40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మోదీ సిగ్గుమాలిన ఉపన్యాసానికిగాను ఆయనను 72 సంవత్సరాలపాటు నిషేధించాలని అఖిలేష్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు యోగి ఆదిత్యనాథ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలపై ఈసీ ‘72 గంటల నిషేధం’ విధించింది. ఈ నేపథ్యంలో... మోదీని 72 గంటలు కాదని, 72 సంవత్సరాల పాటు నిషేధించాలని అఖిలేష్ వ్యాఖ్యానించారు.

2019-04-30 Read More

పుదుచ్ఛేరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ రోజువారీ వ్యవహారాల్లో ఆ కేంద్ర పాలిత ప్రాంతపు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. 2017 జనవరి, జూన్ మాసాల్లో కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై విధించిన ఆంక్షలు పుదుచ్ఛేరికి వర్తించవని... దేశ రాజధాని ప్రాంతానికి, పుదుచ్ఛేరికి తేడా ఉందని స్పష్టం చేసింది. పుదుచ్ఛేరి రాష్ట్రం కాకపోయినా ఇక్కడి అసెంబ్లీ కూడా ఒక రాష్ట్ర అసెంబ్లీ పాటి అధికారాలు కలిగి ఉందని ఉద్ఘాటించింది.

2019-04-30 Read More

పశ్చిమ బెంగాల్ లోని 40 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బెంగాల్ లో జరిగిన ఓ ర్యాలీలో మోదీ మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో తాను విజయం సాధించగానే టీఎంసీ ఎమ్మెల్యేలు పార్టీ మారతారని మోదీ చెప్పారు. కొద్ది సీట్లతో ఢిల్లీని చేరుకోలేరని, అది చాలా దూరమని మమతా బెనర్జీని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. తన మేనల్లుడిని రాజకీయంగా ప్రతిష్ఠించడమే మమత అసలు లక్ష్యమని మోదీ పేర్కొన్నారు.

2019-04-29 Read More

‘‘విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసులను బంట్రోతుల కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబుగారూ..! ఇంతకూ రాంగోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. వివాదాస్పద ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ సినిమా ప్రెస్ మీట్ కోసం విజయవాడ వచ్చిన వర్మను పోలీసులు నిరోధించి హైదరాబాద్ తిప్పి పంపడంపై జగన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

2019-04-29 Read More

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఆడియో టేప్ ఒకటి శనివారం బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిబద్ధత లేదని, వారు తెలంగాణ ప్రజల్లా కాదని విజయసాయి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఎన్నికలకు ముందు తమ పార్టీ నేతలకు విజయసాయి జాగ్రత్తలు చెప్పడం, హెచ్చరికలు చేయడం ఆ టేపులో రికార్డయింది. ఆ క్రమంలోనే..‘‘మళ్ళీ ఆంధ్రావాళ్ల పెత్తనం వస్తుందంటే తెలంగాణ జనం అంతా ఏకమయ్యారు. ఆంధ్రా జనానికి అంత నిబద్ధత లేదు. అక్కడ కులాల సంఘర్షణను చంద్రబాబు ఉపయోగించుకుంటారు’’ అని విజయసాయి వ్యాఖ్యానించారు.

2019-04-06

నరేంద్ర మోదీ పోయేకాలం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలపై ఆదాయపన్ను శాఖ అధికారులు వరుసగా చేస్తున్న దాడులను శుక్రవారంనాటి ఎన్నికల సభల్లో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. మొన్న పుట్టా సుధాకర్ యాదవ్, ఇవ్వాళ గుంటూరులో నానిలపై ఐటీ దాడులు చేయడం కక్ష సాధింపులో భాగమని చంద్రబాబు ఆరోపించారు. ‘‘మోదీ.. నీ ఉద్యోగం శాశ్వతం కాదు. ప్రజలు నిన్ను చీకొట్టే రోజు వస్తుంది. అసహ్యించుకునే రోజు వస్తుంది’’ అని సిఎం మండిపడ్డారు.

