తెలంగాణతో జల వివాదాలపై బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అవసరమైతే ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకెళ్లేందుకు తాము సిద్ధమేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మంత్రివర్గ సమావేశం అనంతరం స్పష్టం చేశారు. కె.ఆర్.ఎం.బి. ఆదేశాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ నీటిని వాడుకుంటోందని అనిల్ విమర్శించారు. తెలంగాణ వ్యవహార శైలిపై ప్రధాని మోదీకి, కేంద్ర జలశక్తి మంత్రికి లేఖలు రాస్తున్నామని తెలిపారు.

2021-06-30

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పైన ఆయన మాజీ పార్టీ (జెడి-యు) చీఫ్ ఆర్.సి.పి. సింగ్ మాటల తూటాలు సంధించారు. ప్రజాస్వామ్యం అంటే ఒక కంపెనీని నడపడం కాదని సింగ్ వ్యాఖ్యానించారు. బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికల విజయాలు ప్రజలు అందించినవని, ఎవరో ఒక వ్యక్తి వల్ల ఒరిగినవి కావని సింగ్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ కు బీహార్ లో ఎలాంటి పునాది లేదని, అనేక మంది రాజకీయ నేతలకు ప్రధాన మంత్రిత్వంపై ఆశలు చూపారని విమర్శించారు.

2021-06-29

మంచి పొరుగుతనపు స్నేహపూర్వక సహకార ఒప్పందాన్ని కొనసాగించాలని చైనా, రష్యా నిర్ణయించాయి. సోమవారం ఇరు దేశాల అధ్యక్షులు జి జిన్ పింగ్, వ్లాదిమిర్ పుతిన్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ అంశంపై చర్చించుకుని ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఒప్పందానికి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జిన్ పింగ్ మాట్లాడుతూ, శాశ్వత మిత్రత్వం అనే ఆలోచనను ఈ ఒప్పందం పాదుకొల్పిందని, రెండు దేశాల ప్రాథమిక ప్రయోజనాలకు, శాంతి-అభివృద్ధిలకు అనుగుణంగా ఉందని కొనియాడారు.

2021-06-28 Read More

పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ థంకర్ పైన ఆ రాష్ట్ర సిఎం మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. థంకర్ ఓ అవినీతిపరుడని, 1996 హవాలా జైన్ కేసులో నమోదైన చార్జి షీటులో అతని పేరు ఉందని ఆరోపించారు. అప్పట్లో జర్నలిస్టుగా ఉన్న ఓ వ్యక్తి తనకు ఈ సమాచారం పంపారని మమత చెప్పారు. ఇలాంటి వ్యక్తిని గవర్నరుగా ఎలా కొనసాగిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మమత, వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. థంకర్ ఇటీవల ఉత్తర బెంగాల్ లో జరిపిన పర్యటన వెనుక బెంగాల్ విభజన కుట్ర ఉందన్నారు.

2021-06-28 Read More

‘‘జుడాస్ కొన్ని కొన్ని వెండి తునకల కోసం క్రీస్తు దేవుడిని మోసం చేశారు. ఎల్.డి.ఎఫ్. కొన్ని బంగారు తునకల కోసం కేరళను మోసం చేసింది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరపున పాలక్కాడ్ నుంచి పోటీ చేస్తున్న మెట్రో మ్యాన్ శ్రీధరన్ కోసం మోదీ మంగళవారం ప్రచార సభలో మాట్లాడారు. కేరళ బంగారం స్మగ్లింగ్ కేసును నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఆపాదిస్తూ బిజెపి ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీధరన్ ను ప్రత్యామ్నాయంగా పేర్కొన్నారు మోదీ.

2021-03-30 Read More

డిఎంకె దిగ్గజం కరుణానిధి మనవడు, పార్టీ ప్రస్తుత అధినేత ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ‘చెపాక్-తిరువల్లికేని’ నియోజకవర్గం నుంచి ఉదయనిధి రంగంలోకి దిగారు. శుక్రవారం డిఎంకె అభ్యర్ధుల జాబితా వెల్లడైంది. గతంలో చెపాక్ నియోజకవర్గం నుంచి కరుణానిధి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో చెపాక్-తిరువల్లికేని ప్రాంతాలు విలీనమయ్యాయి. తొలుత సినిమా రంగంలోకి వెళ్లిన ఉదయనిధి స్టాలిన్, ప్రస్తుతం డిఎంకె యువజన నాయకుడిగా ఉన్నారు.

2021-03-12

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలపై ధీమాగా ఉన్న డిఎంకె, తాను పోటీ చేస్తున్న అన్ని స్థానాలకూ ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించింది. 234 సీట్లలో మిత్రులకు కేటాయించిన సీట్లు పోను డిఎంకె అధికారికంగా 173 చోట్ల పోటీ చేస్తోంది. శుక్రవారం ఆ 173 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ సారథి ఎంకె స్టాలిన్ ‘‘ఇది కేవలం అభ్యర్థుల జాబితా కాదు. విజేతల జాబితా’’ అని వ్యాఖ్యానించారు. డిఎంకె హేమాహేమీలు, ప్రస్తుత ఎంఎల్ఎలలో మెజారిటీ తిరిగి సీటు దక్కించుకున్నారు. స్టాలిన్ కొలత్తూరు నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు.

2021-03-12

ఎన్నికలకు ఏడాది ముందు ఉత్తరాఖండ్ సిఎం త్రివేంద్ర సింగ్ రావత్ పదవికి రాజీనామా చేశారు. నిన్న బిజెపి అగ్ర నేతలను కలసిన రావత్, వారి సూచనల మేరకు మంగళవారం రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 2017లో బిజెపి ఘన విజయం తర్వాత పదవిని చేపట్టిన రావత్, మరో 9 రోజులు ఉంటే సిఎంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకునేవారు. కొత్త సిఎం ఎవరన్నది బుధవారం జరిగే శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయిస్తామని రావత్ రాజీనామా అనంతరం బిజెపి నేతలు తెలిపారు.

2021-03-09

తమిళనాట అధికార అన్నా డిఎంకెతో తమ మైత్రి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఉద్ఘాటించారు. రెండు పార్టీలూ ఎన్నికలను సంయుక్తంగా ఎదుర్కొంటాయని ఆయన శనివారం మదురైలో చెప్పారు. ఒక రోజు పర్యటన కోసం తమిళనాడు వచ్చిన నడ్డా, శనివారం పార్టీ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. తమిళనాడు అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్-మే లలో ఎన్నికలు జరగాల్సి ఉంది.

2021-01-30 Read More

వ్యవసాయ చట్టాల విషయంలో రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ‘‘ఆఫర్‘‘ ఇప్పటికీ అలాగే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన శనివారం అన్ని రాజకీయ పార్టీల సభా నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులతో చర్చలకు తాము ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నామని మోదీ వ్యాఖ్యానించారు. ‘కిసాన్ గణతంత్ర పరేడ్’లో హింస తర్వాత, గత మూడు రోజుల్లో ఢిల్లీ సరిహద్దుల్లోని రైతుల శిబిరాలపై పోలీసులు, బిజెపి శ్రేణుల దాడులు జరిగాయి. శిబిరాల ఖాళీకి బలప్రయోగం చేస్తూనే ప్రధాని ‘ఆఫర్’ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

2021-01-30 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page