రాఫేల్ పత్రాలు చోరీకి గురయ్యాయన్న మాటను అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ మార్చుకోవడంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం తన స్టైల్లో స్పందించారు. దొంగ ఫైళ్ళను తిరిగి ఇచ్చేసి ఉంటాడని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాఫేల్ ఫైళ్లు పోయాయని, పిటిషనర్లకు అవే ఆధారమని బుధవారం సుప్రీంకు చెప్పిన వేణుగోపాల్... శుక్రవారం అవి ‘‘ఫొటో కాపీలు’’ అంటూ మాట మార్చిన సంగతి తెలిసిందే. ‘‘బుధవారం అవి చోరీ అయిన పత్రాలు. శుక్రవారం అవి ఫొటో కాపీలు!! ఈ మధ్యలో గురువారం దొంగ ఫైళ్ళను తిరిగి ఇచ్చాడనుకుంటా’’ అని చిదంబరం చమత్కరించారు.
2019-03-09 Read Moreతెలుగుదేశం పార్టీ డేటా దొంగతనానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ తయారు చేసిన ప్రణాళిక వెల్లడైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. శనివారం ఉదయం టెలికాన్ఫరెన్సులో పార్టీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు ‘‘దొంగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. సాక్ష్యాలన్నీ తుడిచేశామని నేరగాళ్ళు అనుకుంటారు. కానీ ఎక్కడో ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన ఓ సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ వివరాలు వెల్లడిస్తా’’ అని చంద్రబాబు ఆసక్తికర ప్రకటన చేశారు.
2019-03-09ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ భద్రత కంటే రాజకీయ భద్రతే ముఖ్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అభినందన్ ఇండియాకు వస్తుంటే స్వాగతం పలకడం ప్రధానికి ముఖ్యం కాదని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ గాయాలపై కారం చల్లడానికి వచ్చారని దుయ్యబట్టారు. శనివారం ఉదయం పార్టీ శ్రేణులతో ఎన్నికలపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ‘రాజకీయ లబ్దికోసం దేనికైనా దిగజారే పార్టీ బీజేపీ. మోదీ విఫల ప్రధాని. గతంలో ఏ ప్రధానమంత్రికీ ఇన్ని నల్లజెండాలు ఎదురు కాలేదు’ అని చెప్పారు.
2019-03-02ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు పాకిస్తాన్ పార్లమెంటులో చర్చకు వచ్చాయన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖండించారు. పాకిస్తాన్ భూభాగంపై దాడితో కర్నాటకలో బీజేపీకి 22 లోక్ సభ సీట్లు వస్తాయన్న ఎడ్యూరప్ప మాటలపైనే అక్కడ ప్రస్తావించారని, వచ్చే ఎన్నికలకోసమే మోదీ దాడులు చేస్తారన్న చర్చ జరిగిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని రెండేళ్ల క్రితమే బీజేపీ నేతలు తనతో అన్నారని పవన్ కళ్యాణ్ చెప్పి విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్నికలకోసం దేశ భద్రతను పణంగా పెట్టవద్దని ప్రధానికి హితవు పలికారు.
2019-03-01సౌదీ అరేబియా యువరాజు వస్తే అసాధారణంగా ఎయిర్ పోర్టుకు వెళ్ళి మరీ స్వాగతం చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ కస్టడీనుంచి విడుదలైన ఐఎఎఫ్ పైలట్ అభినందన్ ను స్వాగతించడానికి వాఘా సరిహద్దుకు ఎందుకు వెళ్ళలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఇదేనా మీ దేశభక్తి? వాఘా వెళ్లకుండా నన్ను విమర్శించడానికి విశాఖ వస్తారా?’ అని మండిపడ్డారు. ప్రధాని మోదీ శుక్రవారం విశాఖ సభలో తనపైన, మహాకూటమి నేతలపైనా చేసిన ఆరోపణలకు ఏపీ సీఎం ఘాటుగా బదులిచ్చారు. దేశంకోసం ప్రాణాలివ్వడానికి ఐదు కోట్ల ఆంధ్రులూ సిద్ధమన్న చంద్రబాబు, దేశభక్తిని రాజకీయాలకు ముడిపెట్టవద్దని ప్రధానికి హితవు పలికారు.
2019-03-01యు టర్న్ నేతలు గత ఐదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ చంద్రబాబు పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. సిఎం వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రధాని ఆరోపించారు. విశాఖపట్నం సభలో చంద్రబాబు పేరెత్తకుండానే... సిఎం, రాష్ట్ర నేతలు, యు టర్న్ నేతలు, ‘కొడుకులకోసం’ అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర నేతలు ప్రజల కోసం రాత్రీ పగలు కష్టపడినట్టుగా చెప్పుకుంటున్నారని, కానీ వాస్తవంలో తమ కుమారుల ప్రగతికోసమే పని చేశారని మోదీ వ్యాఖ్యానించారు.
2019-03-01భావ సారూప్యత లేని పార్టీల కూటమికి మద్ధతివ్వడం అంటే.. కేంద్రంలో బలహీన ప్రభుత్వాన్ని కోరుకోవడమేనని, అదే జరిగితే పాకిస్తాన్ బలపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. విశాఖపట్నం కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన మోదీ, ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రపంచమంతా పాకిస్తాన్ నుంచి సమాధానాలు కోరుతున్న సమయంలో, ఇండియాలోని కొంతమంది భద్రతా దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా ప్రకటనలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
2019-03-01కొన్ని పార్టీలు ‘మోదీ ద్వేషం’తో దేశాన్ని ద్వేషించడం ప్రారంభించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత.. భద్రతా దళాల త్యాగాలను బీజేపీ, మోదీ రాజకీయంగా వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శించిన నేపథ్యంలో మోదీ ఎదురు దాడికి దిగారు. శుక్రవారం వరుస ట్వీట్లతో మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘భద్రతా దళాలకు దేశమంతా దన్నుగా నిలిస్తే..ఆ పార్టీలు మాత్రం అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదంపై మన పోరాటానికి ప్రపంచమంతా మద్ధతు ఇస్తుంటే కొన్ని పార్టీలు మాత్రం ఈ పోరాటాన్ని అనుమానిస్తున్నాయి’ అని విమర్శించారు.
2019-03-01 Read More2019 ఎన్నికలకు ముందు యుద్ధం వస్తుందని బీజేపీ నేతలు తనతో రెండు సంవత్సరాల క్రితమే చెప్పారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కడప జిల్లాలో సభలు, సమావేశాల్లో మాట్లాడిన పవన్... యుద్ధం వస్తుందని రెండేళ్ళ క్రితమే చెప్పారంటే దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్ధమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు తాము మాత్రమే దేశభక్తులం అన్నట్టు ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు. ముస్లింలు తమ దేశభక్తిని నిరూపించుకోవలసిన అవసరం లేదని ఉద్ఘాటించారు.
2019-02-28పాకిస్తాన్ భూభాగంలోని జైషే మహ్మద్ స్థావరంపై భారత వైమానిక దళం జరిపిన దాడితో బీజేపీ రాజకీయంగా లబ్ది పొందుతుందని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ ఎడ్యూరప్ప వ్యాఖ్యానించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులను ఎన్నుకోవడానికి, నరేంద్ర మోదీని తిరిగి ప్రధానమంత్రిని చేయడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎడ్యూరప్ప అభిప్రాయపడ్డారు. కర్నాటకలోని 28 లోక్ సభ సీట్లలో బీజేపీ కనీసం 22 గెలుస్తుందని ఎడ్యూరప్ప అంచనా వేశారు.
2019-02-28