2019-04-05

గుజరాత్... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం. జనాభాలో ముస్లింలు 9.5 శాతం. కానీ, గత 30 సంవత్సరాలుగా ఒక్క ముస్లిం కూడా లోక్ సభకు ఎన్నిక కాలేదు. గుజరాత్ లో ముస్లింలు సామాజికంగానే కాకుండా రాజకీయంగా కూడా వివక్షకు గురయ్యారని ఓ విశ్లేషణను టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ రాష్ట్రం నుంచి లోక్ సభకు ఎన్నికైన చివరి వ్యక్తి అహ్మద్ పటేల్ (1984). 1989లో పటేల్ బీజేపీ అభ్యర్ధిపై ఓడిపోయాక మళ్లీ ఇంతవరకు ఏ ముస్లిం కూడా గెలవలేదు. తొలి లోక్ సభ ఎన్నికల (1962) నుంచీ ముస్లింల ప్రాతినిధ్యం తక్కువే.

2019-04-05 Read More

‘‘నా జీవితానికి మార్గదర్శక సూత్రం.. మొదట దేశం, తర్వాత పార్టీ, చివరిగా వ్యక్తిగతం. ఏ పరిస్థితుల్లోనైనా ఈ సూత్రానికే కట్టుబడి ఉండటానికి ప్రయత్నించాను. అలాగే కొనసాగుతాను’’ అని బీజేపీ సీనియర్ మోస్ట్ నేత ఎల్.కె. అద్వానీ ఉద్ఘాటించారు. 6వ తేదీన బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అద్వానీ రాసిన వ్యాసంలో అనేక వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్ధేశించి చేసినట్టుగా విశ్లేషణలు వెల్లువెత్తాయి. సత్యం, రాష్ట్ర నిష్ఠ, పార్టీలోనూ వెలుపలా ప్రజాస్వామ్యం అనే మూడు అంశాలు బీజేపీ వికాసానికి దోహదపడ్డాయని అద్వానీ స్పష్టం చేశారు.

2019-04-04

తన పార్టీ ఎప్పుడూ రాజకీయంగా విభేదించేవారిని ‘‘జాతి వ్యతిరేకులు’’గా లేదా ‘‘శత్రువులు’’గా భావించలేదని, వారిని ప్రత్యర్ధులుగా మాత్రమే చూశామని బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ ఉద్ఘాటించారు. బీజేపీ వ్యవస్థాపకులలో ఒకరైన 91 సంవత్సరాల అద్వానీ, ఏప్రిల్ 6వ తేదీన బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఓ వ్యాసం రాశారు. ‘‘భిన్నత్వానికి గౌరవం, భావప్రకటనా స్వేచ్ఛ భారత ప్రజాస్వామ్యపు స్వభావాలు’’ అని అద్వానీ పేర్కొన్నారు. వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ ప్రతి పౌరుడికీ ఉన్న ‘ఎంపిక స్వేచ్ఛ’కు పార్టీ కట్టుబడి ఉండేదని నొక్కి చెప్పారు.

2019-04-04 Read More

‘‘చంద్రబాబు గారి ప్రక్కన గంట కొట్టి భూకబ్జాలు చేసే గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఉంటారు. జగన్ ప్రక్కన క్రిమినల్స్ ఉంటారు. పవన్ కళ్యాణ్ ప్రక్కన జేడీ లక్ష్మీనారాయణ లాంటి నిజాయితీపరులు ఉంటారు’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న పవన్, గురువారం అక్కడ జరిగిన ‘‘ఎన్నికల యుద్ధ శంఖారావం’’ సభలో మాట్లాడారు. విశాఖపట్నం లోక్ సభ జనసేన అభ్యర్ధి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఈ సభలో ఉన్నారు.

2019-04-04
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page