తాను అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛను మొత్తాన్ని రూ. 3000కు పెంచుతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పింఛనును రూ.2000కు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ప్రకటన చేసిన నేపథ్యంలో జగన్ ఈ విధంగా స్పందించారు. బుధవారం తిరుపతిలో నిర్వహించిన శంఖారావం సభలో జగన్ ఈ అంశంపై మాట్లాడారు. 2014కు ముందు పింఛను మొత్తం రూ. 200 ఉండగా ఆ ఏడాది అక్టోబర్ నుంచి రూ. 1000 ఇస్తున్నారు. 

2019-02-06 Read More

‘ప్రజల మనోభావాలను గౌరవించాం. వారి ఆకాంక్షమేరకే కేంద్రంపై పోరాడుతున్నాం. పేదల సంక్షేమం చూస్తున్నాం. ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు?’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ ఎమ్మెల్యేలను నిలదీశారు. ‘రాజశేఖరరెడ్డి ఒక్క పరిశ్రమను తెచ్చాడా? మనం తెచ్చిన ఓక్స్ వ్యాగన్ కంపెనీని వాళ్ళు తరిమేశారు. మనం కియా కంపెనీని తెచ్చాం. దీనిపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రతినిధులు ప్రచారం చేయాలి’ అని గురువారం మధ్యాహ్నం జరిగిన టీడీఎల్పీ సమావేశేంలో చంద్రబాబు సూచించారు.

2019-01-31 Read More

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో సర్వేల హడావిడి ఊపందుకుంది. ఇటీవల ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ లోక్ సభ ఎన్నికలపై ఒపీనియన్ పోల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా టైమ్స్ నౌ టీవీ సర్వే ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 23 లోక్ సభ సీట్లు (మొత్తం 25) వస్తాయని టైమ్స్ నౌ అంచనా. గత ఎన్నికల్లో 15 సీట్లు గెలిచిన టీడీపీకి ఈసారి కేవలం రెండు సీట్లు వస్తాయని ఈ సర్వే చెబుతోంది. 

2019-01-30 Read More

ప్రధాని నరేంద్రమోడీ వల్లనే ఆంధ్రప్రదేశ్‌కు కియా కార్ల పరిశ్రమ వచ్చిందని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటుకోసం గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలను సూచించగా... కియా మాత్రం ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుందని ఆయన చెప్పారు.

2019-01-29 Read More

రాఫేల్ కుంభకోణం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇరుకున పెట్టే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం మరో ట్విస్టు ఇచ్చారు. మోడీ హయాంలోనే రక్షణ శాఖ మంత్రిగా పని చేసి... ప్రస్తుతం గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ తో రాహుల్ భేటీ అయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న పారికర్ ను పలకరించడానికే కలిశామని రాహుల్ చెబుతున్నా... రాఫేల్ కుంభకోణంలో ఆరోపణల నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత చోటు చేసుకుంది. రాఫేల్ కుంభకోణంలో మోడీ పాత్రకు సంబంధించిన రహస్య సమాచారం పారికర్ వద్ద ఉందని రాహుల్ అనేకసార్లు చెప్పారు. 

2019-01-29 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page