ఐదేళ్ళ పాలన తర్వాత చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయ్యారని, అదే సమయంలో అత్యంత పేద రైతులు రాష్ట్రంలోనే ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. ‘‘బాబు వస్తే జాబు వస్తుందన్నారు. చంద్రబాబు కొడుకుకు మాత్రం ఉద్యోగం వచ్చింది. ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రమోషన్ ఇచ్చి మంత్రిని చేశాడు. దీన్నే ‘మీ భవిష్యత్తుకు తన భరోసా’ అని చెబుతాడు’’ అని జగన్ శనివారం కర్నూలు, అనంతపురం ఎన్నికల సభల్లో విమర్శించారు. బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా? ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా? అని ప్రశ్నించారు.
2019-03-30తాము అధికారంలోకి వస్తే ‘‘నీతి ఆయోగ్’’ సంస్థను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. ప్రధాని మోదీ మార్కెటింగ్ కోసం ప్రెజెంటేషన్లు చేయడం, గణాంకాలను వక్రీకరించడం తప్ప ఆ సంస్థ చేసిందేమీ లేదని శుక్రవారం ట్వీట్ చేశారు. నీతి ఆయోగ్ స్థానంలో.. ప్రముఖ ఆర్థికవేత్తలు, నిపుణులతోపాటు 100మంది సిబ్బంది ఉండేలా ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరిస్తామని రాహుల్ తెలిపారు. భారత ప్రథమ ప్రధాని ప్రారంభించిన ప్రణాళికా సంఘాన్ని నరేంద్ర మోదీ ప్రధాని కాగానే రద్దు చేసి ‘నీతి ఆయోగ్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
2019-03-30ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాదుల్లా మారారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రధాని కర్నూలు సభ తర్వాత ముఖ్యమంత్రి స్పందించారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ సహకరించలేదని, రాజధాని శంఖుస్థాపనకు పిలిస్తే మట్టి, నీళ్ళు ఇచ్చిపోయారని ధ్వజమెత్తారు. తనను యు టర్న్ బాబు అంటున్న మోడీ, 31 కేసుల్లో నిందితుడికి కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. ‘‘కోడికత్తి పార్టీ (వైఎస్ఆర్ కాంగ్రెస్)కి కేసీఆర్ డబ్బు పంపుతాడు. ఈయనా (మోదీ) పంపిస్తాడు’’ అని ఆరోపించారు.
2019-03-29ఏప్రిల్ 11న ప్రజలు వేసే ఓటుతో ఆంధ్రప్రదేశ్ లో సూర్యోదయం (SUN-Rise), కుమార అస్తమయం (SON-Set) ఒకేసారి జరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. శుక్రవారం కర్నూలు బహిరంగ సభలో మాట్లాడిన మోదీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ ని ఉద్ధేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘SUN అంటే సూర్యుడు.. SON అంటే కుమారుడు. ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో SUN రైజ్ అవుతుంది. రాసి పెట్టుకోండి... అవినీతి కుమార అస్తమయం చూస్తారు’’ అని మోదీ ఉద్ఘాటించారు. సూర్యోదయం కావాలంటే... కుమార అస్తమయం జరగాలా వద్దా? అని సభికులను ప్రశ్నించారు.
2019-03-29‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే అందరూ భయపడ్డారు. నేను భయపడను. ఏం చేస్తాడు.. చంపేస్తాడు..అంతే కదా! లేదంటే ఈడీతో దాడులు చేయిస్తాడు’’ అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రధానమంత్రి కర్నూలు సభలో చేసిన విమర్శలకు రాజమండ్రి రోడ్ షోలో చంద్రబాబు స్పందించారు. ఎన్నికలకు ముందు కర్నాటకలో మంత్రులు, కాంగ్రెస్ నేతల ఇళ్ళపైన ఐటీ దాడులు చేయించారని, ఏపీలో తెలుగుదేశం నాయకులపై మళ్లీ పడతారని వార్తలు వస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు.
2019-03-29రాజధాని అమరావతి పేరిట అమరేశ్వరస్వామి భూములు కొల్లగొట్టారని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబునాయుడుపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు. రాజధాని ఏదంటే గ్రాఫిక్స్ చూపిస్తున్నారని, ఆ ప్రాంతంలో 40 దేవాలయాలు కూల్చేశారని విమర్శించారు.
2019-03-29 Read Moreఅవినీతి, బలహీనమైన పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ తిరోగమనంలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో విమర్శించారు. ప్రధానమంత్రి ట్విట్టర్ హ్యాండిల్ పై శుక్రవారం ఉదయం తెలుగులో కొన్ని సందేశాలు దర్శనమిచ్చాయి. తెలంగాణ, ఆంధ్ర పర్యటనలకు వస్తున్న సందర్భంగా ఉభయ రాష్ట్రాల ప్రజలను ఉద్ధేశించి ఈ ట్వీట్లు పెట్టారు. సాయంత్రం కర్నూలులో ఒక సభలో మాట్లాడనున్నట్టు ప్రధాని తెలిపారు. మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలి మోసపూరితంగా పాలిస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
2019-03-29 Read Moreవారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఉద్ఘాటించారు. శుక్రవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘వారసత్వ రాజకీయాలు నా సమస్య కాదు. అవి దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదం’’ అని మోదీ వ్యాఖ్యానించారు. రాఫేల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని విమర్శిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలను దుయ్యబట్టారు. బాలాకోట్ వైమానిక దాడులను ప్రశ్నించడం మూర్ఖత్వమని మోదీ మండిపడ్డారు.
2019-03-29‘రాజకుమారుడు’ అంటూ రాహుల్ గాంధీని ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు అభివర్ణిస్తుంటారు. అయితే, వారసత్వ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీతో బీజేపీ పోటీ పడుతోందని ఓ అధ్యయనం తేల్చింది. 1999 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున 36 మంది వారసులు ఎంపీలుగా ఎన్నికైతే, బీజేపీ నుంచి 31 మంది ఎంపికయ్యారు. 2009లో కాంగ్రెస్ (11 శాతం)ను బీజేపీ (12 శాతం ఎంపీలు) మించిపోయింది. 1952 నుంచి ఎన్నికైన 4,807 మంది ఎంపీల సమాచారాన్ని హార్వర్డ్, మన్హేమ్ యూనివర్శిటీల పరిశోధకులు క్రోడీకరించారు.
2019-03-29 Read Moreబీజేపీ ఎంపీ, నటుడు శత్రుఘ్న సిన్హా గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఏప్రిల్ 6వ తేదీన ఆయన కాంగ్రెస్ పార్టీలో లాంఛనంగా చేరనున్నటక్టు సమాచారం. గత ఎన్నికల్లో బీహార్ లోని పాట్నా సాహిబ్ లోక్ సభ స్థానంనుంచి బీజేపీ తరపున ఎన్నికైన సిన్హాకు ఈసారి సీటు ఇవ్వలేదు. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇప్పుడు సిన్హా కాంగ్రెస్ తరపున మహాకూటమి అభ్యర్ధిగా ‘పాట్నాసాహిబ్’ నుంచే పోటీ చేయబోతున్నారు.
2019-03-28