1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై ప్రవాస కాంగ్రెస్ చీఫ్ శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా ఉన్నాయని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. గురువారం శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పాలని రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.1984 బాధితులకు న్యాయం జరగాలని, ఆ అల్లర్లకు బాధ్యులైనవారికి శిక్ష పడాలని ఉద్ఘాటించారు. ‘‘1984 ఓ భయానక విషాదం. ఎప్పుడూ జరగకుండా ఉండాల్సింది. అందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ క్షమాపణ చెప్పారు. మా తల్లి సోనియా గాంధీ క్షమాపణ చెప్పారు’’ అని రాహుల్ పేర్కొన్నారు.

2019-05-10 Read More

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 10వ తేదీన నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంతకు ముందు నిర్ణయించారు. అయితే, కేబినెట్ సమావేశానికి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవలసి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. కేబినెట్ ఎజెండా ఏమిటో తెలియజేయాలని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కోరారు. దీంతో ఎజెండాను సీ.ఎస్.కు పంపారు. తగినంత సమయం ఉండాలనే ఉద్ధేశంతో సమావేశాన్ని 14వ తేదీకి వాయిదా వేసినట్టు సమాచారం.

2019-05-07

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిశారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలని పదే పదే చెబుతున్న కేసీఆర్... ఈ విషయమై వామపక్ష నేతతో భేటీ కావడం ఇదే తొలిసారి. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలను... ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను ఒకే గొడుకు కిందకు తేవడంపై కేసీఆర్ ఈ సందర్భంగా చర్చించినట్టు సమాచారం. అంతకు ముందే కేసీఆర్ కుటుంబ సమేతంగా అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించారు.

2019-05-06

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సోమవారం జరగనుంది. 195 జడ్పీటీసీ, 2097 ఎంపీటీసీ స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగాల్సి ఉండగా వాటిలో రెండు జడ్పీటీసీలు, 69 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 539 జడ్పీటీసీ, 5857 ఎంపీటీసీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 1,56,55,897గా ఉంది. తొలి విడత ఎంపీటీసీ స్థానాలకు 7072 మంది, జడ్పీటీసీ స్థానాలకు 882 మంది పోటీ పడుతున్నారు. ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ జరుగుతుంది.

2019-05-06 Read More

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దక్షిణాది రాష్ట్రాల యాత్రకు సిద్ధమయ్యారు. గత ఏడాది ‘ఫెడరల్ ఫ్రంట్’కోసం పలువురు నేతలను కలసిన కేసీఆర్, లోక్ సభ ఎన్నికలు ముగింపు దశకు వస్తున్నవేళ రాష్ట్రాలవారీగా నేతలతొ భేటీ కానున్నారు. సోమవారం కేరళతో మొదలు పెట్టి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఆ తర్వాత తూర్పు, ఉత్తర భారత దేశాలకు కూడా ఆయన వెళ్తారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ త్రివేండ్రంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో సమావేశం కానున్నారు.

2019-05-06

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 10వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎల్.వి. సుబ్రహ్మణ్యం) తనకు రిపోర్టు చేయడంలేదంటూ ఇటీవల మండిపడిన సిఎం, బిజినెస్ రూల్స్ అతిక్రమించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్ సమావేశాలు, అధికారులతో సమీక్షలూ ఏర్పాటు నిర్వహిస్తుంటే పట్టించుకోని ఈసీ... తనను మాత్రం అడ్డుకుంటోందని చంద్రబాబు ఆక్షేపిస్తున్నారు.

2019-05-05

తన తండ్రి రాజీవ్ గాంధీని ‘నెంబర్ 1 అవినీతిపరుడు’గా వ్యవహరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం బదులిచ్చారు. ‘‘మోదీ జీ, యుద్ధం ముగిసింది. మీ కర్మఫలం ఎదురు చూస్తోంది. మీపైన మీకున్న అంతర్గత అభిప్రాయాన్ని నా తండ్రిపైకి నెట్టేయడం మిమ్మల్ని కాపాడలేదు’’ అని రాహుల్ ఉద్ఘాటించారు. ఎన్నికల సభల్లో మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించారు.

2019-05-05 Read More

రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో తన ప్రతిష్ఠను దెబ్బకొట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధానమంత్రి మోదీ శనివారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మీ నాన్నను ఆస్థానంలోని వారు ఆయనను మిస్టర్ క్లీన్ అన్నారు. కానీ, మీ నాన్న నెంబర్ 1 అవినీతిపరుడిగా జీవితాన్ని చాలించారు’’ అని మోదీ రాహుల్ గాంధీని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడం ద్వారా దేశంలో బలహీన, అస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ఆరోపణ చేశారు.

2019-05-04 Read More

థాయ్ లాండ్ 10వ రాజుగా మహా వజ్రలోంగ్ కోర్న్ శనివారం పట్టాభిషిక్తులయ్యారు. మూడు రోజుల పట్టాభిషేక ఉత్సవాల్లో తొలి రోజైన సోమవారం శుద్ధి కార్యక్రమాన్ని 76 ప్రావిన్సులనుంచి తెచ్చిన నీటితో చేపట్టారు. ఆ తర్వాత నూతన రాజు 7 కేజీల కిరీటాన్ని ధరించి తొమ్మిదంచెల గొడుకు కింద సింహాసనంపై ఆశీనులయ్యారు. బ్యాంగ్ కాక్ వీధుల్లో రాచపల్లకిపై ఊరేగారు. 2016లో తండ్రి మరణించిన తర్వాత మూడేళ్ళకు మహా వజ్రలోంగ్ కోర్న్ రాజుగా అవతరించారు. ఈ కార్యక్రమానికి రెండు రోజుల ముందు తన అంగరక్షికినే వివాహం చేసుకున్నారు.

2019-05-04 Read More

ఎన్నికల నిబంధనవాళి పేరు చెప్పి ఉద్యోగ నియమావళిని ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ‘ఫని’ తుపాను సహాయ చర్యలపై విలేకరుల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సిఎం బదులిచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సమీక్షలు చేసే అధికారం లేదని, అధికారులు తమకు రిపోర్టు చేయకూడదని ఎన్నికల నిబంధనావళిలో ఎక్కడుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వచ్చే వారం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నానని, చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

2019-05-03
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page