తెలంగాణలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార టి.ఆర్.ఎస్. ఘన విజయాన్ని సాధించింది. ఎంపీటీసీ స్థానాల్లో 3,556, జడ్పీటీసీ స్థానాల్లో 446 టీఆర్ఎస్ వశమయ్యాయి. ఎంపీటీసీ స్థానాల్లో ఫర్వాలేదనిపించిన కాంగ్రెస్ జడ్పీటీసీలలో ఆ స్థాయి విజయాలను సాధించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి 1377 ఎంపీటీసీ స్థానాలు, 77 జడ్పీటీసీ స్థానాలు వచ్చాయి. ఇతరుల్లో బీజేపీకి 211 ఎంపీటీసీ, 8 జడ్పీటీసీ స్థానాలు లభించాయి. మిగిలిన పార్టీలు, ఇండిపెండెంట్లకు కలిపి 594 ఎంపీటీసీ, 5 జడ్పీటీసీ స్థానాలు వచ్చాయి.
2019-06-04దేశంలోని అన్ని స్కూళ్ళలో హిందీ బోధన తప్పనిసరి చేయాలన్న జాతీయ విద్యా విధానం 2019 డ్రాఫ్టులో నిపుణుల కమిటీ సవరణ చేసింది. విద్యార్ధులు తప్పనిసరిగా ఎంచుకోవలసిన భాషలను నిర్ధిష్టంగా పేర్కొన్న క్లాజును తొలగించి తాజా డ్రాఫ్టును అప్ లోడ్ చేసింది. అయితే, ‘త్రిభాషా నియమం’ అమలు చేయాలన్న సిఫారసును మాత్రం యధాతథంగా ఉంచింది. కస్తూరి రంగన్ కమిటీ కేంద్రానికి డ్రాఫ్టును సమర్పించాక తమిళనాడు నేతలు తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర సహా పలు ప్రాంతాల నేతలు గొంతు కలిపారు. ఈ నేపథ్యంలో పాక్షిక సవరణ చేశారు.
2019-06-03‘‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’’ పేరును ‘‘వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ’’గా మార్చాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఆదేశించారు. జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి సిఎంగా ఉండగా ప్రారంభమైన ఈ పథకానికి అప్పట్లో ‘‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’’గా నామకరణం చేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అది ‘‘ఎన్టీఆర్ ఆరోగ్యసేవ’’గా మారింది. జగన్ అధికారంలోకి రాగానే తండ్రి పేరు పెడుతున్నారు. ఆరోగ్య శ్రీ, 108 సేవలను ప్రక్షాళన చేయాలని, వాహనాలను పూర్తి స్థాయిలో పని చేయించాలని జగన్ హుకుం జారీ చేశారు.
2019-06-03హైదరాబాదులో ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం, శాసనసభ, పలు కమిషనరేట్లలో ఏపీ వాటా భవనాలు కూడా ఇక తెలంగాణవే! పదేళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని విభజన సమయంలో నిర్ణయించి కార్యాలయ భవనాలను పంచారు. అయితే, ఏపీ ప్రభుత్వం అమరావతికి తరలినందున హైదరాబాద్ భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన గవర్నర్ ఉత్తర్వులిచ్చారు.
2019-06-02పాకిస్తాన్ లోని భారత హై కమిషన్ శనివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వచ్చిన అతిధులను ఆ దేశ సెక్యూరిటీ సిబ్బంది వేధించారు. ఈ చర్య ఇరు దేశాల సంబంధాలను దెబ్బ తీస్తుందని ఇస్లామాబాద్ లోని భారత హై కమిషనర్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు. మే 27న ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషనర్ ఇచ్చిన ఇఫ్తార్ విందు సందర్భంగా భారత సెక్యూరిటీ సిబ్బంది తమను వేధించినట్టు ఇక్కడి అతిధులూ చెప్పారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఈ పరిణామాలకు కారణమయ్యాయి.
2019-06-02 Read Moreఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు మద్ధతు సమీకరించుకోవడంకోసం 20వ శతాబ్దపు ఫాసిస్టుల తరహాలో వ్యవహరిస్తున్నారని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ వ్యాఖ్యానించారు. సోమవారం యుకె పర్యటనకు వస్తున్న ట్రంప్ కోసం రెడ్ కార్పెట్ పరచడం బ్రిటిష్ లక్షణం కాదని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో ‘ద గార్డియన్’కోసం ఆయనో వ్యాసం రాశారు. ప్రపంచానికి దాపురించిన ప్రమాదాల్లో ట్రంప్ ఒకరని ఖాన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర మితవాదం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
2019-06-02 Read Moreబీహార్ మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విస్తరించారు. ఆదివారం కొత్తగా 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సంకీర్ణ భాగస్వాములైన బీజేపీ, ఎల్.జె.పి. నుంచి ఒక్కరిని కూడా తీసుకోలేదు. కేంద్రంలో మోదీ నాయకత్వంలో రెండోసారి ఏర్పడిన ఎన్.డి.ఎ. ప్రభుత్వంలో జెడి(యు)కు కేవలం ఒక్క మంత్రిపదవి ఆఫర్ చేయడంపై నితీష్ గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీ కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు. భవిష్యత్తులో కూడా చేరబోమని నితీష్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో బీజేపీకి స్థానమివ్వలేదు.
2019-06-02 Read Moreఅసాధారణమైన సంక్షోభంలోనే అద్భుతమైన అవకాశమూ ఉంటుందని యుపిఎ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన అనంతరం ఆమె నేతలతో మాట్లాడారు. గడచిన ఎన్నికల్లో అపరిమితమైన వనరులు, దుర్మార్గమైన ప్రచారంతో ప్రజాభిప్రాయాన్ని మార్చగల సామర్ధ్యం ఉన్న ఎన్నికల యంత్రాంగాన్ని ఎదుర్కొన్నామని చెప్పారు. కాంగ్రెస్ విలువలకు కట్టుబడిన నేతలను అభినందిస్తూ పార్టీకి ఓటు వేసిన 12.13 కోట్ల మందికి కృతజ్ఞతలు తెలిపారు.
2019-06-01యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నికయ్యారు. శనివారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో పార్టీ నేతలు సోనియాగాంధీని ఎన్నుకున్నారు. లోక్ సభలో పార్టీ పక్ష నేతను సోనియా ఎంపిక చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ.. లోక్ సభా పక్ష నేతగా వ్యవహరించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 16వ లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా మల్లిఖార్జున్ ఖర్గే ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.
2019-06-01 Read Moreమధ్యాహ్న భోజన పథకానికి తన తండ్రి వైఎస్ఆర్ పేరు పెట్టారు కొత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇకపైన మధ్యాహ్న భోజన పథకం ‘‘వైఎస్ఆర్ అక్షయపాత్ర’’ పేరుతో నడవనుంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మధ్యాహ్న భోజనంపైనే తొలి సమీక్షా సమావేశాన్ని శుక్రవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో నిర్వహించారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యా శాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. నాణ్యత విషయంలో రాజీపడవద్దని జగన్ స్పష్టం చేశారు.
2019-05-31