జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)లో చేరారు. గురువారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోగల జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఆయనను కలసిన నార్నె వైసీపీ కండువా కప్పుకున్నారు. నార్నె కొద్ది రోజుల క్రితం ఓసారి జగన్మోహన్ రెడ్డిని కలసి చర్చించారు. అప్పుడే ఆయన చేరిక ఖాయమైంది. ఎన్టీఆర్ కు మామ కావడానికి ముందే నార్నె శ్రీనివాసరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బంధువు. గతంలో నార్నె టీడీపీ తరపున చిలకలూరిపేట అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది.

2019-02-28

భద్రతా దళాల త్యాగాలను పచ్చిగా రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారని బీజేపీ నేతలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా 21 ప్రతిపక్ష పార్టీల నేతలు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. కాశ్మీర్ ఉగ్రవాద దాడిలో మరణించిన 40కి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళి అర్పించిన నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. బుధవారం పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడిన భారత పైలట్ అభినందన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యులని ప్రతిపక్ష నేతలు భావించారు.

2019-02-27

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెండోసారి సమావేశమయ్యారు. వియత్నాం రాజధాని హనోయి వారి భేటీకి వేదికైంది. ఈ ఇద్దరు నేతల రెండు రోజుల ‘హనోయి సదస్సు’ బుధవారం ముఖాముఖి సమావేశంతో ప్రారంభమైంది. ఎనిమిది నెలల క్రితం ట్రంప్, కిమ్ మొదటి సమావేశం సింగపూర్ వేదికగా జరిగింది. అప్పుడు.. కొరియా భద్రతకు ట్రంప్ హామీలు ఇవ్వగా, ‘అణ్వాయుధ రహిత కొరియా’కు తాను కట్టుబడి ఉన్నట్టు కిమ్ చెప్పారు. మధ్యలో కొంత అపనమ్మకం, అపార్ధాలు వచ్చాయని కిమ్ చెప్పారు. వాటిని అధిగమించి 260 రోజుల తర్వాత రెండోసారి సమావేశమయ్యారు. 

2019-02-27

నదిలో మునక వేసినంత మాత్రాన చేసిన పాపాలు మాసిపోవని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత మాయావతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కుంభమేళా సందర్భంగా ప్రధానమంత్రి ఆదివారంనాడు ప్రయాగ్ రాజ్ వద్ద నదిలో స్నానమాచరించిన నేపథ్యంలో మాయ ఈ వ్యాఖ్య చేశారు. ‘‘ఎన్నికల హామీలను ఉల్లంఘించడం, ద్రోహం, ప్రభుత్వ పరంగా చేస్తున్న తప్పుల వంటి పాపాలను సంగంలో మునక వేయడం ద్వారా కడిగేసుకోగలరా? తమ జీవితాలను బాధామయం చేసిన బీజేపీని క్షమించడం ప్రజలకు సాధ్యం కాదు’’ అని మాయ ట్విట్టర్లో స్పష్టం చేశారు. 

2019-02-25

రాష్ట్ర రాజధాని పేరుకు అమరావతే అయినా... తన మనసుకు మాత్రం కర్నూలు నగరమే రాజధాని అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కర్నూలు పర్యటనలో ఉన్న జనసేనాని సోమవారం ఆ నగరంలోని ఓ కన్వెన్షన్ హాలులో విద్యార్ధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తే కర్నూలు నగరానికి పూర్వ వైభవం తెస్తామని, రాజధాని అమరావతిని మించిన నగరంగా నిర్మిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ‘‘రాయలసీమకు ఎవరు ఎంత చేశారో తెలియదు. నేను మాత్రం బాధ్యతతో పని చేసి సీమలోని ప్రతి చెట్టు, గట్టును కాపాడతా’’ అని ఉద్ఘాటించారు.

2019-02-25 Read More

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో యూపీలో కలసి పోటీ చేయనున్నట్టు ఇంతకు ముందే ప్రకటించిన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ... తాజాగా తమ పొత్తును ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ లోని 29 లోక్ సభ సీట్లలో మూడు చోట్ల, ఉత్తరాఖండ్ లోని 5 సీట్లలో ఒకచోట ఎస్పీ పోటీ చేస్తుంది. మిగిలిన అన్ని సీట్లలోనూ బీఎస్పీ పోటీ చేయనుంది. యూపీలోని 80 సీట్లలో ఎస్పీ 37, బీఎస్పీ 38 సీట్లలో పోటీ చేయడానికి ఇదివరకే ఒప్పందం కుదిరింది. మిగిలిన సీట్లను మిత్రపక్షాలకు కేటాయించారు.

2019-02-25 Read More

‘రెడ్డి’ అంటే ఒక కులానికి సూచిక కాదని, రెడ్డి అంటే రక్షకుడని అర్ధమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. రాయలసమలో రాజకీయ యాత్ర మొదలుపెట్టిన పవన్ ఆదివారం కర్నూలులో రోడ్ షో నిర్వహించారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ... రాయలసీమలో రౌడీయిజం, రాష్ట్ర రాజకీయాల్లో కుటుంబ ఆధిపత్యం పోవాలని ఆకాంక్షించారు. తాను ఒక కులాన్నో..ప్రాంతాన్నో నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదన్నారు. కులాల గోడలు బద్ధలు కొడతానని ఉద్ఘాటించారు.

2019-02-24 Read More

డ్రైవింగ్ రానివాడికి వాహనం ఇస్తే యాక్సిడెంట్ తప్పదని, అలాగే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని అప్పగిస్తే ప్రమాదాలు జరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం చీరాల నియోజకవర్గ టీడీపీ నేతలతో మాట్లాడిన ముఖ్యమంత్రి ‘‘ఆటో డ్రైవర్లంతా నన్ను డ్రైవర్ నెంబర్ 1 అంటున్నారు. రాష్ట్రాన్ని నడపగలిగే డ్రైవర్ చంద్రబాబు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి డ్రైవింగే రాదు. డ్రైవింగ్ స్కూలుకు వెళ్లలేదు’’ అన్నారు.

2019-02-23 Read More

ఏపీకి ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలకంటే అదనంగానే కేంద్రం సాయం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఉద్ఘాటించారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన రైల్వే జోన్ అంశంపై చర్చించేందుకు కన్నా శనివారం ఇతర బీజేపీ నేతలతో కలసి న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర హామీల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీలలో 90 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందని కన్నా పేర్కొన్నారు.

2019-02-23 Read More

ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే ఈ గడ్డపై అడుగుపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పష్టం చేశారు. శనివారం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా ఆయనీ అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీ దేశం మొత్తానికి ఇచ్చినదని, ఐదేళ్లు హోదాను తొక్కి పట్టి బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. మార్చి 1న ప్రధాని మోదీ విశాఖపట్నం వస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ..మా హక్కులు ఎందుకు నెరవేర్చలేదంటూ నిలదీయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

2019-02-23 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page