ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12;23 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ సహా పలువురు నేతలను ఆహ్వానించారు. మంగళవారం చంద్రబాబునాయుడుకు స్వయంగా ఫోన్ చేసిన జగన్, తన ప్రమాణ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

2019-05-28

లోక్ సభ ఎన్నికల్లో వైఫల్యం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్న రాహుల్ గాంధీకి డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ మంగళవారం ఫోన్ చేశారు. రాజీనామా చేయవద్దని స్టాలిన్ సూచించారు. ఎన్నికల్లో ఓడినా ప్రజల హృదయాలను గెలుచుకున్నారని రాహుల్ గాంధీకి స్టాలిన్ ప్రశంసించారు. డిఎంకె నాయకత్వంలోని కూటమి తమిళనాట విజయం సాధించినందుకు స్టాలిన్ ను రాహుల్ గాంధీ అభినందించారు.

2019-05-28 Read More

ఈ ఎన్నికల్లో తాను ఓడిపోయినా మళ్ళీ మంగళగిరిలోనే పోటీ చేస్తానని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మనసులు గెలిచానని వ్యాఖ్యానించారు. సోమవారం తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలతో లోకేష్ మాట్లాడారు. తాను పోటీ చేయడానికి మంగళగిరిని ఎంచుకోవడం సరికాదని చాలా మంది చెప్పారని, ఓడిపోయాక కూడా అదే అంటున్నారని, అయినా తాను ఇక్కడినుంచి పోటీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని లోకేష్ చెప్పారు.

2019-05-27

17వ లోక్ సభ తొలి సమావేశాలు జూన్ 6-15 తేదీల్లో జరిగే అవకాశాలున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో 17వ లోక్ సభ కొలువుదీరనుంది. ఈ నెల 31వ తేదీన జరిగే తొలి కేబినెట్ సమావేశంలో పార్లమెంటు సమావేశాల తేదీలను ఖరారు చేయవచ్చు. 30వ తేదీన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

2019-05-27 Read More

ఆంధ్రప్రదేశ్ నూతన సారథి జగన్మోహన్ రెడ్డికి ఆయన తండ్రి సహచరుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొన్ని సలహాలు ఇచ్చారు. 1. ప్రతి ప్రభుత్వ సమాచారమూ ప్రజలు చూసేలా ఇంటర్నెట్లో ఉంచడం (అధికారులు మాత్రమే పాస్ వర్డ్ లతో చూసే సమాచారంతో సహా) 2. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఎదుటా ఉద్యోగులు, అధికారుల జీతభత్యాల బోర్డులు పెట్టడం.. అందులో ఉన్నాయి. అవినీతి రహిత పాలనతో జగన్ 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఇలాంటి చర్యలు తప్పవని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

2019-05-27

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. శాసనసభలోని 175 స్థానాలకు గాను 151 చోట్ల గెలిచిన నేపథ్యంలో శనివారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం జరిగింది. కొత్త ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానంతో జగన్మోహన్ రెడ్డిని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. జగన్ పేరును సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా పిఎసి ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నేతలు ధర్మాన ప్రసాదరావు, పార్థసారధి, ఆదిమూలపు సురేష్ బలపరిచారు.

2019-05-25 Read More

గురువారం లోక్ సభ ఎన్నికల ఫలితాలు రానున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సభ్యులతో సమావేశమయ్యారు. మంగళవారం బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మిత్రపక్షాలకు చెందిన మంత్రులు కూడా హాజరయ్యారు. సమావేశంలో సహచర మంత్రులు మోదీకి పూలమాల వేసి అభినందనలు తెలిపారు. మంత్రులకు కృతజ్ఞత తెలపడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు బిజెపి తెలిపింది. రాత్రికి అమిత్ షా బిజెపి, మిత్రపక్షాల నేతలకు విందు ఏర్పాటు చేశారు.

2019-05-21 Read More

బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకోసం చురుగ్గా ప్రయత్నాలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఈ క్రమంలో ఆదివారం యుపిఎ ఛైర్ పర్సన్ సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఇందుకోసం చంద్రబాబు తొలిసారి 10 జన్ పథ్ వెళ్లారు. గత 3 రోజులుగా రాహుల్ గాంధీ, వామపక్షాల నేతలతో సహా పలుప్రాంతీయ పార్టీల నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. రాహుల్ గాంధీతో శని, ఆదివారాల్లో రెండుసార్లు సమావేశమయ్యారు. ఆ చర్చల సారాన్ని సోనియాగాంధీతో పంచుకున్నట్టు సమాచారం.

2019-05-19

‘‘మీరు షోలే సినిమాలో అస్రానీ పాత్ర చూశారా? అందులో ఆయన ఎప్పుడూ ‘బ్రిటిష్ వాళ్ల కాలంలో...’ అంటుంటాడు. అలాగే మోదీ జీ ఎప్పుడూ జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతుంటారు’’ అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ ఎన్నికల సభలో మాట్లాడిన ప్రియాంక, ‘‘గత ఐదేళ్లలో ఆయన (మోదీ) చేసిన పనిగురించి ఎందుకు మాట్లాడరు?’’ అని ప్రశ్నించారు.

2019-05-18 Read More

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ‘‘పరువు నష్టం’’ నోటీసు పంపించారు. ఈ నెల 15వ తేదీన మోదీ డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘‘అత్త, మేనల్లుడి జోడీకి రాష్ట్రాన్ని లూటీ చేయడంపైనే ఆసక్తి... దందా రాకెట్ ను నడుపుతున్నారు’’ అని ఆరోపించారు. డైమండ్ హార్బర్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ బెనర్జీ తిరిగి అక్కడినుంచే పోటీ చేస్తున్నారు.

2019-05-18 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page