మార్చి 27వ తేదీ ప్రపంచ రంగస్థల దినోత్సవం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం యాంటీ శాటిలైట్ ఆయుధాన్ని ప్రయోగించినందుకు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డి.ఆర్.డి.ఒ)ను అభినందించిన రాహుల్ గాంధీ, అదే ట్వీట్ లో మోదీకి మాత్రం రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
2019-03-27 Read Moreఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ ఢిల్లీలో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. జాతీయ రాజధానిలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన పూర్వపు కాంగ్రెస్ ప్రభుత్వంవల్లనే ‘‘ఆప్’’ పుట్టిందని కేజ్రీవాల్ చెప్పారు. ‘పూర్తి రాష్ట్ర హోదా లేని ఢిల్లీని షీలా దీక్షిత్ పాలించినప్పుడు మీరెందుకు పాలించలేరు’ అని తనను కొంతమంది అడిగారన్న కేజ్రీవాల్... ఆమె బాగా పాలిస్తే ప్రజలు ‘‘ఆప్’’కు ఎందుకు ఓట్లేశారని ఎదురు ప్రశ్నించారు. 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ సవ్యంగా ఉంటే ‘‘ఆప్’’ పుట్టేదే కాదన్నారు.
2019-03-27 Read Moreఎన్నికల నిర్వహణలో ఎలాంటి పాత్రా లేని ఇంటెలిజెన్స్ డీజీ ఎ.బి. వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేయడం వెనుక వై.ఎస్.ఆర్.సి.,బీజేపీల కుట్ర దాగి ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. మంగళవారం అర్దరాత్రి దాటాక టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, జూపూడి ప్రభాకరరావు ఈ అంశంపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే ప్రధాన బాధ్యత ఇంటెలిజెన్స్ డీజీపైన ఉందని, వై.ఎస్.ఆర్.సి. నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ కూడా జరపకుండా ఏకపక్షంగా ఆయనను బదిలీ చేయడం రాజకీయ ప్రేరేపిత కుట్రేనని టీడీపీ నేతలు దుయ్యబట్టారు.
2019-03-27ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఓ బాంబు పేల్చారు. తండ్రి మరణం తర్వాత తనను ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్ అధిష్ఠానానికి రూ. 1,500 కోట్లు ఇస్తానని జగన్ చెప్పారని ఫరూక్ వెల్లడించారు. అప్పట్లో జగన్ తనకు చెప్పిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేయదలచుకున్నానని ఫరూక్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఆయన చంద్రబాబుతో కలసి టీడీపీ ఎన్నికల సభలో మాట్లాడారు. ‘‘అతనికి అంత సొమ్ము ఎలా వచ్చింది? దోపిడీ ద్వారా వచ్చిన ఖజానా ఎక్కడైనా పూడ్చి పెట్టారా’’ అని ఫరూక్ ప్రశ్నించారు.
2019-03-26భూతద్దం పెట్టి వెతికినా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కు వెళ్లిందని దుయ్యబట్టారు. "పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని మీరు చెప్పలేదా చంద్రబాబూ.. నేటికీ అది పూర్తి కాలేదంటే మీ అసమర్ధత కాదా" అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి దిగుతున్న షర్మిల సోమవారం వివిధ అంశాలపై మాట్లాడారు.
2019-03-25రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గెలిచినట్టేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా నూజివీడులో ఎన్నికల సభలో మాట్లాడిన పవన్, ‘‘కేసీఆర్ గారూ.. మీరు తటస్థంగా ఉండాలి కదా! తెలంగాణలో ఆంధ్రావాళ్ళు రాజకీయం చేయకూడదుగాని మీరు ఇక్కడ చేయవచ్చా? మీరు చంద్రబాబుకు వ్యతిరేకమైతే మాకు అభ్యంతరం లేదు. ఆయనకు నేనూ వ్యతిరేకమే. కానీ, మీరు ఒకప్పుడు తరిమికొట్టిన జగన్ కు మద్ధతు ఇవ్వడం ఏమిటి’’ అని పవన్ తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
2019-03-23‘‘కేసీఆర్ ఓ నియంత.. నరేంద్ర మోదీ ఓ నియంత.. రాష్ట్రానికి రావలసినవి అడిగితే నాపై దాడులు చేస్తున్నారు. ఈడీ కేసులు పెడుతున్నారు’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు.కేసీఆర్ పోలవరంపై కేసులు వేశారని, అడిగితే ఆర్ధిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. శనివారం కృష్ణా జిల్లా నాగాయలంకలో ఎన్నికల సభలో మాట్లాడిన చంద్రబాబు ‘‘జగన్ పై తెలంగాణలో కేసులున్నాయి. ఈయన గెలిస్తే ఆయనకు ఊడిగం చేస్తాడని మద్ధతు ఇస్తున్నారు. మీకు రోషం లేదా? కేసీఆర్ పైన కోపం ఉందా లేదా?’’ అని ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు.
2019-03-23‘‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుగుదేశం పార్టీ నేతల కబ్జాలు ఒక ఎత్తయితే.. వీళ్ళు ఏకంగా మీ ఇళ్ళే లాగేసుకుంటారు. కొండలు దోచేస్తారు’’ అని పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ప్రజలకు చెప్పారు. గాజువాక జనసేన అభ్యర్ధిగా నామినేషన్ వేసిన అనంతరం పవన్ బహిరంగ సభలో మాట్లాడారు. అవినీతిని అంతమొందించడానికే.. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను విశాఖ నగరానికి కొత్వాల్ లా తీసుకొచ్చానని ఉద్ఘాటించారు. వై.ఎస్.ఆర్.సి. వాళ్లు ఆయనకు ఎదురు నిలబడి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని పవన్ ప్రశ్నించారు.
2019-03-21బీజేపీలో కురువృద్ధుడు అద్వానీ శకం ముగిసింది. 2014 ఎన్నికల తర్వాత నామమాత్రంగా మిగిలిన అద్వానీకి 2019 ఎన్నికల్లో సీటు కూడా కేటాయించలేదు. ఆయన ప్రాతినిధ్యం వహించిన గాంధీ నగర్ లోక్ సభ స్థానం ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పరమైంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అమిత్ షా ప్రత్యక్షంగా ఎన్నిక కావడం కోసం అద్వానీ సీటును ఎంచుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికలకోసం బీజేపీ గురువారం ప్రకటించిన తొలి జాబితాలో ఈ మార్పు చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 184 మంది అభ్యర్ధుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
2019-03-212014లో రాష్ట్రాన్ని విభజించి తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పినట్టే... 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటూ దక్కకుండా చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు విన్నవించారు. విభజన చట్టాన్ని అమలు చేయని మోదీ, మనకు రావలసిన ఆస్తులను పంచని కేసీఆర్ లతో జగన్ కుమ్మక్కయ్యారని చంద్రబాబు విమర్శించారు. బుధవారం కృష్ణా జిల్లా నూజివీడులో ఎన్నికల సభలో చంద్రబాబు మాట్లాడారు. అగ్రరాజ్యం అమెరికా సైన్యాన్ని వియత్నాం ప్రజలంతా కలసి తరిమినట్టుగా... కేసీఆర్, నరేంద్ర మోదీ, జగన్ కూటమిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
2019-03-20