ఐదేళ్లలో తొలిసారి ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో కనిపించిన మోదీ, ఒక్క ప్రశ్నకు కూడా బదులివ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యబాణం సంధించారు. ‘‘అభినందనలు మోదీ జీ. అద్భుతమైన ప్రెస్ కాన్ఫరెన్స్!.. ఇంకోసారి మీరు రెండు ప్రశ్నలకు బదులివ్వడానికి మిస్టర్ షా అవకాశం ఇవ్వొచ్చు. వెల్ డన్’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. శుక్రవారం తుది దశ పోలింగ్ ప్రచార గడువు ముగిశాక నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోదీని అడిగిన ప్రశ్నలకూ అమిత్ షా బదులిచ్చారు.

2019-05-17 Read More

గాంధీ హంతకుడిని దేశభక్తుడని పొగిడిన బీజేపీ భోపాల్ అభ్యర్ధి ‘‘ప్రగ్యాఠాకూర్ గెలిస్తే... ఆమెను స్వాగతిస్తారా లేక బహిష్కరిస్తారా?’’... ఐదేళ్ళ పదవీకాలంలో తొలిసారి ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో కనిపించిన ప్రధానమంత్రి మోదీని ఓ విలేకరి అడిగిన ప్రశ్న ఇది. అయితే, ఆయన దీనికి సమాధానం చెప్పలేదు. ప్రగ్యాకు షోకాజ్ నోటీసు ఇచ్చామని, ఆమె సమాధానాన్ని బట్టి పార్టీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బదులిచ్చారు.

2019-05-17

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక దాదాపు ఐదేళ్ళకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల ఏడో దశ ప్రచారం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోదీ పాల్గొన్నారు. అమిత్ షా, మోదీ మాట్లాడిన తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికీ ప్రధానమంత్రి బదులివ్వలేదు. సమావేశం నిర్వహించిన అమిత్ షా మాత్రమే జవాబులిచ్చారు. ఒక ప్రధానమంత్రి తన పదవీ కాలం మొత్తంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించకపోవడం ఇదే తొలిసారి.

2019-05-17 Read More

న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో అమెరికా అధ్యక్ష పీఠం రేసులోకి దిగారు. డెమాక్రాటిక్ పార్టీ తరపున అభ్యర్ధుల రేసులో తాను ఉంటానని గురువారం ఆయన ప్రకటించారు. అమెరికాలోని అతి పెద్ద నగరానికి రెండుసార్లు మేయర్ గా పని చేసిన బిల్, ‘‘పని చేసే ప్రజలే ముందు’’ అనే భావనతో ప్రచార వీడియోను విడుదల చేశారు. ‘‘ప్రపంచంలో చాలా ధనం ఉంది. ఈ దేశంలో చాలా ధనం ఉంది. అయితే, అది తప్పుడువ్యక్తుల చేతుల్లో ఉంది’’ అని బిల్ పేర్కొన్నారు.

2019-05-16 Read More

బెంగాలీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ‘‘భారీ విగ్రహం’’ పంచలోహాలతో తయారు చేయించి ప్రతిష్ఠిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రకటించారు. మంగళవారం కోల్ కత నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా హింస చెలరేగి కొంతమంది దుండగులు విద్యాసాగర్ కళాశాలవద్ద విగ్రహాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే. గురువారం ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన మోదీ, విగ్రహ కూల్చివేత తృణమూల్ కాంగ్రెస్ గూండాల పనేనని ఆరోపించారు.

2019-05-16 Read More

మోదీ ప్రభుత్వ వైఫల్యాలనుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్రలో భాగంగానే.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. మొన్న అమిత్ షా ర్యాలీలో జరిగిన హింస నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రచార పర్వాన్ని ఈసీ కుదించడంపై మాయావతి మండిపడ్డారు. మమతకు మద్ధతుగా గళం విప్పారు. ‘‘ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో లోక్ సభ ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరగడంలేదని ఇప్పుడు స్పష్టమైంది’’ అని మాయావతి వ్యాఖ్యానించారు.

2019-05-16 Read More

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈసారి తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అస్సాంనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన్మోహన్ రాజ్యసభ సభ్యత్వం జూన్ 14తో ముగుస్తోంది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం తగ్గడంతో మన్మోహన్ ఈసారి వేరే రాష్ట్రాన్ని చూసుకోక తప్పడంలేదు. అయితే, కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం ఉన్న రాష్ట్రాల్లో ఇప్పట్లో ఖాళీ అయ్యే సీట్లు లేవు. తమిళనాట ఖాళీ అవుతున్న 6 రాజ్యసభ సీట్లలో 2 డిఎంకె గెలుచుకునే అవకాశం ఉంది. అందులో ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి డిఎంకె సిద్ధపడినట్టు సమాచారం.

2019-05-15 Read More

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కోల్ కతలో చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా ముగిసింది. విద్యాసాగర్ కళాశాల మీదుగా ర్యాలీ వెళ్తున్నప్పుడు కొంతమంది విద్యార్ధులు ‘‘అమిత్ షా గో బ్యాక్’’ అంటూ నినాదాలు చేశారు. వారిపైన దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు కళాశాల ఆవరణలోకి ప్రవేశించి మోటార్ సైకిళ్ళకు నిప్పు పెట్టారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ హింసకు బాధ్యత మీదేనంటూ అమిత్ షా, మమతా బెనర్జీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.

2019-05-14 Read More

కాంగ్రెస్, బీజేపీయేతర ‘‘సమాఖ్య సంఘటన’’ కోసమంటూ పలు రాష్ట్రాలు తిరుగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు తమిళనాట అనూహ్యమైన ఆహ్వానం లభించింది. సోమవారం చెన్నైలో డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ ను కలసిన కేసీఆర్ ‘ఫెడరల్ ఫ్రంట్’లో చేరాలని ఆహ్వానించారు. అయితే, తాము కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేస్తున్న విషయాన్ని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్ధిగా తానే ప్రతిపాదించిన విషయాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తు చేసినట్టు సమాచారం. కేసీఆరే తమతో కలసి రావాలని స్టాలిన్ కోరడం ఇక్కడ కొసమెరుపు.

2019-05-13 Read More

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్నికల సంఘం నియామకం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన సీనియర్ ఐఎఎస్ ఎల్.వి. సుబ్రహ్మణం ఈ మధ్య ఉప్పు-నిప్పుగా వ్యవహరించారు. అయితే, మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ చిటపటలు ఏమీ కనిపించలేదు. సిఎంకు అధికారాలు లేవన్న సిఎస్, బిజినెస్ రూల్స్ అతిక్రమిస్తున్నవారిపై చర్యలు ఉంటాయన్న సిఎం.. నవ్వుకుంటూ సామరస్యంగా సమావేశాన్ని నడిపించారు. ఈ భేటీ ఉభయతారకంగా జరిగేలా ఓ వాతావరణాన్ని ఇరుపక్షాలూ ముందే ఏర్పాటు చేసుకున్నాయి.

2019-05-14
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page