ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేశారు. ఎస్ఇసి గవర్నరుకు చేసిన ఫిర్యాదులో తమపై చేసిన వ్యాఖ్యలను ‘‘సభా హక్కుల ఉల్లంఘన’’గా మంత్రులు పేర్కొన్నారు. తనపైన మాటల దాడికి పాల్పడిన మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ‘లక్ష్మణ రేఖ’ను దాటారని నిమ్మగడ్డ శుక్రవారం గవర్నరుకు ఫిర్యాదు చేశారు. ఆయన లేఖలో తమను అవమానించే, బెదరించే మాటలు ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
2021-01-30 Read Moreపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం మొదటి దఫా నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం విడుదల చేశారు. పోలింగ్ ను నాలుగు దశలలో నిర్వహించడానికి కొద్ది రోజుల క్రితమే షెడ్యూలును ప్రకటించారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలను మినహాయించి 11 జిల్లాల్లో పోలింగ్ నిర్వహించాలని ఎస్ఇసి నిర్ణయించారు. అయితే, నిమ్మగడ్డ పదవీ విరమణ వరకు ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్న సిఎం జగన్.. అధికారులు, ఉద్యోగ సంఘాలను కట్టడి చేశారు.
2021-01-23కేంద్ర ప్రభుత్వం కోల్ కత లోని విక్టోరియా మెమోరియల్ వద్ద నిర్వహించిన ‘పరాక్రమ దివస్’లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. మమత ప్రసంగం సమయంలో కొందరు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయడంతో, ఆమె అవమానంగా భావించి నిరసన తెలిపారు. ఆహ్వానించి అవమానించొద్దంటూ.. ఇది ఒక పార్టీ కార్యక్రమం కాదని, ప్రభుత్వ కార్యక్రమమని మమత గుర్తు చేశారు. అవమానానికి నిరసనంగా తాను ఈ కార్యక్రమంలో మాట్లాడబోనంటూ వేదిక దిగిపోయారు. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేదికపైనే ఉన్నారు.
2021-01-23దేశంలోపల అనాగరిక యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. దేశీయ ఉగ్రవాదాన్ని, శ్వేత జాత్యహంకారాన్ని ఓడిస్తానని ప్రతిజ్ఞ చేసిన బైడెన్, తాను అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తానని ఉద్ఘాటించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ప్రసంగించారు. ఈరోజు తొలి మహిళ జాతీయ కార్యాలయ పదవికి ప్రమాణం చేస్తోందని, అందువల్ల మార్పులు రావని తనకు చెప్పవద్దని బైడెన్ పేర్కొన్నారు. ఐక్యత లేకపోతే శాంతి ఉండదని, ప్రపంచ వ్యాప్తంగా మిత్రులను పునరుద్ధరించుకుంటామని పేర్కొన్నారు.
2021-01-21అమెరికా నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత-అమెరికా సంబంధాల బలోపేతానికి జో బైడెన్ తో కలసి పని చేస్తానని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. బైడెన్ పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించిన మోదీ, ఉమ్మడి సవాళ్ళను ఎదుర్కోవడానికి, ప్రపంచ శాంతి-భద్రతల మెరుగుదలకు ఐక్యంగా ధృఢంగా ఉంటామని ట్వీటారు. ఇండియా- అమెరికా భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి బైడెన్ తో కలసి పని చేస్తామని మోదీ పేర్కొన్నారు.
2021-01-20ఇప్పటిదాకా అమెరికా విదేశాంగ మంత్రిగా వ్యవహరించిన మైక్ పాంపియో సహా 28 మంది అమెరికన్ ప్రముఖులపై చైనా బుధవారం ఆంక్షలు విధించింది. వారు, వారి కుటుంబాలు, సన్నిహితులు చైనాలో ప్రవేశించడాన్ని, వ్యాపారం చేయడాన్ని నిషేధించింది. నిషేధానికి గురైనవారిలో రాబర్ట్ ఒ బ్రియెన్, పీటర్ నవారో, స్టీవ్ బానన్ ఉన్నారు. తమ సార్వభౌమత్వాన్ని, భద్రతను తీవ్రంగా ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్టు చైనా పేర్కొంది. జో బైడెన్ ప్రమాణం చేసిన రోజే ట్రంప్ యంత్రాంగంలోని ప్రముఖులపై చైనా చర్యలు తీసుకోవడం గమనార్హం.
2021-01-20అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షునిగా డెమోక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కొద్ది రోజుల క్రితం ట్రంప్ మద్ధతుదారుల ముట్టడితో దద్ధరిల్లిన ప్రతినిధుల సభ భవనం కేపిటోల్ ఎదుట అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘జో’తో పాటు నూతన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రమాణం చేశారు. పదవీ కాలం ముగిసిన డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయన హయాంలో ఉపాధ్యక్షునిగా పనిచేసిన మైక్ పెన్స్ మాత్రం భార్యాసమేతంగా నూతన అధ్యక్షుని పదవీ స్వీకార ప్రమాణానికి హాజరయ్యారు.
2021-01-20అధ్యక్షుడిగా ఉండి అల్లర్లను ప్రేరేపించిన ఘనతను సొంతం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రికార్డులనూ సృష్టిస్తున్నారు. రెండోసారి అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడిగా అమెరికా చరిత్రలో నిలిచిపోబోతున్నారు. అంతే కాదు.. పదవీ కాలం ముగియడానికి కొద్ది రోజుల ముందు అభిశంసనకు గురవుతున్న అధ్యక్షుడూ ట్రంప్ మాత్రమే. తమ 45వ అధ్యక్షుడిపై అభిశంసనకు అమెరికా ప్రతినిధుల సభ బుధవారం సిద్ధమైంది. గత ఏడాది ఓసారి ట్రంప్ అభిశంసనకు గురయ్యారు.
2021-01-13 Read Moreప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు తనను బెదిరిస్తున్నారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మంగళవారం వెల్లడించారు. బెదిరించినవారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిమానులు అయి ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం రాజీపడటాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో బెదిరింపులు రావడం గమనార్హం. ఈ బెదిరింపులు చాలా చూశానన్న ఉండవల్లి, ప్రభుత్వం చేయవలసిన పనులు చేశాక తనను బెదిరించాలని ఎద్దేవా చేశారు. వైఫల్యాలపై చంద్రబాబును నిలదీసిన జగన్, ప్రభుత్వంలోకి వచ్చాక చేస్తున్నదేమిటని ప్రశ్నించారు.
2020-12-22జమ్మూ- కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసి రాష్ట్రాన్ని విభజించిన తర్వాత స్థానిక ఎన్నికలే కీలకమైన వేళ కేంద్రంలోని బిజెపికి ఎదురు దెబ్బ తగిలింది. జమ్మూ- కాశ్మీర్ జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని గుప్కార్ కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 20 జిల్లాల్లోని 280 సీట్లకు పోలింగ్ జరిగితే కూటమి 108 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బిజెపి 60, కాంగ్రెస్ 22 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బిజెపికి పట్టున్న జమ్మూ ప్రావిన్సులోనే 57 సీట్లలో ఆధిక్యం లభించింది. గుప్కార్ కూటమి ఇక్కడ 37, కాశ్మీర్ ప్రాంతంలో 71 సీట్లలో ముందుంది.
2020-12-22