అమిత్ షా కేంద్ర మంత్రివర్గంలో చేరతారని భావిస్తున్న తరుణంలో బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారన్న చర్చ మొదలైంది. అయితే, పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని అమిత్ షా భావిస్తున్నట్టు బుధవారం వార్తలు వచ్చాయి. మంత్రివర్గంలో అమిత్ షా చేరితే ముఖ్యమైన హోం, ఆర్థిక, రక్షణ శాఖల్లో ఏదో ఒకటి ఆయనకు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఆయన మంత్రివర్గంలో చేరతారా.. లేక బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతారా? లేక రెండు బాధ్యతలూ చేపడతారా? అన్నది తేలాల్సి ఉంది.
2019-05-30 Read Moreవైఎస్ జగన్ పదవీ ప్రమాణ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాజరు కాబోవడంలేదు. పార్టీ తరపున మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రేపు జగన్ నివాసంలో ఆయనను కలసి శుభాకాంక్షలు తెలపనున్నారు. రాజ్ భవన్ వంటి వేదికలపై కార్యక్రమం ఏర్పాటు చేస్తే చంద్రబాబు హాజరు కావడం హూందాగా ఉండేదని, కానీ బహిరంగ వేదికపై ప్రమాణం చేస్తున్నందున వెళ్ళడం సరి కాదని పార్టీ నేతలు వారించినట్టు సమాచారం.
2019-05-29గురువారం జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ స్వీకార ప్రమాణోత్సవానికి యుపిఎ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నట్టు సమాచారం. రేపు రాష్ట్రపతి భవన్ లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో మోదీ ప్రమాణ కార్యక్రమం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో పరుషమైన పదజాలంతో మోదీ మరణించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపైనా విమర్శలు చేయగా.. ఆయన కుమార్తె ప్రియాంకాగాంధీ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.
2019-05-29 Read More‘‘నువ్వు మారవు బాబూ’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ తన పదవీ ప్రమాణ కార్యక్రమానికి హూందాగా చంద్రబాబును ఆహ్వానిస్తే... దానికి వేరే కథ అల్లి వార్త రాయించుకున్నారని మండిపడ్డారు. బుధవారం విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు ఫోన్ చేసినప్పుడు తాను ప్రక్కనే ఉన్నానని, ‘‘మీరు అనుభవజ్ఞులు, మీ సలహాలు అవసరం’’ అనే మాటలను జగన్ వాడలేదని స్పష్టం చేశారు.
2019-05-29 Read Moreరెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపై రూ. 1.1 లక్షల చొప్పున అప్పుల భారం ఉందని ఆయన నెల్లూరులో మీడియాతో చెప్పారు. వైఎస్ జగన్ రాష్ట్ర ఆర్థిక స్థితిని గాడిలో పెడతారని ఆనం విశ్వాసం వ్యక్తం చేశారు. 2004లో కూడా చంద్రబాబు ఓటమిపాలైన నాటికి రాష్ట్రం సంక్షోభంలో ఉందన్నారు.
2019-05-29 Read Moreఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం పదవీ స్వీకార ప్రమాణం చేయనున్న వైఎస్ జగన్, బుధవారం వివిధ ప్రాంతాల్లో వివిధ విశ్వాసాలకు సంబంధించిన ఆలయాల్లో ప్రార్ధనలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం, కడప అమీన్ పీర్ దర్గా, పులివెందుల సి.ఎస్.ఐ. చర్చిలలో జగన్ ప్రార్ధనలు చేశారు. అనంతరం కడప జిల్లాలోనే ఇడుపులపాయలోని తండ్రి రాజశేఖరరెడ్డి సమాధి వద్దకు వెళ్ళి నివాళులు అర్పించారు.
2019-05-29తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) నేతగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియమితులయ్యారు. బుధవారం తన నివాసంలో జరిగిన ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం అనంతరం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ, రాజ్యసభలలో పార్టీ పక్ష నేతలుగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, వైఎస్ చౌదరి (సుజనా చౌదరి)లను చంద్రబాబు నియమించారు.
2019-05-292014, 19 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా పని చేసిన అరుణ్ జైట్లీ కొత్త మంత్రివర్గంలో తన పేరు చేర్చవద్దంటూ మోదీకి లేఖ రాశారు. తనకు ఆరోగ్యం బాగాలేనందున చికిత్స చేయించుకోబోతున్నట్టు జైట్లీ పేర్కొన్నారు. జైట్లీకి ఈసారి ఆర్థిక శాఖ దక్కదన్న వార్తల మధ్య తాజా పరిణామం జరిగింది. గత ప్రభుత్వంలోనే చివరి సంవత్సరం అరుణ్ జైట్లీ చికిత్స పేరు చెప్పి పీయూష్ గోయల్ కు ఆర్థిక శాఖను అప్పగించారు. జైట్లీ తిరిగి వచ్చాక కూడా గోయల్ ఆర్థిక శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు.
2019-05-29 Read Moreతెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికయ్యారు. బుధవారం చంద్రబాబు నివాసంలో శాసనసభా పక్ష సమావేశం జరిగింది. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు, లోక్ సభ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
2019-05-29‘‘చంద్రబాబును 10 శాతం ఇవిఎంలు మోసం చేస్తే 90 శాతం పార్టీ నేతలే మోసం చేశారు’’.. టీడీపీ నేత నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారా? సాక్షి టీవీ ప్రసారం చేసిన వార్త వాస్తవమా? కాదు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మంగళవారం గుంటూరులో జరిగిన సభలో చంద్రబాబునాయుడు సమక్షంలో ఓ మహిళా కార్యకర్త ఈ వ్యాఖ్యలు చేశారు. లోకేష్ మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు మహిళా కార్యకర్త మాటలను ‘‘సాక్షి’’ లోకేష్ కు ఆపాదించింది.
2019-05-28