ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘‘ఫాసిస్టు’’, ‘‘మతోన్మాది’’, ‘‘అల్లర్ల కారకుడు’’, ‘‘పేదల వ్యతిరేకి’’ అంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం సిలిగురిలో ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా స్పందించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ కాలపరిమితి ముగిసిన విషయాన్ని గుర్తు చేస్తూ... మోదీ ‘కాలం చెల్లిన బాబు’ అని మమత పదే పదే వ్యాఖ్యానించారు. అక్కడ సిలిగురిలో మోదీ ప్రసంగం సగంలో ఉండగానే ఉత్తర బెంగాల్ లోని దిన్హాతాలో తన ప్రసంగాన్ని మమత ప్రారంభించారు.

2019-04-03 Read More

అత్త, ఆమె మేనల్లుడు కలసి రాష్ట్రాన్ని నాశనం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని దుయ్యబట్టారు. బెంగాల్ లోని సిలిగురిలో మోదీ బీజేపీ ఎన్నికల సభలో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో వేగవంతంగా అభివృద్ధి చేసి చూపించగలిగానని, బెంగాల్ లో మాత్రం మమత ఆటంకంగా మారారని ప్రధాని ఆరోపించారు. మమతను ‘‘స్పీడ్ బ్రేకర్ దీదీ’’గా వ్యవహరించిన మోదీ, ఆమెను అధికారంనుంచి తొలగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

2019-04-03 Read More

‘‘32 సంవత్సరాల తర్వాత... అరుణాచల్ ప్రదేశ్ లోని నాలుగు పోలీసు స్టేషన్ల పరిధిలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. బీజేపీ ఆ పని చేస్తే అది దేశభక్తి. ఇతరులెవరైనా ఆ విషయమై ఆలోచన చేసినా, మాట్లాడినా వారు సాయుధ బలగాలకు వ్యతిరేకులు, జాతి వ్యతిరేకులు. అబద్ధాల ప్రపంచానికి స్వాగతం’’ అని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా బుధవారం విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రత్యేక అధికారాల చట్టంపై పేర్కొన్న అంశాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టిన నేపథ్యంలో సిన్హా ట్విట్టర్ ద్వారా స్పందించారు.

2019-04-03

ప్రధానమంత్రి ‘మోడీ’ పనికిమాలినవాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఆ మోడీ..ఇక్కడ కోడికత్తి (వైసీపీ) జోడీ అయ్యారని, వారికి కేసీఆర్ తోడయ్యారని దుయ్యబట్టారు. నరేంద్ర మోడీ, మహారాష్ట్ర ప్రభుత్వం, కేరళ కియా మోటార్ పరిశ్రమకోసం ప్రయత్నించినా ఆంధ్రప్రదేశ్ కు తెచ్చానని చంద్రబాబు గర్వంగా చెప్పారు. మోడీ వల్లకానిది రాష్ట్రంలో కోడికత్తి పార్టీ వల్ల ఏమవుతుందని ప్రశ్నించారు. ‘మనం అన్ని ప్రయోజనాలను నేరుగా చేస్తుంటే.. ఇప్పుడు గ్రామానికి పదిమందిని పెడతానంటున్నాడు. ఎందుకు.. కోడి ఈకలు పీకడానికా’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

2019-04-03

జయంతికి, వర్ధంతికి తేడా తెలియని నారా లోకేష్ కు మూడు మంత్రిత్వ పదవులు ఇవ్వడం చంద్రబాబు పుత్రవాత్సల్యానికి నిదర్శనం కాదా? అని వైఎస్ షర్మిల పశ్నించారు. కృష్ణా జిల్లా నూజివీడులో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచార సభలో షర్మిల మాట్లాడారు. ‘వెనకటికి ఒకడు అక్షరం ముక్క రాకపోయినా అగ్ర తాంబూలం కావాలన్నాడట. అలా ఒక్క ఎన్నికల్లో కూడా గెలవని లోకేష్ కు మూడు పదవులు’ అని ఎద్దేవా చేశారు.

2019-04-02

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ‘బాహుబలి’ సినిమాలో ‘భల్లాలదేవుడు (విలన్)’తో పోల్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎలాగైనా అధికారంలో ఉండటానికి వంచనలు, కుట్ర రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్ధతు ఇస్తున్నా పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని మోదీ డిమాండ్ చేశారు. యు-టర్న్ బాబు పోలవరం ప్రాజెక్టును ‘ఎటిఎం’లా ఉపయోగించుకుంటున్నారని మోదీ ఆరోపించారు.

2019-04-01 Read More

జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం, అధ్యక్ష ప్రధానమంత్రులు ఉండాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. గడియారాన్ని 1953కు తిప్పుతారా? అని అబ్దుల్లాను, ఆయన మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు (1953కు ముందు కాశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని ఉండేవారు). తన మిత్రపక్షం వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని మోదీ డిమాండ్ చేశారు. తెలంగాణ ఎన్నికల సభలో ప్రధాని ఈ అంశాన్ని ప్రస్తావించారు.

2019-04-01 Read More

ఇండియాలో విలీనమైనప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక గుర్తింపుపై కుదిరిన ఒప్పందాన్ని తిరిగి అమలు చేయవలసి ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కాశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక ప్రధానమంత్రి, అధ్యక్షుడు ఉండాలని ఉద్ఘాటించారు. దేశంలోని సంస్థానాలు భారత యూనియన్ లో విలీనం కావడానికి ఎలాంటి షరతులు లేవని, అయితే కాశ్మీర్ విలీనం భిన్నమైనదని ఒమర్ గుర్తు చేశారు. 1947లో రాజా హరిసింగ్ పెట్టిన ‘విలీన షరతుల’ పునరుద్ధరణకే తమ పార్టీ కట్టుబడి ఉందని బందిపొరాలో జరిగిన ఒక సభలో ఒమర్ స్పష్టం చేశారు.

2019-04-01

సోమవారం మరోసారి రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్ధేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. విభజన హామీలు అమలు చేయకుండా రాజమండ్రి వస్తున్న మోదీకి సిగ్గుందా? అని ప్రశ్నించారు. హామీ ఇచ్చిన విధంగా రాష్ట్రానికి ‘ప్రత్యేక కేటగిరి హోదా’ ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశ్నించారు. మోదీ రాష్ట్రానికి నమ్మకద్రోహం చేశారని, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అరకొరగా అమలు చేశారని మండిపడ్డారు. ఆదివారం తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

2019-03-31

చంద్రబాబు హయాంలో గత ఐదేళ్లలో ఆరు వేల స్కూళ్లు మూతపడ్డాయని, ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలే మిగలవని ప్రతిపక్ష నేత జగన్ ఉద్ఘాటించారు. ఊరూరా నారాయణ స్కూళ్లు వెలుస్తాయని, అక్కడ ఎల్.కె.జి. చదవాలన్నా లక్ష రూపాయలు కట్టవలసి వస్తుందని చెప్పారు. శనివారం అనంతపురం ఎన్నికల సభల్లో జగన్ మాట్లాడారు.

2019-03-30
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page