ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ‘బాహుబలి’ సినిమాలో ‘భల్లాలదేవుడు (విలన్)’తో పోల్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎలాగైనా అధికారంలో ఉండటానికి వంచనలు, కుట్ర రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్ధతు ఇస్తున్నా పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని మోదీ డిమాండ్ చేశారు. యు-టర్న్ బాబు పోలవరం ప్రాజెక్టును ‘ఎటిఎం’లా ఉపయోగించుకుంటున్నారని మోదీ ఆరోపించారు.
2019-04-01 Read Moreటిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వేసినట్టేనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఎన్నికల సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, మోదీ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టారని విమర్శించారు. దేశవ్యాప్తంగా 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కేంద్రంలో అధికారం చేపట్టిన ఏడాది లోపే అవన్నీ భర్తీ అయ్యేలా చూస్తానని రాహుల్ హామీ ఇచ్చారు.
2019-04-01 Read More2018-19 ఆర్థిక సంవత్సరం ఆఖరి నెల మార్చిలో రూ. 1,06,577 కోట్ల మేరకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మొత్తం వసూలైంది. 2017 జూలైలో జీఎస్టీ అమలు ప్రారంభమయ్యాక ఒక నెలలో ఇంత వసూలు కావడం ఇదే తొలిసారి. 2018 మార్చితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 15.6 శాతం గ్రోత్ నమోదైంది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ. 11.77 లక్షల కోట్ల పన్ను ఆదాయం జీఎస్టీ ద్వారా వచ్చింది. మార్చి వసూళ్ళలో కేంద్ర జీఎస్టీ రూ. 20,353 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ రూ. 27,520 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 50,418 కోట్లు, సెస్ రూపంలో రూ. 8,286 కోట్లు వసూలయ్యాయి.
2019-04-01 Read Moreజమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం, అధ్యక్ష ప్రధానమంత్రులు ఉండాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. గడియారాన్ని 1953కు తిప్పుతారా? అని అబ్దుల్లాను, ఆయన మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు (1953కు ముందు కాశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని ఉండేవారు). తన మిత్రపక్షం వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని మోదీ డిమాండ్ చేశారు. తెలంగాణ ఎన్నికల సభలో ప్రధాని ఈ అంశాన్ని ప్రస్తావించారు.
2019-04-01 Read Moreఇండియాలో విలీనమైనప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక గుర్తింపుపై కుదిరిన ఒప్పందాన్ని తిరిగి అమలు చేయవలసి ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కాశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక ప్రధానమంత్రి, అధ్యక్షుడు ఉండాలని ఉద్ఘాటించారు. దేశంలోని సంస్థానాలు భారత యూనియన్ లో విలీనం కావడానికి ఎలాంటి షరతులు లేవని, అయితే కాశ్మీర్ విలీనం భిన్నమైనదని ఒమర్ గుర్తు చేశారు. 1947లో రాజా హరిసింగ్ పెట్టిన ‘విలీన షరతుల’ పునరుద్ధరణకే తమ పార్టీ కట్టుబడి ఉందని బందిపొరాలో జరిగిన ఒక సభలో ఒమర్ స్పష్టం చేశారు.
2019-04-01భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పి.ఎస్.ఎల్.వి-సి45 రాకెట్ మోసుకెళ్లిన 29 ఉపగ్రహాల్లో 24 అమెరికాకు చెందినవే... మిగిలినవాటిలో భారత మిలిటరీ శాటిలైట్ ‘ఎమిశాట్’, లిథుయేనియా ఉపగ్రహాలు రెండు, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన చెరొక ఉపగ్రహం ఉన్నాయి. భారత ఉపగ్రహం బరువు 436 కేజీలు కాగా, మిగిలిన అన్నిటి బరువు కలిపి 220 కేజీలు. ఈ ఏడాది పి.ఎస్.ఎల్.వి. సిరీస్ ను ప్రయోగించడం ఇది రెండోసారి. కాగా, పి.ఎస్.ఎల్.వి-క్యుఎల్ వేరియంట్ ప్రయోగం ఇదే తొలిసారి. అత్యధిక సమయం (మూడు గంటలు) భూ కక్షలో ఉన్నది కూడా ఇప్పుడే.
2019-04-01మిలిటరీ నిఘా ఉపగ్రహం ‘ఎమిశాట్’ను పి.ఎస్.ఎల్.వి- సి45 రాకెట్ సోమవారం ఉదయం భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దాంతోపాటు 28 విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను కూడా నింగిలోకి మోసుకెళ్లింది. ఇది 47వ పి.ఎస్.ఎల్.వి. ప్రయోగం. డి.ఆర్.డి.ఒ. రూపొందించిన ‘ఎమిశాట్’ వంటి ఉపగ్రహాన్ని ఇండియా ప్రయోగించడం ఇదే మొదటిసారి. శ్రీహరికోట నుంచి సోమవారం ఉదయం 9.27 గంటలకు నింగికి ఎగసిన రాకెట్... 17 నిమిషాల తర్వాత ఎమిశాట్ ఉపగ్రహాన్ని భూమికి 753.68 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
2019-04-01‘‘ఒక వ్యక్తి రూ. 9000 కోట్ల మోసానికి పాల్పడి దేశాన్ని వదిలిపోతే రూ. 14,000 కోట్ల విలువైన అతని ఆస్తులు జప్తు చేశాం’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆదివారం ‘టివి9 భారత్ వర్ష్’ను ప్రారంభించిన మోదీ, ఆ సందర్భంగా ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా పేరు ప్రస్తావించకుండానే ఆయన విషయం మాట్లాడారు. మోసాలకు పాల్పడినవారికి ఇండియాలో ఉన్న ఆస్తులను జప్తు చేయడంతోపాటు.. విదేశాల్లోని ఆస్తులను కూడా వేలం వేసేలా తాము ఒక చట్టం తెచ్చిన కారణంగానే ఇదంతా జరిగిందని మోదీ చెప్పారు.
2019-03-312014 ఎన్నికల సమయానికి వార్షికాదాయంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. అప్పట్లో జయదేవ్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన వార్షిక వ్యక్తిగత ఆదాయం రూ. 16.31 కోట్లు. ఆ ఎన్నికల్లో ఎంపీలైనవారిలో 479 మంది అఫిడవిట్లను ఎడిఆర్ సంస్థ మదించింది. ఎడిఆర్ నివేదిక ప్రకారం ఆదాయంలో చివరి స్థానంలో ఉన్నది కూడా ఆంధ్రుడే. విజయవాడ ఎంపీ కేశినేని నాని నికరంగా రూ. 2.07 కోట్ల మైనస్ లో ఉన్నారు. 2019 ఎన్నికలకోసం సమర్పించే అఫిడవిట్లను ఆ తర్వాత మదించాల్సి ఉంది.
2019-04-01వార్షిక వ్యక్తిగత ఆదాయం విషయంలో ఆంధ్రా ఎంపీలకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఎడిఆర్) సంస్థ 479 మంది ఎంపీలు ప్రకటించిన ఆస్తుల వివరాలను మదించి తేల్చిన విషయమిది. ఆంధ్రలోని 19 మంది ఎంపీల వార్షికాదాయం రూ. 1.06 కోట్లుగా ఉంటే రెండో స్థానంలో ఉన్న ఒడిషా ఎంపీల (15 మంది) సగటు ఆదాయం రూ. 68.8 లక్షలుగా ఉంది. దేశం మొత్తం మీద 479 మంది లోక్ సభ సభ్యుల వార్షికాదాయం సగటున రూ. 30.29 కోట్లుగా తేలింది.
2019-03-31 Read More