ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మంగళవారం అమరావతి సచివాలయంలో సమావేశమైంది. రాష్ట్ర విభజనానంతరం 2014లో ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇది 108వ సమావేశం. ఫని తుపాను, అకాల వర్షాలు, కరువు, ఉపాధి హామీ పథకం పనులు, తాగునీటి సమస్య వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించింది. తుపాను నష్టం, ప్రజలకు చెల్లించాల్సిన పరిహారం వంటి అంశాల్లో అధికారులు రూపొందించిన అంచనాలను మంత్రివర్గం పరిశీలించింది. కరువు మండలాల్లో చెల్లించాల్సిన పరిహారం విషయమై కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని సిఎం సూచించారు.

2019-05-14

ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) సీనియర్ నేత దొరై మురుగన్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుసుకున్నారు. తెలంగాణ సిఎం కేసీఆర్ చెన్నై వెళ్లి డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ తో సమావేశమైన మరుసటి రోజే.. కీలక నేత దొరై మురుగన్ అమరావతికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రత్యామ్నాయం కోసమంటూ కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు తిరుగుతుండగా.. ప్రస్తుతం మూడో ప్రత్యమ్నాయం కుదరదని స్టాలిన్ తేల్చి చెప్పారు.

2019-05-14

తెలుగుదేశం పార్టీ వార్షిక మహాసభ ‘‘మహానాడు’’ను 2019లో నిర్వహించరాదని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు జాతీయ స్థాయిలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ‘‘మహానాడు’’ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని చంద్రబాబు భావించారు. సాధారణంగా మే 27,28,29 తేదీలలో ‘‘మహానాడు’’ నిర్వహిస్తుంటారు. ఈసారి ఎన్నికల ఫలితాలకు, మహానాడు తేదీలకు నాలుగు రోజులు కూడా వ్యవధి ఉండటంలేదు. ఫలితాల తర్వాత చంద్రబాబు జాతీయ స్థాయిలో బీజీ కానున్నారని టీడీపీ చెబుతోంది.

2019-05-14

ఈసీ అనుమతితో మంగళవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కాబోతోంది. మంత్రివర్గంలో చర్చించాలనుకున్న అంశాలతో ఓ వినతిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపగా సోమవారం రాత్రికి అనుమతి లభించింది. వెంటనే ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం ఓ ప్రకటన చేశారు. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశమయ్యే మంత్రివర్గం... ‘‘ఫని’’ తుపాను ఉపశమన కార్యకలాపాలు, కరువు, వేసవిలో తాగునీటి పరిస్థితి, జాతీయ ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై సమీక్షిస్తుందని సీఎస్ తెలిపారు.

2019-05-13

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నుంచి పూర్తిగా అమరావతికి మారుతోంది. ఇప్పటిదాకా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచే తన కార్యకలాపాలను జగన్మోహన్ రెడ్డి సాగించారు. ఇటీవల తాడేపల్లిలో ఇల్లు, ఆఫీసుకోసం భవనాలు నిర్మించుకున్నారు. ఫిబ్రవరిలో భవన ప్రవేశం కూడా జరిగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ నుంచి రాష్ట్ర కార్యాలయ ఫర్నిచర్ ను తాడేపల్లికి తరలిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

2019-05-13

‘‘స్వతంత్ర భారత తొలి తీవ్రవాది ఓ హిందువు’’ అని మక్కల్ నీతి మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ అధినేత, సినీ నటుడు కమల్ హసన్ వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మా గాంధీని 1948లో హత్య చేసిన నాథురాం గాడ్సేను తొలి తీవ్రవాదిగా కమల్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తమిళనాడులోని అరవకురిచిలో ఎన్నికల సభలో కమల్ మాట్లాడారు. తాను మాట్లాడుతున్నది ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో కావడంవల్ల ఈ మాట చెప్పడంలేదని, గాంధీ విగ్రహం ముందు ఈ మాట చెబుతున్నానని కమల్ స్పష్టం చేశారు.

2019-05-13 Read More

ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే లక్ష్యంతో వివిధ రాష్ట్రాల ముఖ్య నేతలను కలుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు... సోమవారం చెన్నైలో డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ తో భేటీ కానున్నారు. ఇందుకోసం కొంతమంది టీఆర్ఎస్ నేతలతో కలసి కేసీఆర్ ఆదివారం సాయంత్రమే ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. గత వారం కేరళ వెళ్లిన కేసీఆర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ ను కలసిన సంగతి తెలిసిందే. గతంలో జెడి(ఎస్), టీఎంసీ, బీజేడీ తదితర పార్టీల అధినేతలను కేసీఆర్ కలిశారు.

2019-05-13 Read More

‘‘భారత ప్రధాన విభజనకారుడు’’ అనే శీర్షికతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ‘‘టైమ్’’ పత్రిక ప్రచురించిన కథనానికి బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆ కథనం... మోదీ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి చేసిన ఓ ప్రయత్నమని, రాసిన జర్నలిస్టు పాకిస్తానీ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా దుయ్యబట్టారు. ప్రముఖ ఇండియన్ జర్నలిస్టు తవ్లీన్ సింగ్, లేటు పాకిస్తానీ రాజకీయవేత్త సల్మాన్ తశీర్ కుమారుడైన ఆతిష్ తశీర్ ‘‘టైమ్’’ తాజా కథనాన్ని రాశారు. ఆ రచయిత పాకిస్తానీ ఎజెండాను ఫాలో అవుతున్నారని సంబిత్ ఆరోపించారు.

2019-05-11

మహాకూటమిలోని నేతలు వరదల్లో వచ్చే పాములు, కప్పలు, తేళ్ళలా ప్రవర్తిస్తున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ను ఔరంగజేబుతో పోల్చారు. తండ్రిని జైల్లో పెట్టిన ఔరంగజేబు తరహాలో తండ్రిని పదవినుంచి దించిన వ్యక్తి (అఖిలేష్) బద్ధ శత్రువు (మాయావతి)తో చేతులు కలిపాడని, మే 23 తర్వాత వాళ్లిద్దరూ ఒకరినొకరు ధూషించుకుంటారని యోగి శనివారం ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.

2019-05-11 Read More

2002 గుజరాత్ అల్లర్ల తర్వాత నరేంద్ర మోదీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించాలని అప్పటి ప్రధానమంత్రి వాజపేయి నిర్ణయించారని అప్పట్లో ఆయన మంత్రివర్గంలో ఉన్న యశ్వంత్ సిన్హా తాజాగా చెప్పారు. మోదీని తొలగిస్తే తాను కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేస్తానని ఉపప్రధాని ఎల్.కె. అద్వానీ బెదిరించడంవల్ల వాజపేయి తన నిర్ణయాన్ని మార్చుకున్నారని సిన్హా వెల్లడించారు. శుక్రవారం సిన్హా భోపాల్ లో ‘‘మీట్ ద ప్రెస్’’లో మాట్లాడుతూ... మోదీ రాజీనామా చేయకపోతే గుజరాత్ ప్రభుత్వాన్నే డిస్మిస్ చేయాలని వాజపేయి భావించారని తెలిపారు.

2019-05-10 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page