వచ్చిందన్న కారణంతో మీలో ఒక్కరైనా ఆత్మహత్య చేసుకుంటారా? మేం 10 లక్షల పరిహారం ఇస్తాం’’ అని తీవ్రంగా ప్రశ్నించారు.
2019-10-31ప్రభుత్వానికి, పార్టీ నేతలకు ఆదాయం కోసం ప్రభుత్వమే ఇసుక కొరతను సృష్టించిందని సిపిఎం నేత ఎం.ఎ. గఫూర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక ఇబ్బడి ముబ్బడిగా ఉందని, ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు లేకుండా ఎక్కడైనా ఇసుక తీసుకోవచ్చని ఒక్క మాట చెబితే ఎవరూ మళ్లీ ఇసుక మాటే ఎత్తరని ఆయన చెప్పారు. గురువారం రాష్ట్రం మొత్తంనుంచి విజయవాడ వచ్చిన భవన నిర్మాణ కార్మికులను ఉద్ధేశించి గఫూర్ ప్రసంగించారు. అన్నం తినే ప్రభుత్వమైతే ఆలోచిస్తుందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
2019-10-31నవంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన ర్యాలీకి తెలుగుదేశం పార్టీ నేతలు హాజరు కానున్నారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారం స్వయంగా వెల్లడించారు. ఇసుక సంక్షోభంతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ర్యాలీకి హాజరు కావాలని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కూడా పవన్ కోరినా, ఆయన హాజరు కారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు.
2019-10-31‘నిర్భయ’పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరణశిక్షకు గురై తీహార్ జైలులో ఉన్న దోషులను త్వరలో ఉరి తీయనున్నట్టు అధికారులు తెలిపారు. ఆ కేసులోని నలుగురు ముద్దాయిలలో ముగ్గురు తీహార్ జైలులోనే ఉండగా మరొకరు మండోలీ జైలులో ఉన్నారు. కింది కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఖరారు చేయడంతో దోషులు క్షమాబిక్షకు కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో మరణ శిక్ష అమలు చేయనున్నట్టు దోషులకు ఈ నెల 28న తెలియజేశామని జైలు అధికారులు గురువారం వెల్లడించారు.
2019-10-31