పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, పీపుల్స్ పార్టీ కో ఛైర్మన్ అసిఫ్ అలి జర్దారీని నకిలీ బ్యాంకు ఖాతాల కుంభకోణం కేసులో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఎబి) సోమవారం అరెస్టు చేసింది. అంతకు కొద్ది గంటల ముందే... ఆయన బెయిలు కొనసాగింపునకు చేసిన విన్నపాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. జర్దారీ ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు. హైకోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్టు జర్దారీ లాయర్ తెలిపారు.

2019-06-10 Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘన విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆదివారం తిరుమల దేవాలయాన్ని సందర్శించిన మోదీ, ఈ సందర్భంగా బీజేపీ బహిరంగ సభలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని మోదీ మరోసారి చెప్పారు. ఎన్నికల్లో గెలవడంతోపాటు ప్రజల మనసులు గెలవాలని మోదీ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

2019-06-09

మోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారం.. అసత్యాలు, విద్వేషం, విషంతో నిండిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్ నియోజకవర్గం (కేరళ)లో శనివారం ఓ సభలో కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. జాతీయ స్థాయిలో తాము వైషమ్యాలతో పోరాడుతున్నామని రాహుల్ పేర్కొన్నారు. మోదీ అసత్యాలకు, విద్వేషానికి ప్రతినిధి అయితే... కాంగ్రెస్ నిజానికి, ప్రేమకు నిలబడుతుందని ఉద్ఘాటించారు.

2019-06-08

ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, పుష్ఫశ్రీవాణి పాముల, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపె విశ్వరూప్, ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, పి. అనిల్ కుమార్, ఆదిమూలపు సురేష్, మేకపాటి గౌతమ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె. నారాయణ స్వామి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరి జయరాం, ఎస్.బి. అంజాద్ భాషా, ఎం. శంకరనారాయణ.

2019-06-08

గత ఎన్నికల్లో ఓడిపోయినవారిలో ఇద్దరికి ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గంలో చోటిచ్చారు. ఒకప్పుడు తనకోసం మంత్రి పదవిని కూడా వదులుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, తనపై కేసుల్లో సహనిందితుడిగా జైలుకు వచ్చిన మోపిదేవి వెంకటరమణ లను మంత్రివర్గంలో చేర్చుకున్నారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన మోపిదేవి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారు. సమీప భవిష్యత్తులో వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మంత్రులుగా కొనసాగించనున్నారు.

2019-06-07

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యుల్లో 12 మందిని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ శాసనసభ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. కాంగ్రెస్ తరపున గెలిచిన 18 మందిలో మూడింట రెండొంతుల మంది తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ కు విన్నవించారు. వారిని తమ సభ్యలుగా గుర్తిస్తున్నట్టు టీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు అసెంబ్లీ సచివాలయానికి తెలిపారు. దీంతో, రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు 4వ పేరాను అనుసరించి స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసెంబ్లీ నోటిఫికేషన్ పేర్కొంది.

2019-06-06

రెండున్నరేళ్ళ తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేస్తానని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రేపు ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు రెండున్నరేళ్ళ తర్వాత రాజీనామా చేయడానికి సిద్ధపడాలని ముందే స్పష్టం చేశారు. అప్పుడు కొత్తవారికి అవకాశం ఇస్తానని జగన్ చెప్పారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కేబినెట్ కొలువుదీరక ముందే జగన్ ప్రకటించిన ఈ నిర్ణయంపై చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు.

2019-06-07

రేపు ఏర్పాటు కానున్న మంత్రివర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారంనాడిక్కడ కీలక ప్రకటన చేశారు. 25 మందితో ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తానని, అందులో ఐదుగురికి డిప్యూటీ సిఎం హోదా కల్పిస్తానని పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు సామాజికవర్గాలనుంచి ఒక్కొక్కరిని డిప్యూటీలుగా గుర్తించనున్నట్టు చెప్పారు. మంత్రివర్గంలో ఆయా వర్గాలకు 50 శాతం స్థానాలు ఉంటాయని కూడా ప్రకటించారు.

2019-06-07

వాతావరణ మార్పునకు ఇండియా, చైనా, రష్యా కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆరోపించారు. యు.కె. పర్యటనలో ఉన్న ట్రంప్ బుధవారం ‘ఐ టివి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ఇండియా, చైనా చేయవలసినంత చేయడంలేదని విమర్శించారు. ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన వాతావరణం కలిగి ఉన్న దేశాల్లో అమెరికా ఒకటి అని పేర్కొన్నారు. పారిస్ ఒప్పందం నుంచి 2017లో వైదొలిగిన సందర్భంగా కూడా ట్రంప్ ఇండియా, చైనాలను నిందించారు.

2019-06-05

సిఎంగా ఉన్నప్పుడు సమావేశాలకోసం, సందర్శకులను కలవడానికి తన నివాసం ప్రక్కనే నిర్మించిన ‘ప్రజావేదిక’ను ఇప్పుడు కూడా తనకు కేటాయించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓ లేఖ రాశారు. ఎన్నికల తర్వాత సిఎం కార్యాలయాన్ని వదిలిన తాను, నివాసాన్ని మాత్రం ఇంతకు ముందున్న ప్రైవేటు నిర్మాణంలోనే కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. ‘ప్రజావేదిక’ను ప్రతిపక్ష నేత నివాసానికి అనుబంధం చేయాలని కోరారు.

2019-06-05
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page