‘‘చనిపోయింది మీ చిన్నాన్న అనే మానవత్వం కూడా లేకుండా దోషులను కాపాడే ప్రయత్నం చేస్తారా’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ఉద్ధేశించి ప్రశ్నించారు. శనివారం తిరుపతిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన చంద్రబాబు, వివేకానందరెడ్డి హత్యోదంతాన్ని బహిరంగ సభలో ప్రస్తావించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని సాక్ష్యాలను తారుమారు చేశారని, అలా చేసినవారు శిక్షార్హులని చంద్రబాబు విమర్శించారు.

2019-03-17

వైఎస్ కుటుంబంలో అంతర్గత కలహాల నేపథ్యంలోనే వివేకానందరెడ్డి హత్య జరిగిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన వివేకాకు మనస్తాపం ఉందని, ఎంపీ సీటుకు ఎక్కడ అడ్డు వస్తాడోనని అనుమానం వీళ్లకు (జగన్ కుటుంబానికి) ఉందని, అకౌంట్ల విషయంలోనూ విభేదాలున్నాయని మంత్రి చెప్పారు. 1999, 2004లలో ఎంపీ సీటుకోసం జగన్ విఫల ప్రయత్నం చేసి చివరికి 2009లో సఫలమయ్యారని, వైఎస్ చనిపోయాక ఉప ఎన్నికల్లో విజయమ్మపైన వివేకా పోటీ చేశారని గుర్తు చేశారు.

2019-03-15

తన బాబాయి వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. తన బాబాయి తలపైన ఐదుసార్లు గొడ్డలితో నరికారని, ఆ స్థితిలో ఆయన బెడ్ రూమ్ నుంచి బాత్ రూమ్ వరకు వెళ్లి కమోడ్ కు కొట్టుకొని చనిపోయినట్టుగా చిత్రీకరించారని జగన్ ఆరోపించారు. వివేకానందరెడ్డి రాసినట్టుగా చెబుతున్న ఓ లేఖను పోలీసులు తనకు చూపించారన్న జగన్, అంతటి దాడి జరిగాక హంతకుల సమక్షంలోనే లేఖ ఎలా రాయగలరని ప్రశ్నించారు.

2019-03-15

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ సూత్రధారులుని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. వారి ప్రణాళికను మంత్రి ఆదినారాయణ రెడ్డి అమలుపరిచారని వ్యాఖ్యానించారు. ఆదినారాయణరెడ్డి ఒక హంతకుడని, ఎన్ని మర్డర్లు చేశాడో అందరికీ తెలుసని విజయసాయి వ్యాఖ్యానించారు. జగన్ తాత వైఎస్ రాజారెడ్డి 1998 ఎన్నికలకు ముందు హత్యకు గురయ్యారని, 2009 ఎన్నికల తర్వాత రాజశేఖరరెడ్డి మరణించారని, ఇటీవల జగన్ పై హత్యాయత్నం జరిగిందని పేర్కొన్నారు.

2019-03-15

కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, ఆమె భర్త కృష్ణయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి వచ్చిన ఆ దంపతులు గురువారం అర్ధరాత్రి తర్వాత పసుపు కండువాలు కప్పుకొన్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికల నోటిపికేషన్ వెలువడనుండటంతో చేరికలు ఊపందుకున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ కేంద్ర మాజీ మంత్రి తిరుపతి లోక్ సభ స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు.

2019-03-15

మాజీ ఎమ్యెల్యే వంగవీటి రాధాకృష్ణ బుధవారంనాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో వంగవీటి రాధ పసుపు కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు చంద్రబాబుకు, రాధకు కలిపి గజమాల వేసి అభినందించారు. ఇదే కార్యక్రమంలో చీరాల వైసీపీ నేత ఎడం బాలాజీ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ నుంచి బాలాజీ ఇటు మారారు.

2019-03-13

తెలుగుదేశం పార్టీ ఎంపీ తోట నరసింహం, ఆయన సతీమణి వాణి బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తోట లోక్ సభలో టీడీపీ పక్ష నేతగా పని చేశారు. పారిశ్రామికవేత్త పొట్లూరు వరప్రసాద్, సినీ నటుడు రాజా రవీంద్ర, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద రెడ్డి కూడా బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొన్నారు.

2019-03-13 Read More

ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే ఓం ప్రకాష్ శర్మకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పాకిస్తాన్ చెరనుంచి విడుదలైన ఐఎఎఫ్ పైలట్ అభినందన్ వర్ధమాన్ ఫొటోను వాడి పోస్టర్లు వేయడంపై ఈసీ స్పందించింది. ‘‘పాకిస్తాన్ తల వంచింది. చాలా తక్కువ సమయంలో అభినందన్ ను మోదీ వెనుకకు తీసుకొచ్చారు. ఇది చాలా పెద్ద దౌత్య విజయం’’ అని రాసిన పోస్టర్లను శర్మ సామాజిక మాథ్యమాల్లో షేర్ చేశారు. ఆ పోస్టులను తొలగించాలని ఆదేశించిన ఈసీ, గురువారంలోగా సంజాయిషీ ఇవ్వాలని సూచించింది.

2019-03-13 Read More

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు తమిళనాడు పర్యటనకు వచ్చినా ‘‘గో బ్యాక్ మోదీ’’ అనే నినాదం సామాజిక మాథ్యమాల్లో టాప్ ట్రెండింగ్ అంశంగా ఉంటోంది. బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనలో మాత్రం పూర్తి భిన్నత్వం కనిపించింది. ఈ రోజు ‘‘వణక్కం రాహుల్ గాంధీ (#VanakkamRahulGandhi)’’ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ అంశంగా ఉంది. దీంతో, బీజేపీ శ్రేణులు ‘‘గో బ్యాక్ పప్పు (#GoBackPappu)’’ అనే హ్యాష్ ట్యాగ్ ను ముందుకు తెచ్చారు. తమిళనాట ఉండే బీజేపీ వ్యతిరేకతకు మోదీ వ్యతిరేకత తోడై ప్రతిసారీ ఈ ద్రవిడనాడు తీవ్రంగానే స్పందిస్తోంది.

2019-03-13

రాబర్ట్ వాద్రాను విచారించాలని కోరిన మొదటి వ్యక్తిని తానేనని, అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా విచారించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. బుధవారం రాహుల్ గాంధీ తమిళనాడులోని నాగర్ కోయిల్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డిఎంకె కూటమిలో ఉంది. ఎండిఎంకె, సిపిఐఎం, సిపిఐ, విసికె, ఐయుఎంఎల్, ఐజెకె, కెడిఎంకె పార్టీలు ఆ కూటమిలో ఉన్నాయి.

2019-03-13
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page