సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ‘ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు’ నినాదాన్ని బీజేపీ మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇదే ప్రధాన ఎజెండాగా ఈ నెల 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. భారత స్వాతంత్రానికి 2022లో 75 వసంతాలు నిండుతున్నందున చేయవలసిన ఉత్సవాలు, మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు తదితర అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి.

2019-06-16

ఆక్రమిత గోలన్ హైట్స్ ప్రాంతంలో ఇజ్రాయిల్ పౌరులు నివాసాలు ఏర్పరచుకున్న ప్రాంతానికి ఆ దేశం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు పెట్టింది. ఆ ప్రాంతంపై ఇజ్రాయిల్ సార్వభౌమాధికారాన్ని అమెరికా గుర్తించినందుకు ప్రతిగా ‘ట్రంప్ హైట్స్’ అని నామకరణం చేసింది. ట్రంప్ ను ‘గొప్ప స్నేహితుడు’గా వర్ణించిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. ఆదివారం ఈ నివాస ప్రాంతాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు సిరియాలో భాగమైన ‘గోలన్ హైట్స్’ను 1967లో జరిగిన యుద్దంలో ఇజ్రాయిల్ ఆక్రమించింది.

2019-06-17 Read More

గత కొద్ది నెలల్లో ఉప్పు నిప్పుగా ఉన్న భారత, పాకిస్తాన్ సంబంధాల్లో శుక్రవారం ఒక సానుకూల పరిణామం జరిగింది. షాంగై సహకార సంస్థ (ఎస్.సి.ఒ) సదస్సుకోసం కిర్గిజిస్తాన్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మధ్య శుక్రవారం మాటలు కలిశాయి. గురువారం రాత్రి కిర్గిజిస్తాన్ అధ్యక్షుడు ఇచ్చిన విందులో పలకరించుకోని ఈ ఇద్దరు నేతలూ శుక్రవారం ‘లీడర్స్ లాంజ్’లో కలుసుకున్నప్పుడు మాత్రం చేతులు కలిపారు. మోదీ కిర్గిజిస్తాన్ బయలుదేరే ముందు... ఖాన్ తో ద్వైపాక్షిక సమావేశం ఉండదని ఇండియా ప్రకటించింది.

2019-06-14

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక గత మూడు వారాల్లో తమ పార్టీ కార్యకర్తలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవారు 100 దాడులకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపించింది. 73 భౌతిక దాడులు జరగ్గా ఐదుగురు టీడీపీ కార్యకర్తలు మరణించారని, 25 ఆస్తుల ధ్వంసం ఘటనలు జరిగాయని టీడీపీ పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్దులతో శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో... వైసీపీ దాడులను ఖండిస్తూ ఓ తీర్మానాన్ని టీడీపీ ఆమోదించింది. మరణించినవారి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించింది.

2019-06-14

రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదా ఇచ్చే విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసు మార్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. రేపు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న నేపథ్యంలో విభజన హామీల అమలుకు సంబంధించి అమిత్ షాను కలసినట్టు జగన్ చెప్పారు. షాతో చర్చించిన అంశాలనే రేపు నీతి ఆయోగ్ సమావేశంలోనూ వినిపిస్తానని, రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదా ఇవ్వాలని కోరతానని పేర్కొన్నారు.

2019-06-14

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కంటే తమ పార్టీ రెండు సీట్లు అదనంగా తెచ్చుకోలేకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని తెలంగాణ బీజేపీ నేత రఘునందన్ సవాలు చేశారు. ఒక టీవీ ఛానల్ చర్చలో ఎదురైన ఈ సవాలుకు టీడీపీ నేత లింగారెడ్డి ప్రతి సవాలు విసిరారు. టీడీపీ తెచ్చుకునే సీట్లలో బీజేపీ నాలుగో వంతు సంపాదిస్తే చాలు..తాను రాజకీయ సన్యాసం చేస్తానని లింగారెడ్డి చెప్పారు. తమ సవాలుకు కట్టుబడి ఉంటామని ఇద్దరూ పునరుద్ఘాటించారు.

2019-06-14

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అమిత్ షా కేంద్ర మంత్రి కాక ముందు బీజేపీ అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడే ఓసారి జగన్ కలిశారు. అయితే, ఇప్పుడు అధికారికంగా కలసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. రాష్ట్ర విభజననాటి హామీల అమలు అంశంపై జగన్ చర్చించినట్టు చెబుతున్నారు.

2019-06-14

‘‘పార్టీ 37 ఏళ్ళ చరిత్రలో ఐదుసార్లు గెలిచాం. నాలుగుసార్లు ఓడిపోయాం. గెలిచినప్పుడు ఆనందం ఓడినప్పుడు ఆవేదన సహజం. అయినా ముందుకుపోవలసిన అవసరం ఉంది. గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడినప్పుడు కుంగిపోవడం సరికాదు’’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీ నేతలకు ఉద్భోదించారు. ఇటీవలి ఎన్నికల ఫలితాలపై విశ్లేషణకోసం ఆయన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్ధులతో శుక్రవారం విజయవాడలో సమావేశమయ్యారు.

2019-06-14

అమెరికా విదేశాంగ శాఖ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) మైక్ పాంపెయొ ఈ నెల చివరి వారంలో (24న) ఇండియాకు రానున్నారు. అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో... ఇండో పసిఫిక్ ప్రాంతంపై చర్చకోసం ఆయన న్యూఢిల్లీ వస్తున్నట్టు సమాచారం. నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక రక్షణ రంగంలో సహకారం పెంచుకోవచ్చని అమెరికా భావిస్తోంది. అదే సమయంలో ట్రంప్ విధానాల కారణంగా వాణిజ్య రంగంలో సంబంధాలు దెబ్బ తింటున్నాయి.

2019-06-11 Read More

భారత ప్రధాని నరేంద్ర మోదీ విమానం తమ గగనతలంపై ప్రయాణించడానికి పాకిస్తాన్ సమ్మతించింది. దీంతో కిర్గిజిస్తాన్ రాజధానిలో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే షాంగై సహకార సంస్థ (ఎస్.సి.ఒ) సదస్సుకు మోదీ దగ్గరి దారినుంచే వెళ్ళనున్నారు. ఫిబ్రవరి 26న భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ లోని బాలాకోట్ జెఇఎం స్థావరంపై దాడి చేసిన తర్వాత ఆ దేశం పలు విమాన రూట్లను మూసేసింది. ఈ నేపథ్యంలో.. ఎస్.సి.ఒ సదస్సుకు హాజరయ్యే మోదీ విమానాన్ని అనుమతించాలని ఇండియా విజ్ఞప్తి చేసింది.

2019-06-10 Read More
First Page 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 Last Page